Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శుక్రవారం, ఫిబ్రవరి 13, 2026

పెద్దపల్లి: జిల్లాలో వార్ వన్ సైడే..

పెద్దపల్లి ఎమ్మెల్యే నివాసం వద్ద కోలాహలం 

పెద్దపల్లి ప్రతినిధి: 

జిల్లాలోని రామగుండం కార్పొరేషన్, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది

పెద్దపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. గెలిచిన అభ్యర్థులు వీరే..

01) పూరెళ్ల శైలజ (కాంగ్రెస్) 

02) పస్తం లక్ష్మి(కాంగ్రెస్)

03) మోలుగురి కమల్  (కాంగ్రెస్)

04) కొమ్ము సుధాకర్ (కాంగ్రెస్) 

05) గుజ్జులా కుమార్ (కాంగ్రెస్) 

06) వెన్నం సుజాత (బిఆర్ఎస్) 

07) ఈర్ల స్వరూప (కాంగ్రెస్)

08) ఫర్జానా నాజ్ (ind) 

09) నాదిం (కాంగ్రెస్)

10) అక్కపెల్లి సుజాత (కాంగ్రెస్)

11) పురి అనూష (కాంగ్రెస్)

12) బొడ్డుపల్లి జగదీష్ (కాంగ్రెస్)

13) పాగల శ్రీకాంత్ (కాంగ్రెస్)

14) అస్లాం పర్వేజ్(కాంగ్రెస్)

15) పెంజర్ల రాకేష్ (బీజేపీ)

16) నందిని శ్రీనివాస్ (కాంగ్రెస్)

17) తోట ఫణీంద్ర (కాంగ్రెస్)

18) కలిపాక సంపత్ (AIFB)

19) రెవెల్లి స్వామి (కాంగ్రెస్)

20)  గణపతి నిర్మల (AIFB)

21) ముగిళ్ళ మల్లయ్య (కాంగ్రెస్)

22) ఉప్పు స్వరూప (కాంగ్రెస్)

23) జడల సురేందర్ (AIFB)

24) కొట్టే స్వరూప (కాంగ్రెస్)

25) శాహానజ బేగం (ఇండిపెండెంట్)

26) సుదమల్ల అమ్రేష్ (కాంగ్రెస్)

27) ఉనుకొండ సరస్వతి (కాంగ్రెస్)

28) తూముల లత (కాంగ్రెస్)

29) ఇల్లందుల రజని (కాంగ్రెస్)

30) ముక్సుదా బేగం (AIFB)

31) మంథని నర్సింగ్ (కాంగ్రెస్)

32) తిర్రీ శ్రీలత(కాంగ్రెస్)

33) గంగుల సంధ్యారాణి (AIFB)

34) ఆశ్రఫ్ (కాంగ్రెస్)

35) దేవానoది రమాదేవి (కాంగ్రెస్)

36) మాస్కాన్ సత్(కాంగ్రెస్)

మొత్తం : 36 కాంగ్రెస్         : 27 బీ ఆర్ ఎస్   : 1, బీజేపీ            : 1, ఫార్వర్డ్ బ్లాక్  : 5, ఇండిపెండెంట్ :- 2

మంథని: మంథని మున్సిపాలిటీ "హస్త"గతం

 కౌన్సిలర్ లుగా ఎన్నికైన అభ్యర్థులు

వీడియో 


మంథని:

మంథని మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 13 వార్డుల్లో 11 స్థానాలు గెలుచుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. గెలిచిన అభ్యర్థుల వివరాలు..

1వ  వార్డు కుర్ర లింగయ్య (కాంగ్రెస్)

2వ వార్డు నూకల కమల్ (కాంగ్రెస్)

4వ వార్డు మద్దికట్ల స్రవంతి (కాంగ్రెస్)

5వ ముస్కుల సహేందర్ రెడ్డి (కాంగ్రెస్)

7వ వారు జంబోజు శ్రీమతి సమ్మయ్య (కాంగ్రెస్)

8వ వార్డు లైశెట్టి రజిత రాజు (కాంగ్రెస్)

9వ వార్డు మారుపాక నిహారిక నాగరాజు (కాంగ్రెస్)

10వ వార్డు  పెంటరి రాజేందర్ (కాంగ్రెస్)

11వ వార్డు వోడ్నాల శ్రీనివాస్ (కాంగ్రెస్)

12వ వార్డు వేముల లక్మి సమ్మయ్య (కాంగ్రెస్)

13వ వార్డు ఎల్లంకి వంశీధర్ (కాంగ్రెస్)

కాగా..

3వ వార్డు మాచిడి రాజు (బీఆర్ఎస్), 

6వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి పోతరవేణ క్రాంతి గెలుపొందారు.

అందరి సహకారంతో అభివృద్ధి

అందరి సహకారంతో మంథని మున్సిపాలిటీ నీ అభివృద్ధి చేస్తానని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ లేఖ పూర్తి పాఠం మీముందు..

ప్రియమైన మంథని మున్సిపాలిటీ ఓటర్లకు నమస్కారం

ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించి, నాపై నమ్మకం ఉంచిన మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై మీరు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. 

అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు.. మీ కళ్ల ముందు కనిపించే మార్పులో చూపిస్తాను అని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నా. మీ అందరి సహకారంతో మంథని మున్సిపాలిటీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తా. 

ఈ గెలుపునకు అహర్నిశలు కృషి చేసిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు.

"విజయ గర్వంతో కాదు.. బాధ్యతతో మీ సేవలో.."

ప్రేమతో... అంటూ ముగించారు.


హైదరాబాద్: రెండేళ్ల ప్రజా పాలనకు ప్రజల ఆమోద ముద్ర


*  ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనం

* రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోద ముద్ర అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై ఉన్న తిరుగులేని విశ్వాసానికి నిదర్శనమని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయడమే అజెండాగా పెట్టుకున్న శక్తులకు ఈ ప్రజా తీర్పు ఓ చెంప దెబ్బ అని వాఖ్యానించారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూనే.... మరోవైపు అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల చెంతకు చేర్చాలన్న మా ప్రభుత్వ సంకల్పానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. ఈ గెలుపు ప్రభుత్వంపై బాధ్యతను మరింత పెంచిందని, ఈ స్ఫూర్తితో తెలంగాణను అన్ని రంగాల్లోనూ ఇతర రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేసి తీరుతామన్నారు. అబద్ధపు ప్రచారాలను నమ్మకుండా, అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలకు.... ఈ ఎన్నికల్లో విజయం కోసం ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మార్గ నిర్దేశనంలో, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు.

వీడియో...



గురువారం, ఫిబ్రవరి 12, 2026

కరీంనగర్: బల్దియా బాద్షా ఎవరు.?

కార్నర్ మీటింగులో మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు

కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్, పక్కన వీ హనుమంత్ రావు (వీఎచ్)


కరీంనగర్ ప్రతినిధి:

కరీంనగర్ బల్దియాలో ఎన్నికల యుద్ధం ముగిసింది. ఫలితం మిగిలింది. పక్షం రోజుల నుంచి నువ్వ నేనా అన్నట్లుగా ప్రచారం చేసిన అభ్యరులు ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు.

కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్, ఎంఐఎంతో పాటు కొత్తగా ఈసారి జనసేన, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో పాటు ఇండిపెండెంట్లు కూడా పెద్ద ఎత్తున పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల కోసం పార్టీ ప్రముఖ నాయకులు ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థుల ప్రచార బాధ్యతలన్నీ భుజాన వేసుకొని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నీ తానై వ్యవహరించారు. కార్నర్ మీటింగ్ లతో అటు కాంగ్రెస్,  ఇటు బిఆర్ఎస్ పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఒకటి రెండు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను పోటీలో పెట్టి, పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదని ఆ ఓట్లను సైతం తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. అలాగే కాంగ్రెస్ నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు కార్నర్ మీటింగ్ లతో అన్ని డివిజన్లలో ప్రచారం చేశారు. బిఆర్ఎస్ నుంచి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సైతం డివిజన్ లలో ప్రచారం చేస్తూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. అన్ని ప్రధాన పార్టీలు ర్యాలీలు, కార్నర్ మీటింగ్ లు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తించాయి. డివిజన్ లలో అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలో పోటాపోటీగా నిర్వహించారు.

పోలింగ్ ఎలా జరిగిందంటే..?

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లలో  3,40,580 ఓటర్లు ఉండగా, 2,14,486 ఓట్లు పోల్ అయ్యాయి. వాటిలో పురుషులు 1,05,579, మహిళలు 1,08,888 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తానికి 62.98 శాతం ఓటింగ్ పూర్తయినట్లు అధికారులు ధృవీకరించారు. శుక్రవారం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఏ డివిజన్ లో ఏ పార్టీ అభ్యర్థికి ఎడ్జ్ ఉంది.. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనే విషయమై ఎవరికి వారే అంచనా వేసుకుంటున్నారు.

*అంతుపట్టని ఓటరు అంతరంగం*

*కరీంనగర్ బల్దియా ఎన్నికల్లో ఓటరు అంతరంగం అంతుపట్టకుండా ఉంది. పోలింగ్ పూర్తయిన తరువాత అభ్యర్థులు తమ డివిజన్ లో ఓటర్లు ఎవరికి ఓటు వేశారో తేలుసుకోలేక అయోమయంలో ఉన్నారు.

*ఇండిపెండెంట్ అభ్యర్థుల వల్ల ప్రధాన పార్టీ అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ఏ పార్టీ అభ్యర్థుల ఓట్లపై ప్రభావం చూపుతుందోననే భయం పట్టుకుంది. ప్రధాన పార్టీల వల్ల టికెట్ రాకుండా భంగపడ్డ అభ్యర్థులు మరో పార్టీ నుంచి, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా రంగంలోకి దిగడంతో కూడా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

సోమవారం, ఫిబ్రవరి 09, 2026

మంథని: మంథని మున్సిపాలిటీ మాదే.. శ్రీధర్ బాబు కాంగ్రెస్ భారీ ర్యాలీ


* ప్రచారంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

* మంథని మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం

మంథని:

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంథనిలోని  శ్రీపాదరావు  విగ్రహం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరుపేద కుటుంబాలకు అందజేస్తూ ముందుకు వెళ్తుందని ఎక్కడ కూడా అవినీతి జరగకుండా నేరుగా పేదలకు చేరవేస్తున్నామని రానున్న రోజులలో మరింత మంథని పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మంథని నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకురావడం జరిగిందనీ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 13 మంది అభ్యర్థులను గెలిపించడం ద్వారా మంథని పట్టణ అధిక నిధులు కేటాయించి అభివృద్ధి జరుగుతుందని పనిచేసే వారికే ఓటు వేయాలని కోరారు. ప్రతిపక్షాలకు ఓటు వేయడం వృధా అని తెలిపారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లులు, మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన అన్నారు. కుట్టుమిషన్ల ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. ఇప్పటికే మంథని మున్సిపల్ కార్యాలయం సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి, దరఖాస్తుదారులు ఎవరైనా వచ్చిన వెంటనే దరఖాస్తుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి వారికి త్వరితగతిన విచారణ చేసి పనులు చేస్తామని మంత్రి తెలిపారు.

ప్రతి ఒక్కరికి వైద్యం అందాలనే ఉద్దేశంతో మంథనిలో ఐదు పడకల డయాసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎంపీడీవో ఆఫీస్ దగ్గర్లో నూతన 50 పడకల ఆసుపత్రికి నిర్మాణ పనులు జరుగుతున్నాయని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న అభ్యర్థులను గెలిపించుకొని మన మంథని పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ చేతి గుర్తు పై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ 13 వార్డు అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి మంథని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 13 వార్డులకు సంబంధించిన మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

పెద్దపల్లి : జిల్లాలో అన్ని మున్సిపాల్టీలు కాంగ్రెస్ కైవసం

* కాంగ్రెస్ గెలిస్తే పట్టణం మరింత అభివృద్ధి

* ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం

* త్వరలో పెద్దపల్లిలో ఐటీ పార్కు, ఆటోనగర్ ఏర్పాటు

* రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు

పెద్దపల్లి ప్రతినిధి:

జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని మున్సిపాల్టీ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం పెద్దపల్లి ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించిన యుద్ధ భేరి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుతోపాటు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గూడులేని నిరు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు. నిరుపేదలకు త్వరలోనే ఇంటి స్థలాలను కేటాయించి గేటెడ్ కమ్యూనిటీ కాలనీ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో త్వరలోనే ఐటీ పార్కు ఏర్పాటు చేయబోతున్నట్లు, ఆటో కార్మికుల కోసం ఆటో నగర్ నిర్మాణానికి స్థల సేకరణ కూడా చేసినట్లు ప్రకటించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ మంజూరులో పెద్దపల్లి అగ్ర స్థానంలో నిలిచిందని, అందుకు స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు  కృషి ఫలితమేనన్నారు. రూ. కోటితో జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టడీ కోచింగ్ సెంటర్ భవన నిర్మాణం. అత్యాధునిక సౌకర్యాలతో జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన రైతులందరికి రూ. 2 లక్షల రుణ మాఫీ అందించామని, సన్న వడ్లకు రూ.500 బోనస్ చెల్లించిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనన్నారు.  అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తించి పెద్దపల్లి పట్టణ ప్రజలు అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 


ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణాభివృద్ధికి రూ.92 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. మరో రూ.22 కోట్లు మంజూరు చేయించామని గుర్తు చేశారు. అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరిగెత్తిస్తున్నట్లు వివరించారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 మంది కాంగ్రెస్ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించే బాధ్యత ప్రజలదేనని, పట్టణాభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని ఎమ్మెల్యే ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్దపల్లి నియోజకవర్గానికి నిధుల ప్రవాహాన్ని తెప్పిస్తానని చెప్పారు. 

ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన వెంటనే పారదర్శకంగా జవాబుదారితనంతో ప్రజలకు సేవ చేసి గుర్తింపు పొందాలని సూచించారు. పట్టణాభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎన్నికల ఇన్చార్జి మరియు మాజీ ప్రజాప్రతినిధులు మరియు కౌన్సిలర్ అభ్యర్థులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు, పలు వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి - అభివృద్ధికి సహకరించండి

 
మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు

- ఈ ప్రాంతం మరో రాయలసీమ కావొద్దు.

- నేతన్నలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.

- పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా దోపిడే.

- వ్యాపారస్థులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది.

- బిఆర్ఎస్ ఎమ్మేల్యే పిట్ట బెదిరింపులకు భయపడేదిలేదు.

జమ్మికుంట:

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నామని ఇప్పుడు నేతన్నలకు కూడా అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ శాఖ,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం  జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్, జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు

అనంతరం ఆయన మాట్లాడుతూ తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఈ ప్రాంతంతో మంచి సంబంధాలు ఉన్నాయని,గతంలో అనేక సమస్యల మీద ఇదే గాంధీ చౌరస్తాలో ధర్నాలు నిర్వహించామని,అందులో కొన్ని ఇప్పుడు సంక్షేమ పథకాలుగా పురుడుపోసుకొని ప్రజలకు అందిస్తున్నామని,పదేళ్ల పాటు అరాచక దోపిడీ పాలనను బీఆర్ఎస్ నాయకులు కొనసాగించారని,దానికి విరుద్ధంగా సంక్షేమ పాలనను రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నామని అన్నారు.హుజూరాబాద్ ప్రాంతం మరో రాయలసీమ కావొద్దని,సెంటిమెంట్ తో మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు.ఎమ్మేల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి టీవీలు,ఫోన్ లో తప్ప ప్రజలకు అందుబాటులో ఉండడని అతని వల్ల ఏం ఉపయోగంలేదని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రణవ్ నాయకత్వంలో ఈ ప్రాంతానికి అధిక నిధులు కేటాయిస్తామని,ఆ బాధ్యత తాను తీసుకుంటానని,హుజురాబాద్ లో బెదిరింపు రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.వ్యాపారస్థులకు,నేతన్నలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి,ఆరుకాల వీరేశలింగం,సాయిని రవి,సారంగపాణి,పొనగంటి మల్లయ్య,పట్టణ,మండల అధ్యక్షులు,మహిళా అధ్యక్షురాల్లు,30 వార్డులనుండి పోటీ చేసే అభ్యర్థులు,సీనియర్ నాయకులు,మైనారిటీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆదివారం, ఫిబ్రవరి 08, 2026

మంథని: కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ నాయకులు



* మంత్రి సమక్షంలో చేరిన మాజీ ఎంపీపీ మాదాడి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి

మంథని:

బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ మదాడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంత రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మంత్రి శ్రీధర్ బాబు వారికీ కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు. వారితో పాటు  రెడ్డి సంఘము మాజీ అధ్యక్షులు ఎంఎస్ రెడ్డి, రామడుగు మారుతీ, రాదంటి శంకర్  మంత్రి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరడం చాలా సంతోష కరమన్నారు. మంథని పట్టణం తో పాటు మంథని నియోజకవర్గం అభివృద్ధి కోరకు వారు ముందుకు రావడం. పేద బడుగు బలహీన,మైనారిటీ వర్గాల అభివృద్ధి కొరకు వారి అనుభవంతో పాటు సలహాలు సూచనలు కుడా తీసుకుంటూ.. రానున్న రోజుల్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్ళతామన్నారు.

మంథని: మున్సిపల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం

ప్రచారంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని: 

మంథని మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం  మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా మంథని మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు అభ్యర్థి కుర్ర లింగయ్య, 2వ వార్డు అభ్యర్థి నూకల కమల్, 9వ వార్డు అభ్యర్థి మారుపాక నిహారిక, 13వ వార్డు అభ్యర్థి ఎల్లంకి వంశీ వార్డులలో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

అనంతరంమంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్య7మని పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించి అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు

రానున్న రోజుల్లో మంథని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించి, మంథని మున్సిపల్‌లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రజలను ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా పట్టణ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.


శనివారం, ఫిబ్రవరి 07, 2026

మంథని: ఎన్నికల ప్రచారంలో శ్రీను బాబు


మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లిలో ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారు బలపరిచిన 5వ వార్డు అభ్యర్థి ముస్కుల సయేందర్ రెడ్డి గారిని చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూచిరాజ్‌పల్లి ప్రజలను కోరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం,అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని,మంథని పట్టణ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.





9వ వార్డులో..
   మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు బలపరిచిన 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మారుపాక  నిహారిక  చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 9 వ వార్డు ప్రజలను కోరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం,అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని,మంథని పట్టణ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.

* మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి  చిత్రపటానికి నివాళి

మంథని పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న రాంరెడ్డి కాంప్లెక్స్‌లో మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి చిత్రపటానికి TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం రాంరెడ్డి కుటుంబ సభ్యులు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డిని కలిసి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

పెద్దపల్లి: మున్సి పాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం

 * కోట్ల రూపాయలతో పెద్దపల్లి పట్టణం అభివృద్ధి

* ఓట్ల కోసం వస్తున్న బీఆర్ఎస్, బీజేపీలను తరిమికొట్టండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండమెజారిటీతో గెలిపించాలి

*  పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు

పెద్దపల్లి ప్రతినిధి:

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలో   పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. 2వ వార్డు పాస్తాం లక్ష్మి, 8వ వార్డు ఎరుకల కల్పన, 9వ వార్డు ఎండీ నాదీమ్ వార్డుల్లో 21 వ వార్డు నుగుల్లా మల్లయ్య లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అదేవిధంగా వివిధ కూడళ్లలో రోడ్డు షో నిర్వహించి రెండేళ్ల తమ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి పట్టణం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు తీసుకవచ్చామన్నారు. పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపోతో పాటు బైపాస్ రోడ్డు మంజూరు చేయించామన్నారు.

ప్రధాన హదారులను అభివృద్ధి చేయడంతోపాటు వీధుల్లో సిమెంట్రోడ్లు,మురికి కాలువలు నిర్మిస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణపనులు జరుగుతున్నాయని, వాకర్స్ నడిచేందుకు వీలుగా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పట్టణంలోని అనివాడలకు తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. మహిళలకు ఆర్టీసీబస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచితవిద్యుత్, రైతు లకు 2లక్షల వరకు రుణమాఫీచేసి, 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమచేశామన్నారు. ఆరోగ్య శ్రీద్వారా 10లక్షలవరకు పెంచి ఉచితవైద్యాన్ని అందిస్తు న్నామని గుర్తుచేశారు. ఓట్ల సమయంలో వచ్చే బీఆర్ఎస్. బీజేపీలనిప్రజలుతరిమికొట్టాలన్నా రు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్నిచూసి ఈనెల 11న జరగనున్నఎన్నికల్లో చేతిగుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయా వార్డుల ఇంచార్జ్లు మరియు కార్యకర్తలు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

గురువారం, ఫిబ్రవరి 05, 2026

మంథని: అభివృద్ధిలో భాగస్వాములు కావాలి


 


మంథని మున్సిపల్ ఎన్నికల  ప్రచారంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంథని పట్టణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మంథని పట్టణంలోని 2వ,3వ,5వ,6వ, వార్డులలో సంబంధించిన అంబేద్కర్ నగర్, ముత్యాలమ్మ వాడ, బోయినపేట, దుబ్బగూడెం, గొల్లగూడెం ప్రజలతో మాట్లాడుతూ పార్టీ బలపరచినటువంటి అభ్యర్థులను 11న చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. 

యజుర్వేద స్వహాకార యజ్ఞంలో..



*శ్రీ అమ్నాయ వర్ధిని సేవా ట్రస్టు మంథని వారు శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర దేవాలయంలో నిర్వహించిన సంపూర్ణ యజుర్వేద స్వాహాకార యజ్ఞంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.  అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.

మంథని: మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డికి నివాళులర్పించిన మంత్రి

రాంరెడ్డి పార్టివ దేహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని: మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి  పార్థివదేహన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం సందర్శించి నివాళులర్పించారు.  అనంతరం ఆయన భార్యా  వసుమతి రెడ్డి, కుమారులు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డిలను ఓదార్చి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  

రాంరెడ్డి భార్య వసుమతి రెడ్డిని
ఓదారుస్తున్న శ్రీధర్ బాబు

రాంరెడ్డి కుమారులను పరామర్శిస్తున్న
 శ్రీధర్ బాబు

ప్రజా నాయకుడు రాంరెడ్డి

అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాంరెడ్డి గ్రామ సర్పంచ్, ఎంపీపీ, శాసనసభ్యులుగా మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవ చేశారనీ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఏది ఏమైనా మారుమూల అటవీ ప్రాంతమైన మంథని ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో, ఈ ప్రాంత ప్రజా సమస్యలపై ఓ ప్రజా నాయకుడిగా స్పందించారని అన్నారు. వ్యక్తిగత స్వార్థంతో ఆలోచించకుండా, ఒక ప్రతిపక్ష నేతగా వ్యక్తిగత దూషణలకు పోకుండా, రాజకీయమంటే ఇలా ఉండాలని ముందుకు తీసుకెళ్లిన నేపథ్యాన్ని ఈ రోజు గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాన్ని అన్నారు.






బుధవారం, ఫిబ్రవరి 04, 2026

పెద్దపల్లి: గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత నాది..

* పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు 

పెద్దపల్లి ప్రతినిధి;

పెద్దపల్లి పట్టణంలోని 28వ వార్డు సుభాష్ నగర్లో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి తూముల లత సుభాష్ రావు, 27వ వార్డు ఉనుకొండ సరస్వతి, 6వ వార్డు కట్ట పద్మావతి నరేంద్ర చారి మరియు 7వ వార్డు భూంనగర్లో ఈర్ల స్వరూప సురేందర్ కు మద్దతుగా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 


పెద్దపల్లి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించండి అని ప్రజలను కోరారు. పెద్దపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లో అన్ని రకాల వసతులను కల్పిస్తూ అభివృద్ధి మరియు సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా అభివృద్ధి, సంక్షేమం జోడెడ్డులులా దూసుకుపోతోందని గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో పేదలకు మరియు రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. ఎన్నికలు రాగానే బి.ఆర్.ఎస్ మరియు బీజేపీ పార్టీల వారు ఓట్ల కోసం తిరుగుతారని వారి మాయమాటలకు ప్రజలు ఎవరూ మోసపోవద్దని కోరారు. ఓట్ల సమయంలో వచ్చే బి.ఆర్.ఎస్ & బీజేపీ పార్టీల వారిని ప్రజలు తరిమికొడతారని అన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించి కౌన్సిల్ కు పంపిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని తెలిపారు. ఈ నెల ఫిబ్రవరి 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించమని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలు వార్డుల ప్రజలు,  మహిళలు  పాల్గొన్నారు.

పెద్దపల్లి: ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను బలపర్చండి

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

* కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించండి

పెద్దపల్లి ప్రతినిధి:

ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మున్సిపల్ లో గెలిస్తే పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయనీ రాష్ట్ర  ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా బుధవారం  పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గోల్డెన్ తులిప్ బ్యాంకెట్ హాల్ల్లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు తో కలిసి పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ హయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్చిన్నం చేసినా,  కాంగ్రెస్ పార్టీ దాన్ని గాడిలో పెట్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నానీ అన్నారు. బి.ఆర్.ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో పట్టణాలను, పల్లెలను గాలికొదిలేసారు ఆన్నారు. ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు అని ఎన్నికలు వస్తె అడ్డగోలుగా మాటలు చెప్పే పార్టీలు బి.ఆర్.ఎస్, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి పెద్దపల్లి జిల్లాకు నిధులు కేటాయించలేదని పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గత బి.ఆర్.ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ లను అరకొరగా కట్టి లబ్ధిదారులకు అందించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత డబుల్ బెడ్ రూం లకు మౌలిక సదుపాయాలు కల్పించి అందించిన ఘనత మీ ఎమ్మెల్యే విజయరమణ రావుదే అని అన్నారు. అలాగే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

మంథని: అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తాం


* మంథని మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 
మంత్రి శ్రీధర్ బాబు
* కో ఆప్షన్ సంబంధించి మైనార్టీ వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని పార్టీ నిర్ణయం

మంథని: మున్సిపాలిటీనీ సంబంధించిన ప్రజలకు దగ్గర ఎటువంటి  రూపాయి ఖర్చు లేకుండా పరిమిషన్ లో గాని ప్రజా అందాల్సిన పథకాల విషయంలో ఎలాంటి అవినీతి జరగకుండా పారదర్శకంగా ముందు వెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 

మంథని పట్టణ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రహదారులు, పరిపాలన, ఆరోగ్యం, విద్య, పట్టణ సౌకర్యాలు వంటి అన్ని రంగాలు సమగ్రంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించి వాటిని ఆచరణలో పెడుతున్నామని  మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటింటికి పథకాలు అందజేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ సంక్షేమం అర్హుల దరిచేరకుండా వారిని నమ్మించి మోసం చేసిన ఘనత ముమ్మాటికీ వారిదేనని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇచ్చి ఆకలి తీర్చామని, మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలకు ఇందిరమ్మ ఇల్లే గాని, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,రెండు లక్షల రుణమాఫీ,మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు,అనారోగ్య బాధితులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంపు చేయడం జరిగిందని అది కాంగ్రెస్ మార్కు పాలన అని చెప్పారు. ఇప్పటికే మంథని మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో  అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, మంథని పట్టణం రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.  

 ప్రజల విశ్వాసం మరియు ప్రజల ఆశీర్వాదాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ ఘన విజయం సాధించి,మంథని పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేశారు.

అభివృద్ధి కావాలంటే హస్తం గుర్తుకే ఓటేయాలని, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.









మంగళవారం, ఫిబ్రవరి 03, 2026

మంథని: పోరు బరిలో నిలిచేది వీరే..


మంథని మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ పడే ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆయా పార్టీ వర్గాలు ప్రకటించాయి. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు వారికి పార్టీ అందించిన బీ ఫారం ను ఎన్నికల అధికారులకు అభ్యర్థులు అందచేశారు.

కాంగ్రెస్ అభ్యర్థులు వీరే...

1వ వార్డు - కుర్రు‌ లింగయ్య.
2వ వార్డు - నూకల‌ కమల్.
3వ వార్డు - శ్రీపతి బానయ్య.
4వ వార్డు - ఎరుకల‌ స్రవంతి.
5వ వార్డు - ముస్కుల‌ సహేందర్ రెడ్డి.
6వ వార్డు - పోలు రజిత.
7వ వార్డు - జంబోజు‌‌ సమ్మయ్య.
8వ వార్డు - నరెండ్ల విజయలక్ష్మి.
9వ వార్డు - మారుపాక‌ నిహారిక.
10వ వార్డు - పెంటరి రాజు.
11వ వార్డు - వొడ్నాల‌ శ్రీనివాస్.
12వ వార్డు - వేముల‌ విజయలక్ష్మి.
13వ వార్డు - ఎల్లంకి‌‌ వంశీ

 బీఆర్ఎస్ అభ్యర్థులు

1వ వార్డు గంధం ఆంజనేయులు
2వ వార్డు - ఆరెపల్లి కుమార్
3వ వార్డు - మాచీడి రాజుగౌడ్
4వ వార్డు - బడికల లావణ్య శ్రీనివాస్
5వ వార్డు - అంబటి నర్సింగ్
6వ వార్డు - కాయితీ జ్యోతి సమ్మయ్య
7వ వార్డు - మంథని సంధ్య హరీష్
8వ వార్డు - కొత్త పద్మ
9వ వార్డు - దాసరి పుష్ప మల్లేష్
10వ వార్డు - బండారి సమ్మయ్య
11వ వార్డు - పుప్పాల తిరుపతి
12వ వార్డు - పూదరి లావణ్య సాగర్
13వ వార్డు - మంథని విజయ్ కుమార్

* బీజేపీ అభ్యర్థులు*


1st వార్డ్ కేతిరి విజయ
2 nd వార్డ్ దాసరి శ్రావణ్
3 rd  వార్డ్ చిలువేరి సతీష్
4 th వార్డ్ దూడపాక రోజ
5 th వార్డ్ బోయిని నారాయణ
6 th వార్డ్ తాత మధునమ్మ
7 th వార్డ్
8 th వార్డ్ ఎడ్ల మౌనిక
9 th వార్డ్ సామల లక్ష్మి
10 th వార్డ్ సామల అశోక్
11 th వార్డ్ రాపర్తి సంతోష్
12 th వార్డ్ శ్రీరామోజు సుజాత
13 th వార్డ్ గట్టు రాధాకిషన్

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026