10/10 జీపీఏతో మెరిసిన మనోజ్ఞ ను అభినందిస్తున్నకళాశాల చైర్మన్ గోవిందవరం కృష్ణ
దిక్సూచి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ద్వితీయ సెమిస్టర్ ఫలితాల్లో కరీంనగర్ పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థిని కట్కూరి మనోజ్ఞ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 10/10 జీపీఏ సాధించింది.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ గోవిందవరం కృష్ణ మనోజ్ఞను అభినందించి, కళాశాల విద్యార్థులు ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించడం సంస్థకు గర్వకారణమని అన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, నాణ్యమైన విద్యా ప్రమాణాలు, విద్యార్థుల కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ ఏ. మునీందర్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణను కూడా అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.