దిక్సూచి, కరీంనగర్:
కరీంనగర్లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరీంనగర్
అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన తడక శ్రీనివాస్, తాడిచెర్ల గ్రామానికి చెందిన చల్ల కిష్టయ్య, ఏవన్ హాస్పిటల్ లో మంథని మండలం కాకర్లపల్లె గ్రామానికి చెందిన బూడిది గణేష్ ను, ఆదర్శ హాస్పిటల్ లో జడల నాగరాజు సతీమణి సంధ్యారాణిని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆస్పత్రి వైద్యులను కోరారు. అలాగే ఇటీవల అస్వస్థత కు గురైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగినేని జగన్ మోహన్ రావు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. నేనున్నాను ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.