Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శనివారం, ఆగస్టు 23, 2025

హైదరాబాద్: యూరియా’పై ఆందోళన వద్దు


సచివాలయంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు సమీక్ష

రాష్ట్రానికి సరఫరా పెంచేందుకు అన్ని రకాల చర్యలు

ఆర్ఎఫ్సీఎల్ లో ఉత్పత్తి పునరుద్ధరణపై మార్గనిర్దేశం

రాష్ట్రానికి యూరియా సరఫరాను పెంచేందుకు మా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురి కావొద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు*. 

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) యాజమాన్యం, వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో శనివారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎఫ్సీఎల్ లో ఉత్పత్తి నిలిచిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సీజన్ లో 145 రోజుల్లో 40 రోజులు మాత్రమే ప్లాంట్ పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటే శాశ్వత చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆర్ఎఫ్సీఎల్ సీఈవో అలోక్ సింఘాల్ ను ప్రశ్నించారు. మిమ్మల్ని మేం కేవలం వ్యాపారవేత్తలుగా మాత్రమే చూడటం లేదని, రాష్ట్రాభివృద్ధిలో మాతో కలిసి నడిచే భాగస్వామిగా చూస్తున్నామని స్పష్టం చేశారు. 

ప్లాంట్ పునరుద్ధరణకు రూపొందించిన యాక్షన్ ప్లాన్ ను సమీక్షించి మార్గనిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణను చూడొద్దన్నారు. రామగుండంలో ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ఆర్ఎఫ్సీఎల్ మాతృ సంస్థ ఎన్ఎఫ్ఎల్ కు సంబంధించిన ఇతర ప్లాంట్ల నుంచి తెలంగాణకు ప్రతి రోజు ఒక రేకు యూరియాను సరఫరా చేసేలా చొరవ చూపాలని కోరారు. ఈ విషయంలో మీకేమైనా ఇబ్బందులుంటే కేంద్రంతో మాట్లాడి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని భరోసానిచ్చారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్ఎఫ్సీఎల్ రామగుండం యూనిట్ హెడ్, జీఎం రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండ: జనహిత పాదయాత్ర సమీక్షా సమావేశంలో శ్రీను బాబు

 


హన్మకొండ జిల్లా డీసీసీ కార్యాలయంలో శనివారం టీపీసీసీ జనహిత పాదయాత్రపై ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. దుద్దిళ్ల శ్రీను బాబు మాట్లాడుతు జనహిత పాదయాత్ర ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీని మరింత బలపరచే దిశగా అడుగులు వేస్తోంది. 25,26వ తేదీల్లో   వర్ధన్నపేట నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర ఉన్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేసి పాదయాత్ర విజయవంతం కావడానికి కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.

మహదేవపూర్: పలిమెల మండల పరిషత్ కార్యాలయం నిర్మాణానికి రూ.కోటి యాభై లక్షలు మంజూరు



ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

మంథని నియోజకవర్గంలోని అతిమారుమూల ప్రాంతమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని పలిమెల మండలానికి ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శనివారం తెలంగాణ ప్రభుత్వం నుండి పలిమెల నూతన మండల పరిషత్ కార్యాలయానికి కోటి 50 లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేయించారు. మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ మంత్రి సీతక్ కి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. పలిమెల మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఉండడం వల్ల మారుమూల ప్రాంతమైన ఈ మండలంలో గ్రామాలైన పంకెన, పలిమెల, దమ్మురు, సర్వాయిపేట, లెంకల గడ్డ, మోదేడు, నీలంపల్లి, ముకునూరు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేవేసే విధంగా ఉపయోగపడుతుందని,పలిమెల నూతన మండల పరిషత్ నిర్మాణానికి కోటి 50 లక్షలు ప్రభుత్వం నుండి మంజూరు కావడం పై మండలం లోని ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల ప్రజలు మంత్రి శ్రీధర్ బాబు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

మంథని: వర్క్ షాప్ సందర్శించిన బాలికల కళాశాల విద్యార్థులు

 


మంథనిలోని టీ వర్క్స్ కేంద్రంలో నిర్వహిస్తున్న డ్రీమ్ స్టార్ట్ రైజ్ వర్క్‌షాప్‌ను  శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్  కళాశాల విద్యార్థులు సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థినులు ఆధునిక పరికరాలు, ప్రోటోటైపింగ్ ప్రక్రియలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ప్రత్యక్షంగా వీక్షించారు. వర్క్‌షాప్‌లో నిర్వాహకులు విద్యార్థినులకు ఆవిష్కరణ, సృజనాత్మకత, సాంకేతిక రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించారు. ఇలాంటి ఫీల్డ్ విజిట్లు బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తు లక్ష్యాల సాధనకు ప్రేరణగా నిలుస్తాయని  నిర్వాహకులు తెలిపారు. విద్యార్థినులు కూడా ఈ సందర్శన తమకు కొత్త అనుభవాన్ని కలిగించిందని, సాంకేతిక రంగంపై ఆసక్తి పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యార్తినిలతో పాటు అధ్యాపకులు ఝాన్సీ, శ్రీధర్ రావు, తిరుపతి,నగేష్, ఎల్ ఆర్ కే రెడ్డి,సబిత, మౌనిక, దీపారాణి,  సురేష్ పాల్గొన్నారు.

గోదావరిఖని: గణపతి మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి

 


మాట్లాడుతున్న పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

రామగుండం పోలీస్ కమీషనరేట్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉన్నందున, రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను కమీషనరేట్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం లో మతసామరస్యం సోదర భావంతో పండుగలను  నిర్వహించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ క్వార్టర్స్ లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి, మంచిర్యాల జోన్  పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాద్- ఉన్-నబీ ల పండుగల దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా నిర్వహించారు. 

సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని సదుద్దేశంతో అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.గత సంవత్సరం రామగుండం కమిషనరేట్ పరిధిలో 4786 లో మంచిర్యాల జోన్ పరిధిలో- 2316,పెద్దపెల్లి జోన్ పరిధిలో  2476 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంవత్సరం వినాయక విగ్రహాల ఏర్పాటు పెరిగే అవకాశం ఉందన్నారు.వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా ఆన్లైన్ చేయడం విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేయడం చేస్తామని, నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా శోభయత్ర  సాఫీగా సాగేలా రూట్ మ్యాప్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు.గణపతి మండపాల వద్ద జరిగే కార్యక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రతి ఒక్క గణపతి మండప కమిటీ అధ్యక్షుడు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.గణేష్ మండపాల వద్ద నిర్మాణ కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి నిరంతర నిఘా ఉంటుంది.

24×7 నిరంతరం ప్రతి విగ్రహం వద్ద ఇద్దరు తప్పనిసరిగాఉండాలి. పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తాం, బ్లూ క్లోట్స్,పెట్రో కార్ వారు చెక్ చేయడం జరుగుతుందన్నారు. 

మండపాల పేరుతో ఎలాంటి లక్కీ డ్రాలు నిర్వహించకూడదు.అలాగే జూదాన్ని నిర్వహించరాదు. బలవంతపు చందాలు తీసుకోరాదు.గణేశుని మండపాల వద్దకు మద్యం సేవించి రాకుండా కమిటీ నిర్వాహకులు చూసుకోవాలి.ప్రతి మండపం వారు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలునిర్వహించకూడదు.

తప్పనిసరిగా విద్యుత్ శాఖ వారి అనుమతి తీసుకోవాలి,అనుమతి లేకుండా మండపాలకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయకూడదు. విద్యుత్ కనెక్షన్లు,లైట్ల ఏర్పాటుకు నాణ్యమైన వైర్లను,పరికరాలను వినియోగించాలి. ప్రమాదము జరగకుండా చూసుకోవాలి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్,అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,ట్రాఫిక్ కు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా చూసుకోవాలన్నారు.

విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల చుట్టూ ప్రక్కల నిమజ్జనం వెళ్లే దారులలో ఎలాంటి ఇబ్బందులు కలగాకుండా ఉండేలాగా ముందు గానే చూసుకోవాలి. కొంతమంది సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు పుకార్లు ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టే అవకాశం ఉందని ప్రజలు పోస్టులను చూసి సంయమనం పాటించాలని, నిజామా ,అబద్దమా అని స్థానిక పోలీస్ వారిని అడిగి తెలుకోవాలని అన్నారు.ఏలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే డయాల్ 100,కమీషనరేట్ కంట్రోల్ రూం 8712656597 కానీ లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.

సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేసి మత ఘర్షణలు జరిగేలాగా లా అండ్ ఆర్డర్ సమస్య కు కారణం అయితే అట్టి వారి ఫై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ హెచ్చరించారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని మతాలకు సంబంధించిన సమస్య ఆత్మక ప్రాంతాలను గుర్తించి నిరంతరం  నిఘా ఉంచి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను సంతోషంగా జరుపుకునేలా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సిపి గారు అధికారులను ఆదేశించారు.గణేష్ నిమజ్జనంతో పాటు,మిలన్ -ఉన్ -నబి పండుగలు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు సూచించిన నిబంధనలు కచ్చితంగా పాటించాలని శోభాయాత్ర సమయంలో పోలీస్ శాఖ రోడ్ మ్యాప్ ను అనుసరించాలని పోలీస్ వారికీ శాంతి కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, పెద్దపల్లి డిసిపి కరుణాకర్,  స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి, గోదావరిఖని ఏసిపి ఎమ్ రమేష్, మంచిర్యాల ఎసిపి ఆర్ ప్రకాష్ జైపూర్ ఏసిపి ఏ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్,ఏ ఆర్ ఏసి పి ప్రతాప్,గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు,పెద్దపెల్లి సిఐ ప్రవీణ్ కుమార్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్,ఇతర వింగ్స్ ఇన్స్పెక్టర్లు, పీస్ కమిటీ సభ్యులు,అన్ని మతల పెద్దలు పాల్గొన్నారు.

హైదరాబాద్: మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

ఐటీపీఐ సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

సాధారణంగానే ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరూ కావాలనే అడ్డుపడుతుంటారు. మూసీ విషయంలోనూ ఇదే జరుగుతోంది,భావి తరాల కోసం ప్రక్షాళన చేసి తీరుతాం,వెనక్కి తగ్గేదే లేదు,నీటి వనరుల పరిరక్షణలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణను రోల్ మోడల్ గా నిలుపుతాం అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇన్సిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ) తెలంగాణ స్టేట్ రీజినల్ ఛాప్టర్ ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్ లో ‘పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ టూవార్డ్స్ బయోఫిలిక్ అర్బనిజం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాల అభివృద్ధికి సరైన ప్రణాళికే పునాది అని అన్నారు. పర్యావరణం,సుస్థిరత లేకుండా ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదన్నారు. భవనాలను నిర్మించడమే అభివృద్ధి కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణతో కూడిన వృద్ధి ఆవశ్యకమన్నారు.ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది అని నొక్కి చెప్పారు. మనం రూపొందించే ప్రతి విధానం, కాపాడే ప్రతి అడవి, పునరుద్ధరించే ప్రతి నది, సృష్టించే ప్రతి జీవనోపాధి - ఇవన్నీ తరాల మధ్య న్యాయానికి సంకేతాలని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి, కార్బన్ – న్యూట్రల్ గ్రోత్, జల సంరక్షణ, సుస్థిర రవాణాలో తెలంగాణ అవలంభిస్తున్న విధానాలు, తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటే సుస్థిరాభివృద్ధితో కూడిన నగరాలను అభివృద్ధి చేయోచ్చన్నారు. వాతావరణ మార్పులు, పట్టణ వరదలు, పర్యావరణ కాలుష్యం, భూగర్భ జలాల తరుగుదల,పట్టణీకరణ, తరిగిపోతున్న పచ్చదనం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నగర ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీపీఐ ప్రెసిడెంట్ ఎన్ కే పటేల్, సెక్రటరీ జనరల్ కుల్ శ్రేష్ఠ, కో-ఆర్డినేటర్(టెక్నో అడ్మిన్) ప్రదీప్ కుమార్,ఐటీపీఐ తెలంగాణ రీజినల్ ఛాప్టర్ ఛైర్మన్ ఎస్.దేవేందర్ రెడ్డి, కార్యదర్శి కె.మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026