Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

గురువారం, జనవరి 22, 2026

ఖతార్: అట్టహాసంగా సంక్రాంతి ఉత్సవాలు




(ఖతార్ నుంచి రామడుగు వేణుగోపాల్)

ఆంధ్ర కళా వేదిక (AKV) నిర్వహించిన "సంక్రాంతికి వస్తున్నాము" సాంస్కృతిక మహోత్సవ కార్యక్రమాన్ని రంగ రంగ వైభోగంగా , అత్యంత అట్టహాసంగా kఖతార్ దేశంలో అల్‌వక్రా ప్రాంతంలోని DPS MIS పాఠశాలయందు 08.01.2025 గురువారం రోజున సాయంకాలం 5.30 గం. నుండి రాత్రి 12 గం. వరకు  నిర్వహించారు. ఐతే సాంస్కృతిక కార్యక్రమం విజయం అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు "ఆంధ్ర కళా వేదిక"  చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఒక మహా ఘట్టం.

కార్యస్థలిలో  అడుగు పెట్టగానే సంక్రాంతి ఉత్సాహంతో అలంకరించిన వేదిక ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.హరిదాసు , కోడిపుంజు , గాలిపటం, పాలుపొంగించే  సంప్రదాయ అలంకరణలు వేదికను మకర సంక్రాంతి పండుగలా  మార్చాయి. వాతావరణం పూర్తిగా మనవూర్లో జరిగే పండుగ జరుపుకున్న భావనకు గురిచేసింది .వేదికపై సంగీతం, లైటింగ్, నృత్యం కలసి ఒక అద్భుత దృశ్య కావ్యాన్ని సృష్టించాయి.


AKV కమిటి సభ్యులందరూ సంప్రదాయ ధోతీలు, శాలువాలు ధరించి, మహిళా సభ్యులు పచ్చని చీరలతో  వేదికపైకి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ గర్వంతో ఉప్పొంగిపోయారు.


సుమారు 80 మంది కళాకారుల భాగస్వామ్యంతో నృత్య నాటిక ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.ముఖ్యంగా 40 మంది కళాకారులతో శ్రీకృష్ణ లీలల ప్రదర్శన, వేలాది దీపాల వెలుగుల మధ్య, కనులకు  పండుగగా  ఆడిటోరియం అంతా ఆధ్యాత్మిక భావం కలిగించింది.  స్థానిక కళాకారుల ప్రదర్శనలు కూడా అద్భుతంగా ఉండటంవలన , ప్రతి ప్రదర్శనకు చప్పట్ల మోత మోగింది.  


కృష్ణ చైతన్య & మాళవిక గార్ల యుగళ గీతాలు ప్రేక్షకులను  ఉర్రూతలూగించింది.డాన్స్ మాస్టర్లు సత్య & తేజస్విని వేదికపై అగ్నిపర్వతంలా చెలరేగారు.నటుడు పృధ్వీ(థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ )  గారి కుమార్తె శ్రీలు చేసిన నృత్యం ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.


ఖతార్‌లోని భారత రాయబారి శ్రీ విపుల్  గారు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రసంగం ప్రారంభించి, సంక్రాంతి సందేశంతో ముగించగా, సభ మొత్తం హర్షధ్వానాలతో మార్మోగింది. ICC ప్రెసిడెంట్ మరియు భారత రాయబారి ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అభినందించారు.


AKV అధ్యక్షుడు శ్రీ రమణయ్య గారు తన ప్రసంగాన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రారంభించి, కమిటీ  సభ్యుల సమన్వయాన్ని అభినందిస్తూ, AKV కుటుంబ సభ్యుల నాణ్యత మరియు  సహకారాన్ని ప్రశంసిస్తూ , కార్యస్థలం  మొత్తం తెలుగు కుటుంబాలతో నిండినందుకు సంతోషం వ్యక్తం చేశారు.


రామ్ కీ హీరో గారి మాటలు, నటి భూదేవి గారి నృత్యం,జానపద గాయకులు సరళ మరియు జాన్  పాడిన గీతాలు జనాలను  పల్లె వాతావరణానికి  తీసుకెళ్లాయి.   యాంకర్ స్వప్న చౌదరి గారి యాంకరింగ్ కార్యక్రమానికి ప్రాణం పోసింది. ఆమె మాటల సమయంలో ఆడిటోరియం సంపూర్ణ నిశ్శబ్దంలోకి వెళ్లడం ఆమె ప్రతిభకు నిదర్శనం.


టి.డి జనార్దన్ గారు ( అన్న యన్ టీఆర్  లిట్రేచర్ కమిటీ చైర్మన్) గారు మాట్లాడుతూ తెలుగు భాష, యాస, మరియు తెలుగు రాష్ట్ర కీర్తిని ప్రపంచదేశాలకు తెలియజేసిన కీర్తిశేషులు శ్రీ నందమూరి తారకరారావుగారి గూర్చి అద్భుతంగా వర్ణించారు.


ఈ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు పూర్తిగా కుటుంబ సభ్యులే కావడం AKV చరిత్రలో ఒక విశేష ఘట్టం.

ఖతార్ నలుమూలల నుంచి వచ్చిన కుటుంబాలు పిల్లలతో సహా ఆనందంలో మునిగిపోయాయి. ప్రేక్షకులే వేదికపైకి వచ్చి కళాకారులతో కలిసి నృత్యం చేయడం వేదికను ఊపేసింది. పిల్లలు, పెద్దలు, యువత అందరూ ఒకటే ఉత్సాహం.

సాధారణంగా రాత్రి 10 గంటలకే ముగిసే ఈవెంట్, ప్రేక్షకుల ఉత్సాహం చూసి పోలీసులే అనుమతులు ఇస్తూ కార్యక్రమ సమయాన్ని రాత్రి పన్నెండు గంటలవరకు పొడిగించారు. మొదటి నుంచి చివరవరకు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసి ఒక్కరినికూడా కుర్చి నుండి లేవకుండా చేసాయి. 


ఈ కార్యక్రమం సూపర్ హిట్ కాదు, బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ కార్యక్రమం చివరన ప్రతీ ప్రేక్షకుడు తన భావం వ్యక్తం చేసాడు .

కళాకారులకు గౌరవం, స్పాన్సర్లకు ప్రాధాన్యం, AKV కమిటీ మరియు AKV కుటుంబ సభ్యుల సమిష్టి కృషి ఈ విజయంలో ప్రతిఫలించింది. “మళ్లీ తదుపరి కార్యక్రమం ఎప్పుడు చేస్తారు?” అన్న ప్రశ్నలే ఈ విజయానికి అద్దం పట్టాయి.


చివరగా అధ్యక్షులు శ్రీ రమణయ్య గారు ఈ చారిత్రాత్మక విజయానికి కారణమైన అందరు  కళాకారులకు, స్పాన్సర్లకు, AKV కమిటీకి, AKV కుటుంబ సభ్యులకు, మరియు వేలాది ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఒక కార్యక్రమం కాదని, ఇది ఆంధ్ర కళా వేదిక శక్తికి సజీవ సాక్ష్యం అని అన్నారు.

మంథని: ఫిబ్రవరి చివరి నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలి


మంథనిలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్

మంథని:  పెద్దపల్లి జిల్లాలో సహకార సంస్థల ఆధ్వర్యంలో చేపడుతున్న పీఎం-కుసుమ్ సోలార్ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని, ఫిబ్రవరి నెలాఖరు లోగా గ్రిడ్ కు అనుసంధానం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* ఆదేశించారు. గురువారం మంథని మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. 

మంథని మండలం కన్నాల గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, నాగారం గ్రామంలో ఎంపిపిఎస్,  పీ.హెచ్.సి సబ్ సెంటర్ , గుంజపడుగు గ్రామంలో నిర్మాణంలో ఉన్న పీ.హెచ్.సి భవనం, జడ్పీహెచ్ఎస్, 1 మెగా వాట్ సోలార్ ప్లాంట్ నిర్మాణం, మంథని లోని ఆర్డిఓ కార్యాలయ నిర్మాణ పనులు,   జడ్పీహెచ్ఎస్ బాలికలు, బుట్టుపల్లి లోని ఆర్ అండ్ ఆర్ పనులను  కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా  *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,*  కన్నాల పాఠశాలలో ప్రహరి గోడ, గేట్ ఏర్పాటు, మైనర్ మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. నాగారం గ్రామం లోని పాఠశాలలో మంజూరు చేసిన పనులు,  సబ్ సెంటర్ నిర్మాణ పనులు నెల రోజుల్లో లోగా పూర్తి చేయాలని అన్నారు. గుంజపడుగు జడ్పీహెచ్ఎస్ లో మంజూరు చేసిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ తెలిపారు.

గుంజపడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడ నిర్మాణ పనులు, అవసరమైన పరికరాల బిగింపు పూర్తి చేసి మార్చి నాటికీ హ్యాండ్ ఓవర్ చేయాలని

అన్నారు. గుంజపడుగు లో ఫ్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ పనులు పూర్తి చేసి ఫిబ్రవరి చివరి నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 

 సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో పాటు, సమాంతరంగా విద్యుత్ రవాణా కోసం ట్రాన్స్ మిషన్ లైన్ నిర్మాణ పనులు కూడా రెండు రోజుల్లో మొదలు పెట్టాలని, దీనికి డిస్కం అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. రెడ్కో, విద్యుత్ శాఖలను మంచి సమన్వయం చేస్తున్నారని డిసీఓ ను అభినందించారు.

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా సహకార రంగంలో నిర్మిస్తున్న తొలి ప్రాజెక్టులు పెద్దపల్లి జిల్లాలో చేపట్టడం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని, అందుకు సంబంధిత అధికారులు సంకల్ప సిద్ధితో కృషి చేయాలని సూచించారు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా గోదాముల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. బిట్టు పల్లి ఆర్&ఆర్ కాలనీ లో పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలని అన్నారు.  ఆర్ &ఆర్ కాలనీ లో అంతర్గత రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట  డీసీఓ శ్రీమాల, రెడ్కో జిల్లా మేనేజర్ దురిశెట్టి మనోహర్, కేడీసీసీ బ్యాంకు సీఈఓ సత్యనారాయణ రావు, ఎంపిడిఓ శ్రీజ, తహశీల్దార్ అరీఫోద్దిన్, ఏడీఈ వెంకటనారాయణ, రెడ్కో డిఓ మునీందర్, ఏడీఓ లక్ష్మీకాంత్, గ్రీన్ సెక్యూర్ రమాకాంత్ , ఏఈ పి.ఆర్. అనుదీప్, విక్రమ్,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026