![]() |
| రాంరెడ్డి పార్టివ దేహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు |
మంథని: మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి పార్థివదేహన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన భార్యా వసుమతి రెడ్డి, కుమారులు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డిలను ఓదార్చి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
![]() |
| రాంరెడ్డి భార్య వసుమతి రెడ్డిని ఓదారుస్తున్న శ్రీధర్ బాబు |
![]() |
| రాంరెడ్డి కుమారులను పరామర్శిస్తున్న శ్రీధర్ బాబు |
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాంరెడ్డి గ్రామ సర్పంచ్, ఎంపీపీ, శాసనసభ్యులుగా మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవ చేశారనీ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఏది ఏమైనా మారుమూల అటవీ ప్రాంతమైన మంథని ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో, ఈ ప్రాంత ప్రజా సమస్యలపై ఓ ప్రజా నాయకుడిగా స్పందించారని అన్నారు. వ్యక్తిగత స్వార్థంతో ఆలోచించకుండా, ఒక ప్రతిపక్ష నేతగా వ్యక్తిగత దూషణలకు పోకుండా, రాజకీయమంటే ఇలా ఉండాలని ముందుకు తీసుకెళ్లిన నేపథ్యాన్ని ఈ రోజు గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాన్ని అన్నారు.



కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి