కరీంనగర్ పట్టణంలో ప్రముఖ విద్యా సంస్థ అయిన నారాయణ హైస్కూల్లో విద్యా సంవత్సరంలోని టర్మ్ -1 ముగింపునకు అనుసంధానంగా విద్యార్థి కేంద్రీత విద్యకు నూతన నాందిగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది,
ఏటీఎం అన్నం చైతన్య రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రోగ్రాం ని ప్రారంభించారు అనంతరం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరియు ప్రాముఖ్యతని ప్రిన్సిపల్ ఎల్లాల భాస్కర్ రెడ్డి వివరిస్తూ విద్యార్థులు టర్మ్-1 లో నేర్చుకున్న పాఠ్యాంశంలోని ప్రతి విషయాన్ని తల్లిదండ్రుల సమక్షంలో వారి యొక్క చదువు మరియు సాధనను తామే ప్రదర్శించే కార్యక్రమంగా పేర్కొన్నారు.
అంతేకాకుండా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనే ఈ ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని మరియు భవిష్యత్తులో సమాజంలో ఆత్మనిర్బరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని వారి యొక్క అవగాహన,ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ప్రెసెంటేషన్ నైపుణ్యాలన్నీ ఆచరణలో చూపించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు,
అంతేకాకుండా నారాయణ స్కూల్ లో జరిగే ఇటువంటి ఆవిష్కరణత్మక కార్యక్రమాలు తమ పిల్లలలో మెరుగుపడుతున్న విద్యాభివృద్ధికి ఇది ఒక శాస్త్రీయ నిదర్శనంగా నిలుస్తుందని మేధావి వర్గాలకు చెందిన తల్లిదండ్రులు నారాయణ విద్యా సంస్థలను కొనియాడారు.
ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ నారాయణ విద్యాసంస్థల యొక్క జిఎం గోపాల్ రెడ్డి డీజీఎం వెంకటరమణారెడ్డి కోఆర్డినేటర్ రవళి వైస్ ప్రిన్సిపల్ శిరీష,శ్వేత, ఏడి సంపత్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
