Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

బుధవారం, అక్టోబర్ 07, 2026

తెలంగాణ బలం.. యువత నైపుణ్యమే


ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు
దిక్సూచి, హైదరాబాద్‌, అక్టోబర్‌ 7: తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువతలోని నైపుణ్యం, ప్రతిభ, ప్రపంచ స్థాయి పోటీతత్వమేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ ప్రతిభ కారణంగానే హైదరాబాద్‌ సాంకేతిక, ఆవిష్కరణ, ఆర్థిక సేవలు, గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లకు (జీసీసీ) దేశంలోనే ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందని వెల్లడించారు.
జూబ్లీహిల్స్‌లో బుధవారం నాడు జరిగిన డిఇ షా  షా (DE Shaw) ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌లో డీఈ షా మూడు దశాబ్దాల ప్రస్థానం నగరంపై, తెలంగాణలోని ప్రతిభావంతులైన మానవ వనరులపై ఆ సంస్థకు ఉన్న దీర్ఘకాలిక విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.
ఈ సందర్భంగా డిఇ షా గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు ఎడ్డీ ఫిష్‌మన్‌, అనూప్‌ ప్రసాద్‌, నీల్‌ కాట్జ్‌కు మంత్రి అభినందనలు తెలిపారు. సంస్థ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్లు చైతన్య గొర్రెపాటి, లక్ష్మీ ప్రసాద్‌ కోనేటితో పాటు సంస్థలోని మొత్తం బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.
హైదరాబాద్‌ సామర్థ్యాన్ని తొలినాళ్లలోనే గుర్తించిన ప్రపంచస్థాయి ఆర్థిక, సాంకేతిక సంస్థల్లో డిఇ షా ఒకటని శ్రీధర్‌బాబు అన్నారు. 1996లో హైదరాబాద్‌లో తొలి భారత కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.

“సుమారు 20 మందితో ప్రారంభమైన డిఇ షా ఇండియా ప్రస్థానం ఇవ్వాళ హైదరాబాద్‌, బెంగళూరు, గురుగ్రామ్‌లలో 2,000 మందికి పైగా ఉద్యోగులతో విస్తరించింది. సాంకేతికత, ఆర్థిక పరిశోధన, ఫైనాన్షియల్‌ ఆపరేషన్స్‌, కార్పొరేట్‌ విభాగాల్లోని సంస్థ బృందాలు ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నాయి” అని మంత్రి తెలిపారు.
మూడు దశాబ్దాలుగా డీఈ షా సాధించిన వృద్ధి హైదరాబాద్‌ ఎదుగుదలతో ముడిపడి ఉందన్నారు. నగరం ఇప్పుడు ప్రపంచస్థాయి సాంకేతిక, ఆర్థిక సేవల సంస్థలకు కేంద్రంగా మారిందని చెప్పారు.

“హైదరాబాద్‌ గత మూడు దశాబ్దాల్లో ఎంతో మారింది. సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థిక సేవలు, గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్లకు దేశంలోనే ప్రముఖ కేంద్రంగా ఎదిగింది. యువతలోని నైపుణ్యం, ప్రతిభే మన ప్రధాన బలం” అని శ్రీధర్‌బాబు అన్నారు.

ప్రపంచ సంస్థలు కేవలం తమ కార్యకలాపాలను నిర్వహించే ప్రదేశంగా కాకుండా.. కొత్త ఆవిష్కరణలు, అత్యున్నత విలువ కలిగిన కార్యకలాపాలు, భవిష్యత్‌ సాంకేతికతల అభివృద్ధికి తెలంగాణను కేంద్రంగా ఎంచుకునేలా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

“ప్రపంచ సంస్థలు ఇక్కడ విస్తరించాలి. ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి. అత్యున్నత నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలను సృష్టించాలి. ఇందుకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోంది” అని చెప్పారు.

డిఇ షా నియోపొలిస్‌లో ఏర్పాటు చేస్తున్న కొత్త కార్యాలయాన్ని మంత్రి స్వాగతించారు. హైదరాబాద్‌పై సంస్థకు ఉన్న దీర్ఘకాలిక నమ్మకానికి ఇది మరో నిదర్శనమన్నారు.

“నియోపొలిస్‌లో డిఇ షా ఏర్పాటు చేస్తున్న కొత్త కార్యాలయం కేవలం మరో కార్యాలయం కాదు. హైదరాబాద్‌ భవిష్యత్తుపై, తెలంగాణ వృద్ధి ప్రయాణంపై ఆ సంస్థకు ఉన్న విశ్వాసానికి ఇది బలమైన సంకేతం” అని శ్రీధర్‌బాబు అన్నారు.

కొత్త కార్యాలయం ద్వారా హైదరాబాద్‌లో డీఈ షా కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.

“ఈ విస్తరణను తెలంగాణ స్వాగతిస్తోంది. రానున్న రోజుల్లో డీఈ షా రాష్ట్రంలో మరింతగా విస్తరిస్తుందని ఆశిస్తున్నాం” అని మంత్రి చెప్పారు.

ప్రపంచస్థాయి సంస్థల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

“డిఇ షా నాయకత్వానికి నేను హామీ ఇస్తున్నాను. మీ వృద్ధి, విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార నిర్వహణలో సౌలభ్యం, ఆవిష్కరణలకు మరింత ప్రాధాన్యం ఇస్తాం” అని శ్రీధర్‌బాబు అన్నారు.

ప్రపంచ సాంకేతిక, ఆర్థిక సేవల సంస్థలకు తెలంగాణను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026