మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాద రావు సహోదరి, సువర్ణ వనమాల (91) అంతిమ సంస్కారం గురువారం గోదావరి తీరంలో నిర్వహించారు.
బుధవారం తెల్లవారుజామున కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ పరమపదించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు మేనత్త పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. వారి వెంట రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం, జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.







