Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

గురువారం, జనవరి 29, 2026

రామగుండం: సజావుగా సాగుతున్న నామినేషన్ల ప్రక్రియ

* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

* రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్

రామగుండం:   పురపాలక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జిల్లాలో సజావుగా కొనసాగుతుందని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష* తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముబారక్ నగర్, సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు  కలెక్టర్ అరుణశ్రీ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. 


జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 60 డివిజన్ లకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కోసం రామగుండంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశామని, పురపాలక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. 

జనవరి 30 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, జనవరి 31న  నామినేషన్ల పరిశీలన పూర్తి చేసి  సరిగ్గా  నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. నామినేషన్ తిరస్కరించిన అభ్యర్థులు  ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటల వరకు అప్పిల్ చేసుకునే అవకాశం ఉందని, సదరు అప్పీల్స్ ను ఫిబ్రవరి 2న పరిష్కరిస్తామని, ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, ఫిబ్రవరి 3 సాయంత్రం పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

పెద్దపల్లి: వనదేవతల సన్నిధిలో ఎమ్మెల్యే

 


 * జాతరకు కొత్త తారురోడ్లు   

 * ఇచ్చిన మాట తప్పేది లేదు

 * భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలి

 * పెద్దపల్లి ఎమ్మెల్యే  చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి ప్రతినిధి:

పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో గురువారం  సమ్మక్క, సారలమ్మల జాతర మహోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు గద్దెల పై కొలువుతీరిన వనదేవతలకు మొక్కలను చెల్లించుకున్న అనంతరం  స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పడిగిద్ద రాజును దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. 


ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 1 కోటి రూపాయల నిధులతో సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నూతనంగా తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అని అన్నారు. ఇచ్చిన మాట నెరవేర్చడమే తప్పా మాట తప్పేది లేదని స్పష్టం చేశారు. సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జాతర కమిటీ వారికి గౌరవ ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు, పలు గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు మరియు ప్రజాప్రతినిధులు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు..

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026