పట్టణ సుందరీకరణకు ప్రజలందరూ సహకరించాలి..
*పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు
పెద్దపల్లి పట్టణంలో కునారం రోడ్ మరియు కమాన్ రోడ్డు వద్ద టి.యూ.ఎఫ్.ఐ.డి.సి నిధులు ₹44.00 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్స్ మరియు ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ ని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ గారు మరియు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పెద్దపల్లి పట్టణాన్ని అభివృద్ధి చెయ్యడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని అందుకు నిదర్శనం ఇటీవల చాకలి ఐలమ్మ విగ్రహం నుండి జండా చౌరస్తా వరకు, పెద్దమజీద్ నుండి అమర్ నగర్ వరకు, దేవిడి కోట నుండి చాకలి ఐలమ్మ వరకు బీటీ రోడ్లను వెయ్యడం జరిగింది అని అలాగే చీకురాయి రోడ్, పెద్దమ్మ నగర్, చందపల్లి వైపు డివైడర్లను ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది అని వాటికి కూడ త్వరలోనే దసరా వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని జెండా చౌరస్తా కూడలి కూడ 50 లక్షల రూపాయలతో అద్భుతంగా హైలాండ్ లాగ త్వరలోనే అభివృద్ధి చేయడం6 జరుగుతుందని త్వరలోనే జండా చౌరస్తా నుండి మజీద్ వరకు వ్యాపారస్తులతో మాట్లాడి వారి అభిప్రాయం ఆలోచన మేరకు ఒక కోటి ఐబై లక్షల రూపాయలతో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయబోతున్నమని పెద్దపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ పరిసరాల్లో ఇండోర్ గేమ్స్ కొరకు కూడ ఆలోచన చెయ్యడం జరుగుతుంది అని పెద్దపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్ అభివృద్ధి పనులకు గౌరవ మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపన చేసినప్పటికీ వర్షాకాలం దృష్ట్యా పనులు మొదలు కాలేదని వర్షాకాలం అయిపోగానే పనులు మొదలు పెట్టడం జరుగుతుందని అన్నారు పెద్దపల్లి బస్ డిపో నిర్మాణం కూడ టెండర్ పూర్తి చేసుకోవడం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి పిల్లర్ల నిర్మాణం పూర్తి కావచయని పెద్దపల్లి పట్టణంలో కులాల వారిగా స్మశానవాటికలు ఉన్నప్పటికీ అందరికీ ఉపయోగపడేలా స్మశాన వాటిక లేకపోవడంతో గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగిందని త్వరలోనే అన్ని కులాలకు ఉపయోగపడేలా ఐదు కోట్ల రూపాయలతో మోడ్రన్ హిందు స్మశాన వాటిక త్వరలో అందుబాటులో తీసుకొస్తామని గడిచిన 18 నెలల కాలంలో 35 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ అధికారులకు పట్టణ ప్రజలకు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఏఈ సతీష్, వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.















