ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారు బలపరిచిన 5వ వార్డు అభ్యర్థి ముస్కుల సయేందర్ రెడ్డి గారిని చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూచిరాజ్పల్లి ప్రజలను కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం,అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని,మంథని పట్టణ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.
9వ వార్డులో..
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు బలపరిచిన 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మారుపాక నిహారిక చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 9 వ వార్డు ప్రజలను కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం,అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని,మంథని పట్టణ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.
* మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి చిత్రపటానికి నివాళి
మంథని పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న రాంరెడ్డి కాంప్లెక్స్లో మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి చిత్రపటానికి TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం రాంరెడ్డి కుటుంబ సభ్యులు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డిని కలిసి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.








కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి