Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శనివారం, సెప్టెంబర్ 06, 2025

హైదరాబాద్: మానవ సేవతోనే సమాజ వికాసం

 మాట్లాడుతున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

*ప్రతి ఒక్కరూ 'మానవ సేవే - మాధవ సేవ' అనే భావనతో ముందుకొచ్చి తోటివారికి సాయం చేస్తేనే సమాజం పురోగమిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. 

శనివారం బాచుపల్లిలో ‘కామరాజు అన్నపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కాలేజ్ ఫీ రెన్యూవల్స్ ప్రోగ్రామ్ ఫర్ ది అకడమిక్ ఇయర్ 2025-26 & ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘జనాభాకు అనుగుణంగా ప్రజల అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేవలం ప్రభుత్వాలు మాత్రమే కృషి చేస్తే సరిపోదు. సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే సామాజిక బాధ్యతతో కూడిన ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. ముఖ్యంగా కామరాజు అన్నపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకం.  ఎంతో మందికి స్ఫూర్తిదాయకం’ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ‘సమాజం మనకేమిచ్చిందన్నది కాదు, మనమేమిచ్చామన్నది ముఖ్యం. అన్నదానంతో పాటు విద్యాదానం చాలా ముఖ్యం. విద్య అనేది కేవలం ఒక డిగ్రీ కాదు, అది ఒక వ్యక్తి భవిష్యత్తును మార్చే శక్తి. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో 300 మంది పేద విద్యార్థుల చదువుకు సాయం చేస్తుండటం నిజంగా ప్రశంసనీయం. అందరికీ ఆదర్శనీయం’ అని కొనియాడారు. ‘సామాజిక సేవ అంటే కేవలం డబ్బులు ఖర్చు చేయడం మాత్రమే కాదు. ఒక చిరునవ్వు, మంచి మాట, చిన్న సహాయం కూడా సేవే. ఇప్పుడు మనం చేసే మంచి పనులు మనతోనే ఆగిపోవు. అవి మన పిల్లలకు, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి’ అని వివరించారు. ‘మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకోండి. అందుకు అనుగుణంగా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి... గొప్ప విజయాలు అంత సులభంగా రావు. ఓపిక, పట్టుదల, నిరంతర కృషి అవసరం. ఎన్ని అడ్డంకులొచ్చినా లక్ష్య సాధనలో ధైర్యంగా ముందుకు సాగండి. తప్పకుండా విజయం సాధిస్తారు’ అని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కామరాజు అన్నపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, ప్రణీత్ గ్రూప్ సీఎండీ నరేంద్ర కుమార్ కామరాజు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి: మంత్రి తుమ్మలకు ఎమ్మెల్యే ఫోన్

పెద్దపల్లి నియోజకవర్గం లో మరియు జిల్లాలోని రైతులకు సరిపడా యూరియా సక్రమంగా అందించేందుకు రాష్ర్ట ప్రభుత్వం  అన్ని చర్యలు చేపట్టిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. పెద్దపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే విజయరమణా రావు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో, పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులకు సరఫరా చేసిన యూరియా, ప్రస్తుతం ఉన్న నిల్వల వివరాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు.  మరింత యూరియా దిగుమతి అవుతుందని, రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో యూరియా నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఆదేశించారు. కొందరు ప్రతిపక్ష నాయకుల కుట్రలతో యూరియాపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు యూరియా అందేలా చూడాలన్నారు. ప్రైవేట్ డీలర్ల వద్ద నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ రైతులకు సరఫరా చేసేలా అధికారులు కష్టపడి పనిచేయాలని పేర్కొన్నారు. కేంద్రం నుండి అందాల్సిన సమయంలో సరిపడా యూరియా జిల్లాకు దిగుమతి కాకున్నా పెద్దపల్లి నియోజకవర్గంలో ముందస్తు చర్యలతో యూరియా ఇబ్బందులు ఎక్కువగా లేకుండా నియంత్రించామని తెలిపారు. రైతుల అవసరాల మేరకు యూరియాను అందుబాటులో ఉంచింది పెద్దపల్లి నియోజక వర్గంలో యూరియా కొరత లేకుండా చూస్తానని, రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే కోరారు. అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే విజయరమణా రావు ఫోన్ చేసి యూరియా అవసరాలను వివరించారు. పెద్దపల్లిలో తక్షణమే మరింత ఎక్కువగా యూరియా సరఫరా చేయాలని కోరగా స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే యూరియా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, పెద్దపల్లి ఏడీఏ శ్రీనాథ్, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

కరీంనగర్: ఆకట్టుకున్న రత్న గర్భ గణపతి

 



కరీంనగర్ హనుమాన్ రోడ్డులో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్న రత్న గర్భ గణేశుని నిమజ్జనం సందర్భంగా శనివారం రాత్రి శోభాయాత్ర కనుల పండువగా నిర్వహించారు. అందంగా అలంకరించిన అశ్వ రథంపై గణేశుని తిలకించేందుకు భక్తులు ఆసక్తి చూపారు. 



మంథని: ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

 కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సంయుక్త నిర్ణయం మేరకు పేద ప్రజల నిత్యవసర వస్తువులపై మరియు ఆటోమొబైల్ రంగంలోని వస్తువులపై గణనీయమైన రీతిలో జిఎస్టి తగ్గించారు. ఇది చరిత్రలో గొప్ప మైలురాయిగా నిలుస్తుందని నరేంద్ర మోడీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ మంథని  పట్టణం నాయకులు పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇన్చార్జి చంద్రుట్ల ఆదేశాల మేరకు అంబేద్కర్ చౌరస్తాలో పాలాభిషేకం చేశారు.

హైదరాబాద్: మంథని గణేశుని నిమజ్జనాలు వీడియోలు


హైదరాబాద్ లో మంథని గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన నిమజ్జన సందర్భంగా  శోభాయాత్ర లో పాల్గొన్న మహిళలు, యువతులు. 

ఆకట్టుకున్న ప్రముఖ కవి మహవాది సూర్యప్రకాష్,మారుపాక నగేష్ నృత్యాలు



మందాట గజాననుని నిమజ్జన్ యాత్ర

మందాట  గజాననుని శోభా యాత్ర

పెంజేరుకట్ట గణేశుని నిమజ్జన్ యాత్ర


మంథని: ఉపాధ్యాయులకు సన్మానం

మంథని పట్టణంలోని పెంజేరుకట్ట వీధిలోని హనుమాన్ దేవాలయంలో  ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఉపాధ్యాయులను రిటైర్డ్ ఇంజనీర్, సామాజిక కార్యకర్త దహగం లింగన్న ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తున్న చిలప్పగారి సునీల్, రామడుగు శ్యామల, దహగం శ్రీలక్ష్మి, పనకంటి శ్రీకాంత్ లను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించడం మన సంప్రదాయమని ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పనకంటి చంద్రశేఖర్, 
రిటైర్డ్  ఉపాధ్యాయుడు అవధాని మోహన్ శర్మ, సీనియర్ న్యాయవాది లోకే రాధాకిషన్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు లోకే మనోహర్, లోకే రమాకాంత్, దహగం శ్రీపాద్, చిలప్పగారి గణేష్,  కొంతం మోహన్, పాల్గొన్నారు.

మంథని : ఆదిత్య హాస్పటల్ ప్రారంభించిన శీను బాబు

మంథని మున్సిపల్ లో ఆదిత్య హాస్పటల్ ఎమర్జెన్సీఅండ్ కిట్ కాల్ కేర్ ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు

గణేశునికి ఘనంగా వీడ్కోలు

నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న గణేష్ మహరాజ్ నిమజ్జనం వైభవోపేతంగా నిర్వహించారు. భజన పాటలు, కోలాటాలు, డ్యాన్సులతో ఊరేగింపు నిర్వహించి జలాశయాల్లో నిమజ్జనం చేశారు.

వీడియో కోసం క్లిక్ చేయండి
https://youtube.com/shorts/qRzK-rtNKVU?si=L3LyhPDFJui7Ly54

గోదావరిఖనిలో..
కరీంనగర్ లో గణేష్ శోభాయాత్ర
పెద్దపల్లిలో..

కరీంనగర్ లో మంథని గణేష్ మిత్రమండలి గణేశుని శోభాయాత్ర
మంథని పెంజేరుకట్ట సర్వజన గజానన మండలి గణేశునీ శోభాయాత్ర

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026