Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

మంగళవారం, ఆగస్టు 19, 2025

మంథని: గొల్ల గూడెంలో శ్రావణ సందడి



గొల్లగూడెంలో కొలువైన బలవీర హనుమాన్

మంథని మున్సిపల్ పరిధిలోని బోయినపేట లోని శ్రీ బల వీర హనుమాన్ దేవాలయం శ్రావణ మాసంలో భక్తుల సుదర్శన తో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతంలో ఎంతో మహిమాన్వితం కలిగిన శ్రీ బలవీర హనుమాన్ దేవాలయానికి శ్రావణమాసంలోనే నాలుగు శనివారాలు 4 మంగళవారాల్లో ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జాతరలా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. బలవీర హనుమాన్ ప్రాముఖ్యత ఎంతో ప్రాచుర్యం పొందింది. మంథని కి కిలోమీటర్ దూరంలో ఉన్న బోయిన్ పేట లో స్వయంభుగా వెలసిన ఆంజనేయ స్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా భక్తులు ఎంత విశ్వాసంతో దర్శించుకుంటారు. అనంతరం శ్రీ కాళికామాతను దర్శించుకుని భక్తులు పునీతులు అవుతారు. శ్రావణ శనివారం రోజున ఈ ఆలయంలో ఎక్కహం 24 గంటల పాటు ప్రజల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంథని ప్రాంతంలో నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ బలవీర హనుమాన్ ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

మంథని:పార్వతి బరాజ్‌ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే


మేడిగడ్డ బరాజ్‌ దెబ్బతిందని చెప్తున్నారని, కానీ పార్వతీ బరాజ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకున్నా గేట్లు ఎత్తి నీళ్లను ఎందుకు వృధా చేస్తున్నారో జవాబు చెప్పాలనీ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ప్రశ్నించారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీని గోదావరి విలాపం అనే పేరుతో స్థానిక నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బారీ వర్షాలు పడి ఎగువనుంచి బారీగా వరదనీరు చేరి గోదావరినది నిండుగా ప్రవహిస్తోందని, నీళ్లు వృధాగా పోతుంటే గోదావరి నది కన్నీరు పెట్టుకుంటుందన్నారు. ఈనాడు లక్షల క్యూసేక్కుల నీళ్లు వృధాగా ఉప్పు నీళ్లలో కలిపేస్తున్నారని, తనను ఎవరికి ఉపయోగపడకుండా చేస్తున్నారని గోదావరి మాత గోస వెల్లబోసుకుంటుందన్నారు. ఆనాడు ప్రకృతికి విరుద్దంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రివర్స్‌ పంపింగ్‌ చేసి నీటిని పైకి తీసుకువస్తే శాపం తగులుతుందని అనుకున్నా కానీ నేడు నీళ్లన్ని వృధాగా పోయి సముద్రంలో కలుస్తుంటే ఆనాడు కేసీఆర్‌ చేసిన ఆలోచన ఎంతో గొప్పదని గోదావరి నది చెప్తోందన్నారు. నీళ్లు వృధా పోతున్నా ఆపాలనే ఆలోచన చేయకుండా ఇటు రైతులకు, ప్రజలకు ఉపయోగపడకుండా చేస్తున్నారని గోదావరినది మొరపెట్టుకుంటుందని, కళ్లున్న కాంగ్రెస్‌ నాయకులకు గోదావరి నది గోస కన్పించడం లేదా అని ప్రశ్నించారు. 

గోదావరిఖని:ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు ను పరిశీలించిన కలెక్టర్

 


నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలి

పెద్దపల్జి కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఎల్లంపల్లి రిజర్వాయర్ లో నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం అంతర్గాం లోని ఎల్లంపల్లి రిజర్వాయర్ ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ లో ఉన్న నీటి నిల్వ ఎంత ఉంది?  ఇన్ ఫ్లో ఎంత ఉంది? ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఎంత? వంటి వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు.

ప్రస్తుతం 35 గేట్ల ద్వారా  ఎల్లంపల్లి నుంచి దిగువకు వరద విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టు నుంచి భారీ ఎత్తున వరద వస్తున్నందున ఎల్లంపల్లి దిగువకు నీరు విడుదల చేస్తున్నామని, ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, చేపలు పట్టేవారు రైతులు సామాన్య ప్రజలు నది దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. 

ప్రాజెక్టులో నీటి నిల్వ పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఆధారంగా ఎప్పటికప్పుడు దిగువకు నీరు విడుదల చేయాలని  కలెక్టర్ సూచించారు. డ్యాం గేట్లను పరిశీలించి వాటి నిర్వహణను  పర్యవేక్షించారు. నీటి విడుదల అంశాలు రెగ్యులర్ గా ప్రెస్ కు విడుదల చేయాలని కలెక్టర్ ప్రాజెక్ట్ అధికారులకు సూచించారు.


భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు నీటిమట్టం అంచనా వేస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.  

*అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి రామగుండం మండలం లోని ముంపు ప్రాంతం మల్కాపూర్ గ్రామంలో పర్యటించి  లోతట్టు ప్రాంతాలలో* నీరు ఒకే చోట నిల్వకుండా చర్యలు  తీసుకోవాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సీఈ సుధాకర్ రెడ్డి, ఎస్.ఈ. సత్యనారాయణ, డీఈ బుచ్చి బాబు, శరత్ బాబు,తహసిల్దార్ ఈశ్వర్, ఈ ఈ రామన్, సంబంధిత అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.

మంథని: సహకార సంఘంలో రైతులకు అందుబాటులో యూరియా

 

సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని లో 900 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం పిఎసిఎస్ మంథని లో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ యూరియా బస్తాల కోసం వచ్చే రైతులు తమ వెంట పట్టా దారు పాసు పుస్తకం, ఆదార్ జీరాక్స్ ప్రతులు తమ వెంట తీసుకు రావాలని కోరారు. ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యెక చొరువతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరిపడా యూరియా బస్తాలు అందుబాటులో ఉంచుతున్నామని, రైతులు ఏ మాత్రం అధైర్య పడవద్దని, రైతులకు యూరియా కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అలాగే వ్యవసాయ శాఖ ఏడిఏ, ఏఓ, ఏఈఓ ల సహకారంతో యూరియా కొరత లేకుండా తగు చర్యలు చేపడుతున్నారని,రైతులు తమ అవసరాల మేరకే యూరియా తీసుకొని వాడుకోవాలని కోరారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026