దిక్సూచి, కరీంనగర్, జూలై 19:
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా జువ్వాడి అమరేందర్ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం అమరేందర్ రావుకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ఆదేశించారు. పార్టీ సిద్ధాంతాలను బలంగా ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
నియామకం పట్ల స్పందించిన జువ్వాడి అమరేందర్ రావు మాట్లాడుతూ పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పట్ల తన నిబద్ధతను, విధేయతను నిరూపిస్తూ, అధిష్టానం, డీసీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
డిసిసి అధ్యక్షునితో పాటు కాంగ్రెస్ నాయకులు బైరిశెట్టి సంపత్, వెల్మ కృష్ణ రెడ్డి, రాజా నరసింగారావు, కోల ప్రభాకర్, కర్ర కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
*ఇట్లు*
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ




