Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శనివారం, జూన్ 27, 2026

అభివృద్ధిని జీర్ణించుకోలేక ఆరోపణలు



 - సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ విప్ ఆరెపల్లి మోహన్*

- అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా: మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ సవాల్*  

*మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి

 - శ్రీధర్ బాబు నిజాయితీ రాష్ట్రానికే తెలుసు. - కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్:

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై, రాష్ట్ర ప్రభుత్వంపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ మండిపడ్డారు. గురువారం నగరంలోని కెమిస్ట్ భవన్ లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, ఆర్ జిపిఎస్ రాష్ట్ర కోకన్వీనర్ ఉప్పుల అంజన్ ప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అకారపు భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి తాజుద్దీన్, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్, ఎన్.ఎస్.యు ఐ రాష్ట్ర నాయకులు పోతారం సురేందర్ తదితరులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆరెపల్లి మోహన్  మాట్లాడుతూ.. 

ఫ్యూచర్ సిటీలో అవకతవకలు జరిగాయని, మంత్రి శ్రీధర్ బాబు  అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీధర్ బాబు పై చేసిన ఆరోపణలపై మీ వద్ద సాక్ష్యాలు ఉంటే బహిరంగపరచాలి. అవినీతిని రుజువు చేసినట్లయితే రాజకీయాల నుండి శాశ్వతంగా వైదొలుగుతానని,  నిరూపించినట్లయితే జీవన్ రెడ్డి  రాజకీయాల నుండి తప్పుకుంటారా ఆరెపల్లి మోహన్ సవాల్ విసిరినారు.  ధైర్యం ఉంటే 2016 నుండి మంథని ప్రాంతంలో ఇసుక దందా ఎవరు ప్రారంభించారో రుజువు చేయాలని అన్నారు, ఇసుక మాఫియాను విచ్చలవిడిగా కొనసాగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని మండిపడ్డారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు ఎకరాల భూమి ఏమైందని, దళితులకు ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన భూములను తీసుకొని స్మశాన వాటికల్లో రైతు వేదికలు నిర్మించిన సంగతి నిజం కాదా అని నాడు కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు గారి తండ్రితో పని చేశానని చెప్పుకుంటూ ఆయనను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. శ్రీధర్ బాబు గారి నిజాయితీ గురించి జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు జీవన్ రెడ్డి గత చరిత్ర ఒకసారి గుర్తు చేసుకోవాలి అని పేర్కొన్నారు

వామన్ రావు దంపతుల హత్య ఉదంతం మంథనిలో శాంతి భద్రతల లోపించడానికి ఎవరు బాధ్యులు జీవన్ రెడ్డి కి తెలియదా అని ప్రశ్నించారు.

బిఆర్ఎస్ పాలనలో దళిత బంధు పథకాన్ని కేవలం హుజురాబాద్‌కు మాత్రమే ఎందుకు పరిమితం చేశారు? రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదు? దీని గురించి బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడరు అని మండిపడ్డారు.

కులాలకు, మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. నాడు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ కొనసాగుతున్నాయి. వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 100 శాతం న్యాయం చేసింది అని అన్నారు.

*సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ*   

బిఆర్ఎస్ నేతలు తమ ఉనికి కోల్పోతున్నామని, SIR పేరుతో నియోజకవర్గాల పర్యటన చేపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై అక్కసు వెళ్లగకుతున్నారు. పుట్ట మధుకర్ అనే వ్యక్తి ఇసుక దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్. నేటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఇసుక కాంట్రాక్టర్లను, రోడ్డు కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాంటి వ్యక్తికి వంట పడుతూ జీవన్ రెడ్డి గారు మాట్లాడటం సరైన పద్ధతి కాదు.

కాళేశ్వరంలో రెండు గేట్లు కుంగిపోతే దానిని చిన్నచూపు చూస్తూ ఏం నష్టం జరుగుతుందని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనం. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకొని, సొంత ఖజానాకు తరలించి, అప్పుల పాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలు కాకపోవడానికి కారణం మీరు చేసిన అప్పులే.  

గ్రానైట్ క్వారీలలో బ్లాక్ మెయిల్‌కు పాల్పడి వసూలు చేసింది కేటీఆర్, హరీశ్ రావు కాదా? రాబోయే రోజుల్లో శ్రీధర్ బాబు లాంటి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం. మా కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే మీరు తట్టుకోలేరు.  

ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం ఇవ్వడం ప్రజా వంచన అవుతుందా? బాధ్యతగల మంత్రిగా ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రీధర్ బాబు ఎంతో శ్రమిస్తున్నారు అని వెల్లడించారు.

పార్టీ విజయానికి బూత్ స్థాయి కార్యకర్తలే వెన్నెముక


‎*కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్  శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

‎* స్క్రీన్ ప్రజెంటేషన్ ద్వారా BLAలు, SIR ప్రక్రియపై అవగాహన కల్పించిన దుద్దిళ్ల శ్రీను బాబు


‎వరంగల్ : పార్టీ విజయానికి బూత్ స్థాయి కార్యకర్తలే వెన్నెముక అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు.

వరంగల్ జిల్లా మడికొండ  శ్రీ సత్య సాయి ఫంక్షన్ హాల్ లో శనివారం వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కేఆర్ నాగరాజ్ గారి అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ (BLA) శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

‎ఈ సందర్భంగా మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో BLAలు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.

‎అదేవిధంగా సర్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధి విధానాలు, ఓటర్ల వివరాల ధృవీకరణ, ఫారమ్‌ల నింపడం, అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చే అంశాలపై BLA లకు సమగ్ర అవగాహన కల్పించారు.

ప్రతి బూత్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా క్రమబద్ధంగా పనిచేయాలని, ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

‎ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు), కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


అల్లుడి హత్యకు అత్త స్కెచ్‌

కూతురి చావుకు ప్రతీకారం.. 

రూ.10 లక్షల సుపారీ 

కాటారం:
తన బిడ్డ చావుకు కారణమై అల్లుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అత్త పగతో రగలిపోయింది. అల్లుడిని అంతమొందించేకు సమయం కోసం ఎదురు చూసింది. తన కూతరిని కడతేర్చిన దుర్మార్గుడిని ఎలాగైనా కడతేర్చాలని నిర్ణయించుకొని సుపారీ ఇచ్చి మరీ అంతం మొందించేకు ప్రయత్నించింది. ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళ్తే..అల్లుడిని హత్య చేయించేందుకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చి కుట్ర పన్నిన అత్తతో పాటు మరో నలుగురిని కాటారం పోలీసులు శుక్ర వారం అరెస్ట్‌ చేశారు.

జయశంకర్‌ భూపాపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ- గుమ్మళ్లపల్లి మార్గంలో ఈ నెల 23న ప్రైవేట్‌ కళాశాల నిర్వాహకుడు చిగురు గణేశ్‌పై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. కాటారం సీఐ నాగార్జున రావు కథనం ప్రకారం.. గారెపల్లి గ్రామానికి చెందిన చింత రాజేశ్వరి కుమార్తె సంధ్యకు 2017లో ఒడిపిలవంచకు చెందిన చిగురు గణేశ్‌తో వివాహం జరిగింది. అదనపు కట్నం వివాదాల నేపథ్యంలో 2023 జూలై 31న భార్య సంధ్యను గణేశ్‌ హత్య చేశాడు.

ఈ కేసులో గణేశ్‌ జైలుకు వెళ్లి, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. దీంతో అల్లుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని రాజేశ్వరి నిర్ణయించుకుంది. కరీంనగర్‌లో నివసిస్తున్న ధరంసోత్‌ రవీందర్‌ నాయక్‌ను సంప్రదించి రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ.లక్షతో పాటు గణేశ్‌ ఫొటోను ఇచ్చింది. అనంతరం రవీందర్‌ నాయక్‌ మరో ముగ్గురిని కలుపుకుని శుక్రవారం ఒడిపిలవంచలో రెక్కీ నిర్వహించారు. మరుసటి రోజు కారుచెడి పోయినట్లు నమ్మించి గణేశ్‌ను సహాయం కోరగా, అతడు కారు తోస్తుండగా నాగార్జున్‌ కత్తితో దాడి చేశాడు.

గణేశ్‌ కేకలు వేయడంతో రైతులు రావడాన్నిగమనించి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. మిగిలిన డబ్బుల కోసం ఈ నెల 26న రాజేశ్వరి ఇంటి వద్ద నిందితులు చర్చిస్తుండగా సమా చారం అందుకున్న సీఐ నాగార్జున రావు, ఎస్సై శ్రీనివాస్‌, ఎస్సై-2 మహేశ్‌, నరేశ్‌ దాడి చేసి ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. విచారణలో సుపారీ తీసుకొని హత్యాయత్నం చేసినట్లుగా నిందితులు అంగీకరించడంతో ప్రధాన నిందితురాలు రాజేశ్వరితో పాటు ధరంసోత్‌ రవీందర్‌ నాయక్‌, దామోదర్‌, నాగార్జున్‌, ప్రశాంత్‌ను కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌ విధించినట్లు వారు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ సూర్య నారాయణ అభినందిం చారు.
----------

రాష్ట్రంలో వారం రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు..


వాతావ‌ర‌ణ కేంద్రం శుభవార్త 
 హైదరాబాద్:
 నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి రోజులు గడుస్తున్నా వర్షాలు లేక తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రుతుపవనాలు ఆలస్యంగా పుంజుకోవడంతో రాష్ట్రంలో వర్షపాతం కొరత ఏర్పడింది. అయితే తాజాగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా రానున్న ఏడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టంచేసింది.

వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం.. ఇవాళ‌ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీచేశారు. వీటితోపాటు హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, కుమురం భీమ్ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడతాయని తెలిపింది. ఈ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా వర్షసూచన నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీచేసింది. జూలై 2వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని పేర్కొన్న‌ది. ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకటి రెండు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే నమోదయ్యే సూచనలు ఉన్నాయని వివరించింది. ఇక రాజధాని హైదరాబాద్‌లోనూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం లభించింది.

ఇవాళ‌ మధ్యాహ్నం తర్వాత తేలికపాటి జల్లులతో ప్రారంభమై, సాయంత్రం 6 గంటల తర్వాత వర్షం తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాత్రి వేళ నగరంలో భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
-----------------

ఆహా ఏమి రుచి... Sandy's Kitchen


నోరూరించే పిండి వంటలకు "సాన్డీ కిచెన్" పెట్టింది పేరు.. 
చక్కిలాలు, సేవ, నూల్లడువాలు, మంథని మోతీచూర్ లడ్డు, బేసన, రవ్వ లడ్డు, వివిధ రకాల పొడులు మీకు నోరూరుతుంది కదా .. 
😋
ఆలస్యం ఎందుకు మీరు బుక్ చేసుకోండి.. వెంటనే కింది నంబరుకు డయల్ చేయండి. 📱98491 23257

సర్ పర్యవేక్షణ కమిటీ లో "కాచే"


పెద్దపల్లి:

సర్ పర్యవేక్షణ కమిటీలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంథని కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు  కాచే శశిభూషణ్ ను నియమించారు. 

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S. I. R.) పర్యవేక్షించడానికి  టిపిసిసి అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈ కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యులు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో బూత్ స్థాయి బిఎల్ఏ ల నుండి అసెంబ్లీ, పార్లమెంట్  నాయకులతో మాట్లాడుతూ ఏమన్నా సమస్యలు ఉంటే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేటట్టు చూడటం జరుగుతుంది. 

ఎలక్షన్ కమిషన్ తో అనుసంధానం కోసం పులిపాటి రాజేష్ కుమార్, చైర్మన్ టి పి సి సి ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ పరిపాలనాపరంగా గంప వేణుగోపాల్ ని నియమించారు. 

అలాగే పార్లమెంట్ వారీగా..

1) అదిలాబాద్ : కోల్కొండ సంతోష్ 

2) పెద్దపల్లి : శశి భూషణ్ కాచే 

3) కరీంనగర్ : Dr. మద్దెల సంతోష్ కుమార్ 

4) నిజామాబాద్ : బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి 

5) జహీరాబాద్ : Dr.జూలూరు ధనలక్ష్మి

6) మెదక్ : జీ.వి. వెన్నెల 

7) మల్కాజిగిరి : సుబ్రహ్మణ్య పొన్నాడ 

8) సికింద్రాబాద్ : ఎం. రాఘవేంద్ర రెడ్డి 

9) హైదరాబాద్ : అచ్యుత యాదవ్ 

10) చేవెళ్ల  : ఎస్. జగదీశ్వర్ రావు

11) మహబూబ్నగర్ : టి. రేవతి గౌడ్  

12) నాగర్ కర్నూల్ : ఒబేదుల్లా కోత్వాల్ 

13) నల్గొండ : కస్బా  శ్రీనివాసరావు

14) బోనగిరి : Dr. బైకినీ లింగం యాదవ్  

15) వరంగల్ : పీర్ ఇర్షద్ అహ్మద్ నాసిర్ 

 16) మహబూబాబాద్ : నూతి శ్రీకాంత్ గౌడ్ 

17) ఖమ్మం : గోపిశెట్టి రాఘవేందర్.



FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026