శ్రీ సత్య సాయి జయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ సత్య సాయి దేవాలయం మంథనిలో ఈ ధార్మిక సేవా సంస్థ అధ్యక్షులు గంగా రాధాకిషన్ ఆధ్వర్యంలో శ్రీ భగవద్గీత లలిత విష్ణు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును నిర్వహించి అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. లోక కళ్యాణార్థం సర్వేజను సుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి మానవసేవే మాధవసేవ గోశాలలకు వృద్ధాశ్రమాలకు ధార్మిక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న వారికి మా ధన్యవాదాలు అని ఆయన తెలిపారు.
Dtv updates
శుక్రవారం, నవంబర్ 21, 2025
హైదరాబాద్: కేటీఆర్ మాటలు పచ్చి అబద్ధాలు
ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పారిశ్రామిక భూముల కన్వర్షన్ కోసం ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయిస్తే దానిని 5-6 లక్షల కుంభకోణంగా చిత్రీకరిస్తూ కేటీఆర్ దుష్ప్రచారం సాగిస్తున్నారని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వం పరిశ్రమలకు లీజుకిచ్చిన భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ‘ఫ్రీహోల్డ్’ రైట్స్ పేరిట 2023 ఆగస్టులో మూడు జిఓలు ఇచ్చింది వారి ప్రభుత్వ హయాంలో కాదా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం నాడు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఆరోపణలను ఆధారాలతో తిప్పికొట్టారు.
• కేటీఆర్ చెబ్తున్న 9,292 ఎకరాల భూమిలో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసి కేటాయించినది 4740 ఎకరాలే. మిగిలిన భూమి రోడ్లు, డ్రెయినేజి లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం జరిగింది.
• ఈ కేటాయింపులు ఒక్కరోజులో చేసినవి కాదు. పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాల కాలంగా ఇస్తూ వచ్చినవి.
• ఆజమాబాద్, కూకట్ పల్లి, హఫీజ్ పేటల్లోని పరిశ్రమల భూములను ఫ్రీ హోల్డ్ పేరిట యాజమాన్య హక్కులు కల్పించినది బిఆరెస్ ప్రభుత్వమే. కూకట్ పల్లి, ఆజమాబాద్, హఫీజ్ పేట భూములకు సంబంధించి ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్టుమెంట్, జిఓ ఎంస్ 19, 20, 21 లను 2023 ఆగస్టు 29 న జారీ చేసింది.
• ఇప్పుడు ఆ భూములకు కన్వర్షన్ అవకాశం కల్పిస్తున్నాం. 30, 50 శాతం స్లాబులతో ఇంపాక్టు ఫీజు నిర్ణయిస్తూ ఈనెల 17 న జరిగిన కేబినెట్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
• 2023లో ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఫ్రీహోల్డ్ (Free hold) హక్కులు కల్పించారు. అప్పుడు ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసుకున్నారో చెప్పాలి. ఆ జిఓల విషయం దాచిపెట్టి ప్రభుత్వంపై నిరాధార నిందలు వేస్తున్నారు.
• జూబ్లీహిల్స్ ఎన్నికల ఓటమితో కేటీఆర్ కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. వారి పార్టీ ప్రసార సాధనాలు ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తున్నట్టు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసాయి. ఇప్పుడు వారి పత్రికలే లేని దానిని కుంభకోణంగా అభివర్ణిస్తే నమ్మే పరిస్థితి లేదు.
• అసలు కుంభకోణమో, స్కామో జరిగి ఉంటే వారి హయాంలోనే జరిగి ఉండాలి. పరిశ్రమల యజమానులు హక్కుల పొందాలంటే రిజిస్ట్రేషన్ విలువపై 100 శాతం చెల్లించాలని, అవి చేతులు మారితే 200 శాతం కట్టాలని జిఓలు ఇచ్చారు.
• ఆ భూములు మరొకరి పరమైతే హక్కులు ఎలా కల్పిస్తారో వారికే తెలియాలి.
• వారిచ్చిన యాజమాన్య హక్కులు ఉన్నవారికి భూ వినియోగ మార్పిడి చేసుకునే అవకాశం మాత్రమే మేం కల్పించాం.
• స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల కమిషనర్లు పరిశ్రమల సంఘాలతో
పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట 30 శాతం, 50 శాతం స్లాబులను ప్రతిపాదించారు.
• సిఎం సోదరులు అగ్రిమెంట్లు చేసుకున్నారని నోటికొచ్చినట్లు మాట్లాడారు. వారెవరూ ప్రభుత్వంలో లేరు. పదేండ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా అభూత కల్పనలు ప్రచారం చేయడం దుర్మార్గం. ఆధారాలేవైనా బయటపెడితే ప్రభుత్వం ఏమి చేయాలో అది చేస్తుంది. ఇప్పటికైనా ఆయన ఆలోచనల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం.
• కన్వర్షన్ ఇంపాక్ట్ ఛార్జీల వల్ల రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నాం. అది కూడా అందరూ దరఖాస్తు చేసుకుంటేనే.
• యాజమాన్య హక్కులు లేనివారు కన్వర్షన్ కు దరఖాస్తు చేసుకోలేరు.
• ఆర్థిక ఆరాచకత్వానికి పాల్పడి వెళ్లి పోతే రెండేళ్లుగా దానిని సరిదిద్దుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.
• రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు గండికొట్టాలని చూడటమే బిఆరెస్ ప్రధాన కార్యక్రమంగా మారింది.
• హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు పాటుపడుతున్నాం. ప్రతిపక్షంగా సహకరించక పోయినా ఫర్వాలేదు. అబద్ధాలతో ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు చేయొద్దు. బెదిరింపు ధోరణులు మానుకోవాలి.
• ఓఆర్ ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను వెలుపలకు తరలిస్తామని మొదటి నుంచి చెబ్తున్నాం. గాలి, నీరు కాలుష్యం లేకుండా చేయడానికి పరిశ్రమలను బయటకు తరలిస్తున్నాం.
• పరిశ్రమలను ఆకర్షించడానికి కొన్ని రాష్ట్రాలు ఎకరం భూమిని 99 పైసలకే కేటాయించడం చూస్తున్నాం. విద్యుత్తు, పన్ను రాయితీలను 20 ఏళ్ల పాటు ఇస్తున్నారు. మన దగ్గర భూముల విలువ ఎక్కువ, లభ్యత కూడా తక్కువ. అయినా పరిశ్రమలకు అనుకూలమైన ఎకోసిస్టం ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం.
• పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది.
FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..
సప్తవర్ణ శోభితం
- 1. శనివారం... సాహితీ సుమాలు సాహిత్య రంగంలో ప్రముఖులు, వారి చరిత్ర, రచనలు, కవితలు,
- 2. ఆదివారం సాంస్కృతికం.. సినిమా, సంస్కృతిక రంగాల్లో లబ్ధప్రతిష్టుల గురించి వ్యాసాలు, ఇంటర్వ్యూలు
- 3. సోమవారం క్రీడా మైదానం క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వారి వివరాలు,
- 4. మంగళవారం
- 5. బుధవారం
- 6. గురువారం: ఆధ్యాత్మికం.. దేవాలయాలు, పండితులు, ప్రవచనాలు, భక్తి
- 7. శుక్రవారం.. సరస్వతీ నమస్తుభ్యం.. విద్యకు సంబంధించి ప్రముఖ కాలమిస్టుల రచనలు
విశిష్ట పోస్ట్
హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం
పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...
All time hit
-
ఆధ్యాత్మికతను సామాజిక సేవతో మేళవించిన వ్యక్తిత్వం శ్రీ సీతారామ సేవా సదన్తో సేవా ప్రస్థానం.. ...
-
ప్రపంచ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్బాబు దిక్సూచి, హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువత...
-
మంథని పట్టణంలోని పలు గణనాథులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం దర్శనం చేసుకున్నారు. 10 వ వార...
Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

