Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

ఆదివారం, సెప్టెంబర్ 28, 2025

మంథని: ఘనంగా చక్రీ భజన

శరన్నవరాత్రుల్లో భాగంగా మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో చక్రీ భజన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు నిరంతరం భజన కార్యక్రమం నిర్వహించడం ఈ ఆలయం యొక్క ఆనవాయితీగా చెప్పుకోవచ్చు. చక్రిభజన కార్యక్రమములో అన్ని వాడలకు చెందిన భజన పరులు రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంథని పట్టణంలోని అన్ని వాడలకు చెందిన భజన బృందాలు పాలీల వాయిదా  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొమ్మిది రోజులపాటు తాళం, గానం  ఆపకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక సంప్రదాయం. ప్రతి భజన మండలికి రోజు రెండు గంటలు చొప్పున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఎంతో విశిష్టత కలిగిన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా భక్తుల్లో ఎంతో విశ్వాసం నెలకొంది. నియమ నిష్టలతో అమ్మవారిని దర్శించుకుని కానుకలు సమర్పిస్తే అంతా శుభం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మంథని: విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ఆయుధపూజ

దుర్గా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గాంధిచౌక్ మంథని ఆద్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహం అందరికి ఉండాలని ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని కోరారు. భజరంగ్ దళ్ మంథని ప్రఖండ అద్యక్షులు నరేడ్ల రాజేష్ మాట్లాడుతూ హిందూ యువకులంతా ఒక్కటిగా ఉండాలని, హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి ఆయుధ పూజ ద్వారా శక్తి ఉపాసన చేసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మత మార్పిడి ద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థను, లవ్ జిహాద్ ద్వారా హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని. హిందువులు అప్రమత్తంగా ఉండాలని మన ధర్మం గొప్పతనం తెలుసుకోవాలని కోరారు. భజరంగ్ దళ్ మంథని ఉపాధ్యక్షులు బొగే సందీప్ మాట్లాడుతూ హిందూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మనలో మనం కులాల,వర్గాల, రాజకీయాలకు అతీతంగా ఉంటూ గొడవలు పడకుండా ఉండాలని. హిందూ యువతను సంఘటితం చేయడమే లక్ష్యంగా ఈ దుర్గా నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని యువత ఈ ఉత్సవాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విశ్వహిందూ పరిషత్ సహ కార్యదర్శి నామిని నాగేష్ మాట్లాడుతూ అమాయక హిందూ అమ్మాయిలను వలలో వేసుకొని మోసం చేసే జిహాదీ మూకల అంతమే లక్ష్యంగా విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.
 ఈ కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్ ఉపాధ్యక్షులు రావుల సతీష్, కార్యదర్శి బత్తుల సత్యనారాయణ, సత్సంగం ప్రముఖ్ రాజమౌళి గౌడ్ , ప్రచారప్రముఖ్ తూర్పాటి రాము, మాచిడి శ్రీధర్, కందునూరి ఈశ్వర్ అధిక సంఖ్యలో భక్తులు ,భవాని స్వాములు, భవాని మాతలు పాల్గొన్నారు.

పెద్దపల్లి: శాంతియుతంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలి

* ఏర్పాట్లు పరిశీలిస్తున్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

*సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు..*

*ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు
పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు కట్ట వద్ద సోమవారం  బతుకమ్మ వేడుకలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ ఆడే ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగు ఏర్పాట్లను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని, సద్దుల బతుకమ్మ పండగలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలను అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో, నిమజ్జనం చేసే ప్రాంతాల్లో స్థలాలు చదును చేయడం, లైటింగ్, ఇతర సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించాలని సూచించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే  పిలుపునిచ్చారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పండుగల సందర్భంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మున్సిపల్ ఎ.ఈ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మాజీ కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026