మంథనిలో సిఎం, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం
ఈ ప్రజా ప్రభుత్వంలో సహకార సంఘాల పదవి కాలం మరో ఆరు నెలలు పొడగించి మాపై ఎంతో బాధ్యతను పెట్టిందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. సహకార సంఘాల పదవి కాలం మరో ఆరు నెలలు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉతర్వులు జారి చేసిన సందర్భంగా గురువారం సాయంత్రం మంథని సహకార సంఘం పాలవర్గ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు, వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ల చిత్ర పటాలకు సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, సంఘ పాలకవర్గ సభ్యులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లడుతూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సంఘ వ్యాపారాన్ని ద్విగ్విజయంగా సాగిస్తూ సభ్యులు, రైతుల అవసరాలను తీర్చడం జరిగిందని అన్నారు. గ్రామగ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులను దళారుల భారి నుంచి కాపాడటం తో పాటు ధాన్యం లో ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వ మద్దతు ధరను అందిచడం తో పాటు సన్న వడ్ల కు క్వింటాల్ కు రూ.500 బోనస్ అందిచామని తెలిపారు. అంతే కాకుండా రైతుల కు రూ.2లక్షల రుణ మాఫీ చేశామన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయిస్తున్నామని తెలిపారు. అంతేగాకుండా సంఘ సభ్యుల వ్యవసాయ పెట్టుబడుల అవసరాలను తీర్చేందుకు సకాలంలో సభ్యులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను అందజేసి వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నామని తెలిపారు. సంఘ పరిధిలోని నాగారం గ్రామ శివారు, నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు ప్రక్కనే 3ఎకరాల 20గుంటల భూమిని కొనుగోలు చేసి రైస్ మిల్లు నిర్మాణానికి తగు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. అలాగే గుంజపడుగు గ్రామా శివారులోని 4 ఎకరాల ప్రభుత్వ్హ స్థలoలో పిఎం కుసుమ్ ద్వారా రూ.3.50 కోట్లతో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు టెండర్లు పూర్తి చేసుకొని ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి రూ.50 లక్షల ఆదాయం సంఘానికి సమకూరుతుందని అన్నారు. మరో ఆరు నెలల పదవీ కాలాన్ని పెంచి మాపై ఎంతో బాధ్యతను పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, టిజిక్యాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావులకు ఈ సందర్భంగా మా సంఘ పాలకవర్గం, రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఇన్ని రోజులు సంఘం అభివృద్ధికి సహకరించిన సభ్యులు, రైతులు, అధికారులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృత్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు పెద్దిరాజు ప్రభాకర్, సిరిముర్తి ఓదెలు, గడ్డం పోచం, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మీ-మొండయ్య, ఉడుత మాధవి- పర్వతాలు యాదవ్, దేవల్ల విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

