హైదరాబాదులోని కొత్తపేట శ్రీ గౌతమి గజానన మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఉపాకర్మ( శ్రావణి)*
👇👇👇👇
అవధానుల ప్రసాద్ శర్మ సౌజన్యం
హైదరాబాదులోని కొత్తపేట శ్రీ గౌతమి గజానన మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఉపాకర్మ( శ్రావణి)*
👇👇👇👇
అవధానుల ప్రసాద్ శర్మ సౌజన్యం
మంథని నియోజకవర్గ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ దగ్గర్లో గల కాంగ్రెస్ జెండాను ఎగరవేసి అనంతరం కేక్ కట్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు. స్థానిక బస్టాండ్ లో యువజన కాంగ్రెస్ నాయకులు మహిళలతో రాఖీలు కట్టించుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేసి డిపో మేనేజర్ తో మాట్లాడి మహిళల ప్రయాణ సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరినారు. మేనేజర్ సానుకూలంగా స్పందించి బస్సులు అదనంగా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ 1960 లో స్థాపించబడిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య యువజన విభాగం,యూత్ కాంగ్రెస్ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగినటువంటి విభాగం యూత్ కాంగ్రెస్ అని తెలిపారు.యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయ ఓనమాలు నేర్చి అనేకమంది దేశవ్యాప్తంగా ప్రముఖంగా రాజకీయాల్లో ఉన్నారని తెలిపారు.యువత రాజకీయంగా ఎదగడానికి యువజన కాంగ్రెస్ మంచి ప్లాట్ ఫామ్ అని ఈ సందర్భంగా తెలిపారు.గత 10 సంవత్సరాలు యువజన కాంగ్రెస్ ప్రతి గ్రామాల తిరుగుతూ గ్రామ గ్రామాన యువజన కాంగ్రెస్ కమిటీలు వేసి అనేక ధర్నాలు, దీక్షలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి యువజన కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అందిస్తుందో వాటిని అర్హులైన నిరుపేదలకు అందించే విధంగా మరియు ప్రజలకు నాయకులు శ్రీధర్ బాబు కి మధ్య యువజన కాంగ్రెస్ వారధిల పని చేస్తుందని తెలిపారు.యువజన కాంగ్రెస్ నాయకులు ప్రియతమ నేత రాష్ట్ర మంత్రి అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు ఏదైతే ఈ నియోజవర్గాన్నే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకుపోతు ఉన్నారు.ఈ ప్రాంతంలో విద్య వైద్యం మౌలిక సదుపాయాలు తాగునీరు సాగునీరు అందిస్తూ అన్ని రంగాలలో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్నారని, శ్రీను బాబు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వారు పరిష్కరిస్తూ ప్రజల బాగోగులు చూసుకుంటున్నారని అన్నారు.శ్రీధర్ బాబు మరియు శ్రీనుబాబు నాయకత్వంలో రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి చేయడమే లక్ష్యంగా శ్రీధర్ బాబు ని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ నాయకులు శక్తి వంచన లేకుండా పని చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కమాన్ పూర్ లో..
యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రెబల్ రాజు ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యోజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అన్వర్ తోపాటు లల్లు, మల్యాల మహేష్, ఇ రుగు రాళ్ల రాజు, చొప్పరి సంతోష్, నల్లెల్లి శంకర్, కా డిపల్లిసుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ సింధూర్
జవాన్ కు చెల్లెలి రాఖీ
కమాన్ పూర్ మండలం నాగారం లింగాల గ్రామానికి చెందిన ఆపరేషన్ సింధూర్ జవాన్ పెరుమాళ్ అభిరామ్ కు తన చెల్లెలు శ్రీజ రాఖీ కట్టారు. ఇటీవల పాకిస్తాన్ తో ఆపరేషన్స్ సింధూర్ లో భాగంగా అభిరాం రాజోలి బోర్డర్లో తన సేవలను అందించారు. ఇటీవల సెలవుల్లో స్వగ్రామానికి రాగా తన చెల్లెలు శ్రీజ రాఖీ కట్టి నువ్వు దేశానికి ఇలాగే రక్షణగా ఉండాలని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ దేశానికి సేవ చేయాలని కోరింది.
మంత్రి శ్రీధర్ బాబుకు రాఖీ కట్టిన మహిళలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి శ్రీధర్ బాబు కు మంథని నియోజకవర్గ మహిళలు సోదరీమణులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా సామూహిక యజ్ఞోపవీత ధారణ
మంథని పట్టణంలోని అన్ని వాడల్లోని దేవాలయాలు సాముహిక యజ్ఞోపవీతధారణ కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తమ్మిచెరువు కట్ట శ్రీ వీర హనుమాన్ ఆలయ ప్రాంగణంలో వేదమూర్తులైన అవధానుల పురుషోత్తం, కిషోర్ లు హోమగుండం ఏర్పాటు చేసి వేదమంత్రాలతో నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...