Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శుక్రవారం, జూన్ 26, 2026

సంచలనం సృష్టించిన కరీంనగర్​ కుర్రాడు

 



32 బంతుల్లో సెంచరీ.. 

ఎవరీ అమన్ రావు పెరాలా?


తెలంగాణ టీ20 (TG20) లీగ్‌లో వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్ రావు పెరాలా కేవలం 32 బంతుల్లో సెంచరీ బాది దేశీయ టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. 48 బంతుల్లో 142 పరుగులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి అందరి దృష్టిని ఆకర్షించాడు.

అమెరికాలో జననం.. హైదరాబాద్‌లో ఎదుగుదల


అమన్ రావు పెరాలా 2004 జూన్ 2న అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం మాడిసన్‌లో జన్మించాడు.  ఆరు నెలల వయసులోనే కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు.

హైదరాబాద్‌లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొంది తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు.  

అమన్​రావు తండ్రి ఎవరో తెలుసా?

కరీంనగర్​ జిల్లా సైదాపూర్​ మండలం వెన్నంపల్లికి చెందిన పేరాల మధుసూదన్​రావు సైతం క్రికెట్​ ఆటగాడుగా కరీంనగర్ లో  హిందూ క్రికెట్​ క్లబ్ కు ప్రాతినిధ్యం వహించే వారు.  ఆ తరువాత ఐటీ ప్రొఫెనల్​గా ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లారు. ఆ తరువాత అమెరికా నుంచి తిరిగి వచ్చారు.  ఆ సమయంలో అమన్​ వయస్సు మూడేళ్లు.. చిన్నతనంలో అన్నతో కలిసి క్రికెట్ అకాడమీకి వెళ్లడం వల్లే అమన్‌కు క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది. 7 ఏళ్ల వయస్సు నుంచి శిక్షణ తీసుకున్నారు.  కరీంనగర్​ హిందూ క్రికెట్​ క్లబ్​కు ప్రాతినిధ్యం వహించే అమన్​రావు నిరంతర  కృషి, పట్టుదలతో  కోచ్​ శరత్​ ముదిరాజ్​వద్ద క్రికెట్​ మెలకువలను నేర్చుకున్నాడు.   

అమెరికా పౌరసత్వానికి గుడ్‌బై

అమెరికాలో జన్మించిన కారణంగా అమన్‌కు అమెరికా పౌరసత్వం ఉండేది. భారత దేశీయ క్రికెట్‌లో ఆడాలంటే భారత పౌరసత్వం తప్పనిసరి కావడంతో అమెరికా పాస్‌పోర్ట్‌ను వదులుకుని భారత పౌరసత్వాన్ని స్వీకరించాడు. దాదాపు ఏడాది పాటు పత్రాల ప్రక్రియ పూర్తయ్యాక హైదరాబాద్ తరఫున మళ్లీ ఆడే అవకాశం దక్కింది. 

దూకుడుగా ఆడడమే ఆయన స్టైల్​

హైదరాబాద్ తరఫున ఆడుతున్న అమన్ రావు 2025–26 విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్‌పై 154 బంతుల్లో అజేయంగా 200 పరుగులు చేసి హైదరాబాద్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. అదే సీజన్‌లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 160కు పైగా స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్నాడు.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఎంపిక

అమన్ రావు ప్రతిభను గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అతడిని ఐపీఎల్-2026 కోసం రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో మ్యాచ్ ఆడే అవకాశం రాకపోయినా, ఇప్పుడు టీజీ20లో ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్‌తో వచ్చే సీజన్‌లో అవకాశాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

వరంగల్ వారియర్స్‌కు కీలక ఆటగాడు

తెలంగాణ టీ20 లీగ్‌లో వరంగల్ వారియర్స్ జట్టు అమన్ రావును కీలక బ్యాటర్‌గా ఎంపిక చేసింది. భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌తో కలిసి జట్టుకు ప్రధాన బలంగా నిలుస్తున్నాడు. కెప్టెన్‌గా జట్టును నడిపిస్తూ బ్యాట్‌తోనూ సంచలన ప్రదర్శనలు చేస్తున్నాడు.

భవిష్యత్తుపై భారీ అంచనాలు

దేశీయ క్రికెట్‌లో డబుల్ సెంచరీ, ఇప్పుడు 32 బంతుల్లో సెంచరీ, వరుస రికార్డులతో అమన్ రావు భారత క్రికెట్‌లో అత్యంత ఆశాజనక యువ బ్యాటర్లలో ఒకరిగా ఎదుగుతున్నాడు. ఇదే ఫామ్ కొనసాగితే త్వరలోనే ఐపీఎల్‌లోనూ, భారత జట్టులోనూ అతడికి అవకాశం దక్కే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.


(దహగాం శ్రీనివాస్​)

https://www.facebook.com/watch/?v=927903806780407

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026