* పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి కృషి
* అభివృద్ధిని చూసి ఓటేయండి
* కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగంపల్లీ మాజీ కౌన్సిలర్
* పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి ప్రతినిధి:
నిజాయితీగా ప్రజాసేవ చేస్తూ వస్తున్నానని, పెద్దపల్లి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు.
రంగంపల్లీ 10వ వార్డు మాజీ కౌన్సిలర్ గాదె మాధవి గారు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్ల పాలనలో రూ.40 కోట్లతో సీసీ రోడ్లు, మురికి కాలువలు, మౌళిక వసతుల కల్పన పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో పాత వాటర్ ట్యాంక్ స్థానంలో కొత్తగా వాటర్ ట్యాంక్, చందపల్లి డబుల్ బెడ్ రూం ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేస్తున్నామని తెలిపారు. రూ 62.50 కోట్లతో అభివృద్ది పనులు ప్రారంభించామని, మరో 15 కోట్ల నిధులు మంజూరు చేయించానని తెలిపారు. వీటిని ప్రజల అవసరాలను గుర్తించి నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి రూ 77.50 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆధునీకరణ కోసం రూ 7.5 కోట్లు కేటాయించినట్లు వివరించారు. క్రీడల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాని ఇందులో భాగంగా వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఇండోర్ బ్యాడ్మింటన్ షటిల్ స్టేడియం ఏర్పాటుకు డి ఎం ఎఫ్ టీ నుండి రూ 2.5 కోట్లు కేటాయించి పనులు చేపట్టినట్లు చెప్పారు. రూ.80 కోట్లతో పెద్దపల్లి బైపాస్ రోడ్డు టెండర్లు పూర్తి చేశామని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బైపాస్ నిర్మాణానికి మరో 70 కోట్ల రూపాయలు అవసరం అని నిధులు మంజూరి చేయిస్తానని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిని విస్తరించి ఆధునీకరించామని చెప్పారు. 50 నుండి 100 పడకల విస్తరించి ఏంఆర్ఐ, సిటీ స్కాన్ లు ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. బస్ డిపోకు 4ఎకరాల 32 గుంటలు కేటాయించి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాఘవాపూర్ లో కోర్టు భవనానికి 10 ఎకరాలు కేటాయించి రూ. 80 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. పట్టణంలోని శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అధికార పార్టీ అభ్యర్థులనే కౌన్సిలర్లుగా గెలిపిస్తే అభివృద్ది సాధ్యమన్నారు. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే..
తదుపరి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు గాను 33 వార్డులకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థులను ఎమ్మెల్యే ప్రకటించారు.
పూరేళ్ళ శైలజ (1 వార్డు), లక్ష్మి పస్తం (2 వార్డు), మొలగూరి కమల్ (3 వార్డు), కొమ్ము సుధాకర్ (4 వార్డు), గుజ్జుల కుమారస్వామి (5 వార్డు), కట్ట పద్మావతి (6 వార్డు), ఈర్ల స్వరూప (7 వార్డు), ఎరుకల కల్పన (8 వార్డు), అక్కెపల్లి సుజాత (10 వార్డు), అనూష పూదరి (11 వార్డు), దొడ్డుపల్లి జగదీష్ (12 వార్డు), పాగల శ్రీకాంత్ (13 వార్డు), మహమ్మద్ అస్లాo పర్వేజ్ (14 వార్డు), నేతెట్ల కొమురయ్య (15 వార్డు), నాంసాని శ్రీనివాస్ (16 వార్డు), తోట ఫణీందర్ (17 వార్డు), భూతగడ్డ సంపత్ (18 వార్డు), నల్లాల పద్మ (19 వార్డు), బండి రమ్యకృష్ణ (20) వార్డు), నూగిళ్ళ మల్లయ్య (21వార్డు), ఉప్పు స్వరూప (22 వార్డు), తాడూరి శ్రీమన్నారాయణ (23 వార్డు), కొట్టే స్వరూప (24 వార్డు), సూది మల్ల అమ్రేష్ (26 వార్డు), ఉనుకొండ సరస్వతి (27 వార్డు), తూముల లత (28 వార్డు), ఇల్లందుల రజని (29 వార్డు), సాజిదాబాను (30 వార్డు), మంథని నర్సింగ్ (31 వార్డు), తిర్రీ శ్రీలత (32 వార్డు), బూతగడ్డ స్వప్న (33 వార్డు), దేవనంది రమాదేవి (35 వార్డు), ముస్కాన్ నాజ్ నయ్యర్ (36 వార్డు).