* మంత్రపురి ధర్మ ప్రచార సమితి ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయంలో మణికంఠ కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి శకుంతల ప్రవచనాలలో సహస్రవధాని పద్మశ్రీ డాక్టర్ శ్రీ గరికిపాటి నరసింహారావు పాల్గొన్నారు. మంథని ప్రాంతానికి వచ్చిన వారిని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు శాలువాతో ఘనంగా సత్కరించిన
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ వారు నిర్భయంగా ముక్కుసూటియా ధర్మ శాస్త్రాలను మంచి ప్రవచనాలు చెప్పి వ్యక్తి డాక్టర్ గరికిపాటి. మంథని లో అనేక దేవాలయాలు ఉన్నాయని వాటికి దూపదీప నైవేద్యాలను పాటు మంత్ర ఉచ్చరణకు, వేయి పడగలు సంబంధించినటువంటి పీవీ నరసింహారావు కూడా ఇదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రాంతంలో పెద్దలు అందరు చేసే మంత్ర ఉచ్చరణ చేస్తున్నారని అన్నారు.
మే మాసంలో జరిగే అంత పుష్కరాల్లో పాల్గొనాలని శ్రీధర్ బాబు కోరారు. నన్ను గాని మా నాన్నగారిని గాని గుర్తు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరికీ తరపున ఈ ప్రాంతానికి విచ్చేసిన గరికిపాటి నరసింహారావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంథని ప్రాంతంలో ఉన్న ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారన్నారు.

















































