Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

మంగళవారం, మార్చి 03, 2026

మంథని: మాజీ స్పీకర్ శ్రీపాద రావు కు నివాళి







ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి సందర్భంగా సోమవారం మంథని పట్టణంలోని మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీపాద చౌక్ మరియు రావులచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన శ్రీపాదరావు గారి విగ్రహాలకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిల్ల శ్రీను బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శ్రీను బాబు గారు మాట్లాడుతూ, శ్రీపాదరావు గారు మంథని ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారని, వారి జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని కొనియాడారు. వారి ఆశయ సాధన దిశగా తాము కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. మంథని పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా శానిటేషన్ సిబ్బందికి చీరలు పంపిణీ చేసి వారి సేవలను అభినందించారు. అనంతరం మంథని బస్టాండ్‌లో మంథని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాధుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.  మంథని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న గారి ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు  చిత్రపటానికి  TPCC ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిల్ల శ్రీనుబాబు పూలమాల వేసి ఘనంగా  నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ మరియు మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ ఆధ్వర్యంలో 30మంది నిరుపేదలకు  దుద్దిల్ల శ్రీను బాబు గారి చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీపాద రావు గారు సర్పంచ్ గా, సమితి అధ్యక్షునిగా  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభపతిగా శ్రీపాదరావు గారు మంథని ప్రాంతానికి ఎన్నో సేవలు అందించారని, రైతులకు లోన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించి,సాగునీరు అందించి రైతులకు అండగా నిలిచారని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతీ యువకులకు మంచి విద్యా ఉద్యోగం కల్పించాలని, ప్రతి మారుమూల గ్రామానికి రోడ్డు సౌకర్యం, తాగునీరు అందించడం కోసం ఎంతగానో కృషి చేశారు. శాసనసభపతిగా ఎంతో హుందాగా వ్యవహరించి శాసనసభ పదవికి వన్నెతెచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంథని పట్టణ,మండల నాయకులు, యూత్ కాంగ్రెస్,అనుబంధ సంఘాల నాయకులు, దుద్దిళ్ల కుటుంబ అభిమానులు పాల్గొన్నారు.

హైదరాబాద్: స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాద

మాట్లాడుతున్న కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఖాదర్ ఫరీద్ 





* పదవి అంటే అధికారం కాదు... బాధ్యత అని చాటి చెప్పిన దార్శనికుడు

* దుద్దిళ్ల శ్రీపాద రావు రాజకీయం.. నేటి తరానికి స్ఫూర్తిదాయకం

* కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్ 

స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాదరావు అని కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్ కొనియాడారు. రాజకీయాల్లో పదవి అనేది నెత్తిన పెట్టుకునే కిరీటం కాదు, అది బాధ్యత అని చాటిచెప్పిన దార్శనికుడన్నారు. సోమవారం హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూటీ ఖాదర్ ఫరీద్ మాట్లాడుతూ.. సర్పంచ్ నుంచి స్పీకర్ వరకు ఎదిగిన శ్రీపాద రావు రాజకీయ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం లేకపోతే అది అధికారం అవుతుంది తప్ప సేవ కాదని బలంగా విశ్వసించారన్నారు. చివరి వరకూ.. ప్రజా సేవే శ్వాసగా విలువలతో కూడిన రాజకీయం చేశారన్నారు. ప్రజాప్రతినిధి సరిగ్గా పనిచేయకపోతే వెనక్కి పిలిచే "రీకాల్" విధానాన్ని మనస్ఫూర్తిగా సమర్థించిన గొప్ప ప్రజాస్వామ్యవాది శ్రీపాద రావు అని అన్నారు. స్పీకర్‌గా ఉన్నప్పుడు అధికార, ప్రతిపక్షాలకు సమాన అవకాశం కల్పించి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడారన్నారు. ఒక నాయకుడు ఎలా బతకాలో మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో ఎలా బతికి ఉండాలో నిరూపించిన ధన్యజీవన్నారు. రాజకీయాల్లో నైతికత, పార్లమెంటరీ విలువలు ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి మహనీయులు చూపిన అనుసరణీయమన్నారు. సభాపతి హోదాలో ఆయన నెలకొల్పిన ప్రమాణాలు నేటి తరుణంలో ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఆయన పడిన తపన... నేటి తరం నాయకులకు ఒక పాఠ్యపుస్తకమన్నారు. శ్రీపాదరావు కేవలం చట్టసభకే పరిమితం కాలేదని, సామాజిక ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో కూడా అమాయకులను రక్షించేందుకు రాజ్యాంగ పరిధిలో ఉండి ధైర్యంగా పోరాడారని గుర్తు చేశారు. ఆయన చూపిన విలువల బాటలో పయనిస్తూ, తండ్రికి తగ్గ తనయుడిగా, నిబద్ధత గల నాయకుడిగా మంత్రి శ్రీధర్ బాబు ప్రజా సేవలో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తిని రాబోయే రోజుల్లోనూ కొనసాగించాలని సూచించారు. "ప్రజా క్షేత్రంలో సాటి మనిషి కోసం ఎలా నిలబడాలి, కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా నిలవాలనే నైతిక విలువల్ని మా నాన్న మాకు వారసత్వంగా ఇచ్చారు. తనను నమ్ముకున్న ఒక సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్తూ, ప్రజల మధ్యే ఆయన అమరుడయ్యారు. తన ఊపిరి ఆగిపోయే వరకు ప్రతి అడుగు ప్రజల కోసమే వేశారు" అని శ్రీపాద రావు తనయుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని, అదే నిబద్ధతతో ప్రజా సేవలో ముందుకు సాగుతానన్నారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు విజయ రమణా రావు, రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, ఆది శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ రావు, గండ్ర సత్యనారాయణ, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అరికెపూడి గాంధీ, మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఆదివారం, మార్చి 01, 2026

అజరామరుడు శ్రీపాద రావు


* నేడు శ్రీపాద రావు జయంతి

* రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు

తెలుగు రాజకీయాల్లో దుద్దిళ్ల శ్రీపాదరావుది ప్రత్యేకమైన చరిత్ర. ఆయన వ్యక్తిత్వమే ప్రజలకు దగ్గర చేసింది. ఇప్పటికీ జనాల గుండెల్లో నిలిచేలా చేసింది. శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా ఓసారి స్మరించుకుందాం..

తెలంగాణ రాజకీయ చరిత్రలో కొంతమంది నాయకులు పదవుల వల్ల కాదు, తమ వ్యక్తిత్వం వల్ల గుర్తుండిపోతారు. అధికారపు మెరుపులు క్రమంగా మసకబారినా, వారు అందించిన విలువల వెలుగు మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది. తెలుగు నేలపై అలాంటి వెలుగులు పంచిన నాయకుడు దుద్దిళ్ల శ్రీపాదరావు. మార్చి 2, 1935న కాటారం మండలం ధన్వాడ గ్రామంలో జన్మించిన ఆయన, ఒక సర్పంచ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి వరకు ఎదిగారు. ఆయన జీవితం మన రాజకీయ సంస్కృతికి చూపిన మార్గాన్ని శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా స్మరించుకోవాలి.

న్యాయవాదిగానూ సేవలు
ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీపాదరావు బాల్యమంతా పల్లెటూరులోనే గడిచింది. తల్లిదండ్రులు రాధాకృష్ణయ్య, కమలాబాయి ఇచ్చిన విలువలు ఆయన ప్రస్థానానికి పునాదిరాళ్లయ్యాయి. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఆయన ధన్వాడలో ప్రాథమిక విద్య, మంథనిలో ఎస్‌ఎస్‌సీ పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ చేరారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో పంచాయతీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. పంచాయతీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు గ్రామ పరిపాలనపై స్పష్టమైన అవగాహన ఇచ్చింది. అనంతరం నాగ్‌పూర్‌లో న్యాయశాస్త్రం చదివి న్యాయవాదిగా సేవలందించారు.

వ్యవసాయం చేస్తూ రాజకీయాల్లోకి
తండ్రి మరణం తర్వాత శ్రీపాదరావు తన స్వగ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయం చేశారు. ఆ వ్యవసాయమే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. రైతు కష్టాలు, పల్లె ప్రజల ఆవేదనలు ఆయనకు ప్రత్యక్ష అనుభవాలయ్యాయి. రాజకీయాల్లోకి రావడానికి ఆయనకు పెద్ద వేదికలు అవసరం కాలేదు. ప్రజలే ఆయనను ముందుకు నెట్టారు. వరుసగా రెండు సార్లు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై, మహదేవపూర్ సమితి అధ్యక్షుడిగా, మంథని ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ దశలోనే ఆయన ప్రజానాయకుడిగా ఒక్కో మెట్టు పైకెదిగారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు దూరమయ్యే రాజకీయ సంస్కృతికి భిన్నంగా, ఆయన ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండేవారు. నాయకత్వం అంటే హోదా కాదని, బాధ్యత అని ఆయన ప్రవర్తన చాటి చెప్పింది.


టీడీపీ హవాలోనూ విజయం
1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం మధ్య కాంగ్రెస్ అభ్యర్థిగా మంథని నుంచి పోటీ చేసి విజయం సాధించడం సాధారణ విషయం కాదు. ప్రజల విశ్వాసం ఆయనకు రాజకీయ బలంగా మారింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంథని నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేశారు. రహదారులు, సాగునీటి సదుపాయాలు, విద్యా సంస్థలు, సంక్షేమ పథకాలు ఇలా ఆయన రాకతో... మంథని రూపురేఖలు మారిపోయాయి. 1990-94 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయనకు లభించిన అత్యున్నత గౌరవం అని చెప్పవచ్చు.

అందరికీ మాట్లాడే అవకాశం
స్పీకర్ పదవి అంటే కేవలం సభను నడపడం కాదు. అది ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత. పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉన్న కాలంలో కూడా ఆయన నిష్పక్షపాత వైఖరి పాటించారు. పార్టీ భావజాలాన్ని పక్కన పెట్టి, సభను సమతుల్యంగా నడిపి, అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల ప్రశంసలను సమానంగా పొందారు. శ్రీపాదరావు స్పీకర్‌గా ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుల క్రమశిక్షణ పెరిగింది. ప్రజలకు ఉపయోగపడే చర్చలన్నీ గౌరవప్రదంగా జరిగేలా చూశారు. సభాపతి పీఠం పట్ల ప్రజల్లో ఉన్న గౌరవాన్ని నిలబెట్టారు. అదే సమయంలో తన నియోజకవర్గాన్ని మరువలేదు. మంథని అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
నక్సలైట్ల చేతిలో
1994 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ... ప్రజాసేవలో మాత్రం శ్రీపాదరావు వెనకడుగు వేయలేదు. నక్సలిజం ప్రభావం ఉన్న ప్రాంతంలోనూ ప్రజల మధ్యే ఉన్నారు. హింసకు బదులుగా ప్రజాస్వామ్య మార్గాన్ని విశ్వసించారు. 1999 ఏప్రిల్ 13న మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలో నక్సలైట్ల చేతిలో హత్యకు గురవడం యావత్ తెలుగు ప్రజలను కలచివేసింది. ప్రజల కోసం జీవించిన నాయకుడి జీవితం ఇలా బలవడం తెలంగాణ రాజకీయ చరిత్రలో విషాద ఘట్టంగా నిలిచిపోయింది.

అవే విలువలతో రాజకీయాల్లో శ్రీధర్ బాబు
శ్రీపాదరావు మరణంతో ముగిసింది కేవలం జీవితం మాత్రమే అని, ఆయన విలువలు కాదని మంథని ప్రజలు ఇప్పటికీ ఆయన మీద అభిమానాన్ని చాటుకుంటున్నారు. తండ్రి స్ఫూర్తిని ఆయన కుమారుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముందుకు తీసుకెళ్తున్నారు. 1999 నుంచి వరుసగా ఐదుసార్లు మంథని ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విప్‌గా, మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర విభజన చట్ట ప్రక్రియలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర అవిర్భావనికి కృషి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖలను నిర్వహిస్తూ అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నారు. తండ్రి అందించిన విలువలు, ప్రజల మధ్యే ఉంటూ చేసే రాజకీయం ఆయన నడకలో, నడతలో, పాలనలో ప్రతిబింబిస్తోంది.

శ్రీపాదరావు జయంతి వేడుకలు
దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు మార్చి 2న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని 2024 ఫిబ్రవరి 25న నిర్ణయించింది. ఇది ఆయన మీద ఉన్న గౌరవానికి నిదర్శనం. పార్టీలకు అతీతంగా అందరి గౌరవాన్ని పొందిన నాయకుడిగా ఆయన నిలిచారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న 89వ జయంతి కార్యక్రమంలో శ్రీపాదరావు స్మారక అవార్డులు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు అందజేస్తున్నారు.

భారత రక్షణ రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన డాక్టర్ జి. సతీష్ రెడ్డి , అన్నమయ్య కీర్తనలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన పద్మశ్రీ డాక్టర్ శోభారాజు , సాంకేతిక రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన ఆర్. వెంకటరామన్, సాంకేతిక, వృత్తిపర విద్యలో నూతన ఆవిష్కరణలకు మార్గదర్శకులైన డాక్టర్ సుబ్బరంగయ్య కొప్పరపు ఈ పురస్కారాలు అందుకోనన్నారు.

నేటి రాజకీయ వాతావరణంలో విభజన, విమర్శలు, ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న వేళ, శ్రీపాదరావు జీవితం ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. అధికారాన్ని సంపాదించడం సులభమే కానీ, విశ్వాసాన్ని సంపాదించడం కష్టం. పదవి తాత్కాలికం. ప్రజల మనసుల్లో నిలిచే విశ్వాసమే శాశ్వతం అని శ్రీపాదరావు నిరూపించారు. సర్పంచ్ నుంచి శాసనసభ పీఠం వరకు ఆయన చేసిన ప్రయాణం, ప్రజాసేవకు అంకితమైన జీవితం ఒక నాయకుడు ఎలా ఉండాలో చూపించింది. ఆయనను స్మరించుకోవడం అంటే గతాన్ని పొగడడం మాత్రమే కాదు. రాజకీయాలకు విలువలు తిరిగి తీసుకురావాలనే సంకల్పం కూడా. దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా, ఆయన అందించిన రాజకీయ విలువలను స్మరించుకుంటూ యావత్ తెలంగాణ ఆయనకు నివాళి అర్పిస్తోంది!



హైదరాబాద్: గ్రంథాన్ని ఆవిష్కరించిన శ్రీను బాబు

 




హైదరాబాద్ చిక్కడపల్లి లోని  శ్రీ త్యాగరాయ గాన సభ లో నిర్వహించిన గ్రంథావిష్కరణ సభ కార్యక్రమంలో పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరించిన *టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు.*

*అచ్యుతన్న చారిటబుల్ ట్రస్ట్ వారి సాదర ఆహ్వానంతో నిర్వహించిన ఈ సభలో, “శ్రీ గోపాలదాస కృతిరత్నాలు”* గ్రంథాన్ని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శుభాశీస్సులతో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా *దుద్దిళ్ళ శ్రీను బాబు మాట్లాడుతూ,*

మొదటి ప్రచురణను 1993లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తమ తండ్రి స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు గారు ఆవిష్కరించారని గుర్తుచేశారు. రెండవ ప్రచురణ ఆవిష్కరణ తమ చేతుల మీదుగా చేపట్టే అవకాశం కల్పించిన ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆధ్యాత్మిక సాహిత్యం మన సంస్కృతి,సనాతన విలువలను తదుపరి తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గ్రంథ రచయితలకు మరియు ట్రస్ట్ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పండితులు, సాహితీవేత్తలు,భక్తులు మరియు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం




పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు

మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం

పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా ప్రభుత్వం: మంత్రి శ్రీధర్ బాబు 


కోకాపేట్‌లోని శ్రీ శారదా పీఠం భూముల వ్యవహారంలో ‘సమాచార లోపం’ వల్లే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఆదివారం కోకాపేట్ లోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి... అక్కడి రాజ శ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందని అన్నారు. మా ప్రభుత్వానికి భేషజాలు లేవని, తప్పులు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అసలు విషయం తెలిసిన వెంటనే శారదా పీఠం భూముల విషయంలో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకొని కొందరు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై  దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మాది బుల్డోజర్ సంస్కృతి కాదని, కబ్జాకోరుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడటం చూసి ఓర్వలేకే కొందరూ మాపై కావాలనే బురద చల్లుతున్నారని విమర్శించారు. బాపు ఘాట్ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని స్థానికులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026