Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శనివారం, ఫిబ్రవరి 14, 2026

కరీంనగర్:మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్య కు నివాళి

*దళితుల అభివృద్ధి ఔన్నత్యం కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి దామోదరం సంజీవయ్య
* మానకొండూరు ఎమ్మెల్యే, టిపిసిసి ఎస్ సి సెల్ చైర్మన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ

దిక్సూచి, కరీంనగర్:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే, పిసిసి ఎస్ సి సెల్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై జిల్లా కాంగ్రెస్ ఎస్ సి సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఎస్ టి సెల్ అధ్యక్షులు బానోతు శ్రవణ్ నాయక్, జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్ తో పాటు పలువురు నాయకులతో కలిసి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి గా పని చేసినారు, కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రిగా పనిచేయడంతో పాటు  రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి అటు పార్టీకి, ఇటు ప్రజలకు సేవలు అందించినారు, ఒక పేద కుటుంబం నుండి వచ్చి దళితుల అభివృద్ధి, ఔన్నత్యం కోసం నిరంతరం శ్రమపడిన వ్యక్తి,  ఎలాంటి ఆస్తులు కూడబెట్ట కుండా పేదరికంలో జీవించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు, వారిని ఆదర్శంగా తీసుకొని నేడు కాంగ్రెస్ పార్టీ లో వి హనుమంతరావు లాంటి వారు నేటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయతతో నిబద్ధతకు కట్టుబడి పనిచేస్తున్నారని, తుది శ్వాస వరకు తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసిన సంజీవయ్య జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు వంగల విద్యాసాగర్,కుంభాల రాజ్ కుమార్,మామిడి అనిల్ కుమార్,బండారి రమేష్ గౌడ్, సుధాకర్ నాయక్, రంగా నాయక్, ఊట్కూరు రవీందర్ రెడ్డి,బండ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026