![]() |
| ప్రచారంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు |
మంథని:
మంథని మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంథని మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు అభ్యర్థి కుర్ర లింగయ్య, 2వ వార్డు అభ్యర్థి నూకల కమల్, 9వ వార్డు అభ్యర్థి మారుపాక నిహారిక, 13వ వార్డు అభ్యర్థి ఎల్లంకి వంశీ వార్డులలో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.రానున్న రోజుల్లో మంథని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించి, మంథని మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రజలను ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా పట్టణ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.





కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి