* మంత్రి సమక్షంలో చేరిన మాజీ ఎంపీపీ మాదాడి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి
మంథని:
బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ మదాడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంత రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మంత్రి శ్రీధర్ బాబు వారికీ కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు. వారితో పాటు రెడ్డి సంఘము మాజీ అధ్యక్షులు ఎంఎస్ రెడ్డి, రామడుగు మారుతీ, రాదంటి శంకర్ మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరడం చాలా సంతోష కరమన్నారు. మంథని పట్టణం తో పాటు మంథని నియోజకవర్గం అభివృద్ధి కోరకు వారు ముందుకు రావడం. పేద బడుగు బలహీన,మైనారిటీ వర్గాల అభివృద్ధి కొరకు వారి అనుభవంతో పాటు సలహాలు సూచనలు కుడా తీసుకుంటూ.. రానున్న రోజుల్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్ళతామన్నారు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి