* డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం
*హాజరైన కార్యవర్గ సభ్యులు మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు
*నేతలకు దిశా నిర్దేశం
దిక్సూచి, కరీంనగర్:
జిల్లాలో సర్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం పిలుపు నిచ్చారు. గురువారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి హాజరైన నేతలకు భవిష్యత్ కార్యాచరణ గురించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారు. 2023 తర్వాత ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూ ఒక విజన్ తో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తూ సొంత ఇంటి కలను నిజం చేస్తున్నారనీ అన్నారు.
ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్లు తెలిపారు. రెండో విడతలో మరో రెండు వేల ఇండ్లు కేటాయించింతలు తెలిపారు.
హైదరాబాద్ మహానగరంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ ఎనభై వేల పుస్తకాలు చదివానని తనకంటే గొప్ప మేధావి ఎవరూ లేరని చెప్పుకున్న కేసీఆర్ కనీసం తన సొంత గ్రామంలో కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక పేదవానికి ఇల్లు కట్టించిన దాఖలాలు లేవనీ అన్నారు.
200 యూనిట్ల ఉచిత కరెంటు తో గ్రామీణ ప్రాంతాల్లో 99% పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారనీ, భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రూ. 20వేల కోట్లతో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.
నాడు కెసిఆర్ ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని చెప్పింది. కానీ మన ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనసిచ్చి రైతన్నలకు ఉండగా నిలిచిందనీ గుర్తు చేశారు.
గతంలో నీళ్లు నిధులు నియామకాల విషయంలో తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగ యువతను రోడ్డున పడేశారనీ అన్నారు.
గత బిఆర్ఎస్ నిరంకుశ ప్రభుత్వంలో మనం ఒక ధర్నాకు పిలుపునిస్తే ఐదు గంటలకే పోలీసులు మన ఇంటి ముందు ఉండేవారు
నాడు ధర్నా చౌక్ ను కూడా ఎత్తేసి ఎంత ఇబ్బంది పెట్టినారో మనందరికీ తెలుసు.. ఆ ప్రభుత్వాన్ని బొంద పెట్టి ప్రజలకు స్వేచ్ఛను అందించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రూ.వేల కోట్ల ఖర్చుపెట్టి సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా విషం కక్కుతూ ప్రచారం చేస్తున్నాయన్నారు. అదే సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పదింతలు యాక్టివ్ గా ఉండాలన్నారు.
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రోడ్లపై ధర్నాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారనీ అన్నారు.
దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను పూర్తిగా నిర్వీర్యం చేసే బీజేపీ కుట్ర చేసిందని విమర్శించారు. 23 లక్షల మంది నీట్ పరీక్ష రాస్తే ఆ పేపర్ లీకేజీకి బిజెపి ప్రభుత్వం పాల్పడిందనీ, మన యూపీఏ ప్రభుత్వ పాలనలో తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టం సమాచార హక్కు చట్టం ఆహార భద్రత చట్టం లాంటి ఎన్నో విప్లవత్మక చట్టాలను తీసుకువచ్చిందని మళ్లీ రావాలని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ ప్రధాని అవతారని ప్రజలందరూ ఆశిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శిగా జువ్వాడి అమరేందర్ రావు, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లాలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.