Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

సోమవారం, ఫిబ్రవరి 09, 2026

మంథని: మంథని మున్సిపాలిటీ మాదే.. శ్రీధర్ బాబు కాంగ్రెస్ భారీ ర్యాలీ


* ప్రచారంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

* మంథని మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం

మంథని:

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంథనిలోని  శ్రీపాదరావు  విగ్రహం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరుపేద కుటుంబాలకు అందజేస్తూ ముందుకు వెళ్తుందని ఎక్కడ కూడా అవినీతి జరగకుండా నేరుగా పేదలకు చేరవేస్తున్నామని రానున్న రోజులలో మరింత మంథని పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మంథని నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకురావడం జరిగిందనీ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 13 మంది అభ్యర్థులను గెలిపించడం ద్వారా మంథని పట్టణ అధిక నిధులు కేటాయించి అభివృద్ధి జరుగుతుందని పనిచేసే వారికే ఓటు వేయాలని కోరారు. ప్రతిపక్షాలకు ఓటు వేయడం వృధా అని తెలిపారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లులు, మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన అన్నారు. కుట్టుమిషన్ల ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. ఇప్పటికే మంథని మున్సిపల్ కార్యాలయం సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి, దరఖాస్తుదారులు ఎవరైనా వచ్చిన వెంటనే దరఖాస్తుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి వారికి త్వరితగతిన విచారణ చేసి పనులు చేస్తామని మంత్రి తెలిపారు.

ప్రతి ఒక్కరికి వైద్యం అందాలనే ఉద్దేశంతో మంథనిలో ఐదు పడకల డయాసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎంపీడీవో ఆఫీస్ దగ్గర్లో నూతన 50 పడకల ఆసుపత్రికి నిర్మాణ పనులు జరుగుతున్నాయని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న అభ్యర్థులను గెలిపించుకొని మన మంథని పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ చేతి గుర్తు పై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ 13 వార్డు అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి మంథని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 13 వార్డులకు సంబంధించిన మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026