మంథని పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సబ్బాని సంతోష్ ఆధ్వర్యంలో బుధవారం హర్గర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యఅతిథిగా పెద్దపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి,రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి,కొండపాక సత్య ప్రకాష్ పాల్గొన్నారు. ,"ఆజాధికా అమృత్ మహోత్సవ్"లో భాగంగా మంథని పురవీధుల గుండా సాగిన ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ లో భారీ ఎత్తున వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు మంథని పురవాసులు,వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చందుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటి పైన మువ్వన్నెల త్రివర్ణ పతాకం ఎగరాలి,ప్రతి మనిషి గుండెల్లో దేశభక్తి పొంగిపొర్లాలి అంటూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా మార్చడానికి ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులనే వాడాలి అంటూ పిలుపునిచ్చారు. దానికి మనందరం కట్టుబడి ప్రయత్నం చేయాలని,దేశ ప్రయోజనాల కోసం పార్టీలు పక్కన పెట్టి అందరం ఏకధాటిపైకి వచ్చి ఒకే మాటగా ముందుకు సాగాలని పిలుపునిస్తూ ఆపరేషన్ సింధూర్ తో మన దేశ సత్తా ప్రపంచాన్ని నివ్వరపరిచిందని,దేశ ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించే భారత సైన్యానికి ప్రతి భారతీయుడు వెన్నుదన్నుగా ఉండాలని, ఈనాటి బాలలే రేపటి పౌరులు ఆ పౌరులే రేపటి ఈ దేశ బలమైన దేశభక్తి కలిగిన పునాదిరాళ్లుగా మారాలని... బాల్యం నుంచే పిల్లల్లో దేశభక్తి , పోరాటపటిమ ,బలమైన ఆశయాలు నెరవేర్చుకునే ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని విద్యాసంస్థలకు వినమ్ర సూచన చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం అవడంలో సహకరించిన విద్యాసంస్థలకు,మంథని పట్టణ వాసులకు వివిధ పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్, రాజమౌళి గౌడ్, సీనియర్ నాయకులు చిలువేరి సతీష్,పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్, ఎడ్ల సాగర్,పట్టణ కార్యదర్శి వేల్పుల సత్యం,నాయకులు ఈసంపల్లి కొమరయ్య, మండల నాయకులు బూడిద విష్ణు, బొల్లంపల్లి లక్ష్మణ్, తోటపల్లి మహేష్,సదానందం పాల్గొన్నారు.
Dtv updates
బుధవారం, ఆగస్టు 13, 2025
పెద్దపల్లి: సినిమా/ వినోద రంగంలో నైపుణ్య కోర్సులు
**ప్రతి కోర్సు కు 25 వేల ఫీజు, హస్టల్ ఫీజు 20 వేలు*
**ఆసక్తిగల అభ్యర్థులకు జిల్లా యంత్రాంగం నుంచి కొంత సబ్సిడీ
సినిమా/వినోద రంగంలో స్వల్ప కాలిక నైపుణ్య కోర్సులు అందిస్తున్నామని ఆసక్తి గల వారు జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో 3 నెలల పాటు సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్ అండ్ వాయిస్ ఓవర్ స్కిల్, డిజిటల్ డిజైన్ & సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోర్సులలో నైపుణ్య శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.
ప్రతి కోర్స్ కు 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలని అన్నారు. 3 నెలల పాటు జరిగే కోర్సు కు 25 వేల రూపాయల ఫీజు , 20 వేల రూపాయల హస్టల్ ఫీజు ఉంటుందని, హైదరాబాద్ కొండాపూర్ లోని న్యాక్ అకాడమీలో శిక్షణ ఉంటుందని అన్నారు.
ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, కోర్సుపట్ల ఆసక్తి గలవారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మొదటి అంతస్తులో రూమ్ నెంబర్ 225 లో గల జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో సంబంధిత ధృవ పత్రాలతో తమ పేర్లు నమోదు చేసుకోవాలని , కోర్సు పట్ల ఆసక్తిగల అభ్యర్థులకు ఫీజు లో కొంత భాగం కలెక్టరేట్ నిధుల నుంచి సబ్సిడీ కింద అందించడం జరుగుతుందని ఆ కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మంథని: మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం
‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025’ జాబితాలో చోటు
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025’ జాబితాలో ఆయనకు చోటు లభించింది. తమ సమర్థవంతమైన నాయకత్వం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహామిస్తూ భారత్ ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్న వ్యక్తులకు ఇందులో చోటు కల్పించారు. విధాన రూపకర్తల విభాగంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇండియా ఏఐ మిషన్ సలహాదారు ఆకృత్ వైష్, ఇండియా ఏఐ మిషన్ సీఈవో, ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఎన్ పీసీఐ సీఈవో దిలీప్ అస్బే, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్, నాస్కామ్ మాజీ అధ్యక్షులు దేబజాని ఘోష్ తదితర ప్రముఖులను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.
** ఏఐ రంగంలో రోల్ మోడల్ గా తెలంగాణ **
మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఏఐ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ మారిందని, అందుకే ఆయనను ఈ జాబితాలో చేర్చినట్లు అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ నిర్వాహకులు ప్రకటించారు. ‘బాధ్యతాయుతమైన ఏఐ అమలు కోసం సమగ్ర ఏఐ ఆధారిత తెలంగాణ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ ను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. గుడ్ గవర్నెన్స్, నూతన ఆవిష్కరణలు, సురక్షితమైన డేటా షేరింగ్‌ను ప్రోత్సహించేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్ ను ప్రారంభించేందుకు చొరవ చూపారు’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును కొనియాడారు. ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహణలోనూ మంత్రి శ్రీధర్ బాబు కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో ఏఐ ఎకో సిస్టమ్ ను మరింత బలోపేతం చేసేలా 2025–26లో 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఆర్ అండ్ డీ, నూతన ఆవిష్కరణలు, అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయాలనే సంకల్పంతో ఏర్పాటు కానున్న ఏఐ యూనివర్సిటీ విషయంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు’ అని ప్రశంసించారు. ఏఐ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా మంత్రి శ్రీధర్ బాబుకు దక్కిన ఈ గుర్తింపు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
** సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహాంతోనే ఈ గుర్తింపు ; మంత్రి శ్రీధర్ బాబు **
ఇది నా ఒక్కడికి లభించిన గుర్తింపు కాదు. యావత్తు తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. సమ్మిళిత వృద్ధి, మెరుగైన జీవితాలను అందించేందుకు ఏఐని వినియోగించాలన్న మా ప్రభుత్వ సుదూర దృష్టికి ఈ గుర్తింపు నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే నాకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఆయన నాయకత్వంలో తెలంగాణను ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తీర్చిదిద్దేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. నూతన ఆవిష్కరణలకు సమానత్వాన్ని జోడించి, సాంకేతిక పురోగతి ఫలితాలు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందేలా కృషి చేస్తున్నాం.
మంథని:కార్మిక నేత బాసాని రాజయ్య విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
మంథని నియోజకవర్గంలో కార్మిక నేతగా వారి హక్కుల సాధన కోసం కృషి చేసిన హమాలి సంఘం మంథని డివిజన్ వ్యవస్థాపక మాజీ అధ్యక్షులు స్వర్గీయ బాసాని రాజయ్య విగ్రహ ఏర్పాటుకు మంథని హమాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం భూమి పూజ చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు.. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని హమాలీ సంఘం కార్యాలయం ముందు భాగంలో స్వర్గీయ బాసాని రాజయ్య విగ్రహ ఏర్పాటు కోసం హమాలీ సంఘం సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నేతల అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో వివిధ రంగాలోని కార్మికులు, హమాలీల హక్కుల కోసం బాసాని రాజయ్య పోరాడటం తోపాటు వారిని ఏకం చేసి గ్రామ గ్రామాన హమాలీ సంఘాలను నెలకొల్పి చట్టబద్ధంగా వారికి రిజిస్ట్రేషన్ చేసి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారన్నారు. రాజయ్య జీవితకాలం కార్మిక వర్గాల పక్షపాతిగా బతికారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మల్లేష్, బుక్క పుల్లయ్య, పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కొడుదుల వెంకన్న, ఆర్టీఏ మెంబర్ మంథని సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, మాజీ సర్పంచ్ వొడ్నాల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ-సురేష్ రెడ్డి , కొండేల మారుతి, మాజీ ఎంపీపీ కొండ శంకర్, సీపీఎం నేత బూడిద గణేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకుల కిరణ్, శ్రీపతి బానయ్య, మంథని సత్యం, బాసాని రమేష్, చింతల గోవింద్ లు పాల్గొన్నారు.
మంథని: సరిపడా ఎరువులను అందించాలి
జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్
మంథనిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి తిరుగుతున్నారని,రైతులకు సకాలంలో ఎరువులను అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతాంగానికి సకాలంలో ఎరువులు అందడం లేదని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి ఎరువులను సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
మంథని:పరిశుభ్రతకు ప్రాధాన్యత
10వ వార్డులో డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్న పెంటరి రాజు
వర్షాలు అధికంగా కురువడంతో డ్రైనేజీ శుబ్ర పరచడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు మంథని పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంటరి రాజు తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు లు వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించడంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో బుధవారం మున్సిపల్ కమిషనర్ వెంకన్న సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం అలాగే దోమల బెడద లేకుండా బ్లీచింగ్ పౌడర్ మున్సిపల్ సిబ్బందితో చల్లించినట్లు రాజు పేర్కొన్నారు. వర్షాలు అధికంగా ఉన్న మూలంగా ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రపరచాలని ఆయన మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కు పట్టణ ప్రజలు వివరించారు. ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బాలయ్య,,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషోర్ రెడ్డి, సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జి ఆరెల్లి కిరణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు పెరుగు సతీష్, కవుటం సాయి పాల్గొన్నారు.
పెద్దపల్లి: ఉద్యోగ అవకాశాలు
ప్రీ - ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ , ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
పెద్దపల్లి డీఈవో మాధవి
ఆగస్టు 21 లోపు ప్రీ - ప్రైమరీ ఇన్ స్ట్రక్టర్, ఆయా పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన పని చేయుటకు ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని *జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి* బుధవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పెద్దపల్లి జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి 46 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టామని అన్నారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలో తాత్కాలికంగా 10 నెలల గౌరవ వేతనానికి పని చేయుటకు ప్రీ - ప్రైమరీ ఇన్ స్ట్రక్టర్, ఆయా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీ.ఈ.ఓ తెలిపారు.
ప్రీ - ప్రైమరీ ఇన్ స్ట్రక్టర్ పోస్టుకు అభ్యర్థి ఇంటర్మీడియట్ , ఆయా కు 7వ తరగతి ఉత్తీర్ణత సాధించాలని, అభ్యర్థులకు 18 నుంచి 44 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ బీసీ, ఈ.డబ్ల్యూ.ఎస్ కు 5 సంవత్సరాల, దివ్యాంగులకు 10 సంవత్సరాల , మాజీ సైనికులకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుందని అన్నారు.
అభ్యర్థుల ఒకే నివాసం, హేబిటేషన్ మండలం పెద్దపెల్లి జిల్లా ప్రాధాన్యత క్రమంలో ఎంపిక ఉంటుందని అన్నారు. విద్యార్హతలు గల అభ్యర్థులు తమ యొక్క దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లకు ఆగస్టు 21 లోపు సమర్పించాలని విద్యాశాఖ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
పెద్దపల్లి: విదేశాల్లో ఉపాధి అవకాశాలు
26న అవగాహన సదస్సు
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ఆగస్టు 26న విదేశాల్లో ఉపాధి అవకాశాల పై కలెక్టరేట్ లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ద్వారా రాష్ట్ర యువతకు సురక్షితమైన చట్టబద్ధమైన విదేశీ ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందని అన్నారు. టామ్ కామ్ విదేశీ నియామకదారులతో అనుసంధానం చేసి, అవసరమైన డాక్యుమెంటేషన్, శిక్షణ, ప్లేస్మెంట్ వంటి సదుపాయాలు అందిస్తోందని కలెక్టర్ తెలిపారు.
జపాన్ లో ప్రస్తుతం నర్సింగ్ కేర్ (₹14–16 లక్షలు వార్షిక ప్యాకేజ్), జర్మనీ లో ఎలక్ట్రిషియన్ ( ₹32.76– 34.80 లక్షలు వార్షిక ప్యాకేజ్), ఇజ్రాయెల్ లో కన్స్ట్రక్షన్ వర్కర్: (₹19.20 లక్షలు వార్షిక ప్యాకేజ్), ఫిజీ – ఫిట్టర్ / ఎలక్ట్రిషియన్ / సర్వీస్ టెక్నీషియన్ ( ₹6–10 లక్షలు వార్షిక ప్యాకేజ్) గ్రీస్ – హౌస్‌కీపింగ్ / వెయిటర్ / ఎలక్ట్రిషియన్ / మేసన్ (₹12 లక్షలు వార్షిక ప్యాకేజ్), ఇతర అవకాశాలు పోర్చుగల్, యుఏఈ దేశాల్లో అందుబాటులో ఉన్నాయని అన్నారు.
ఆగస్టు 26న పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు టామ్ కామ్ ద్వారా విదేశాలలో ఉపాధి అవకాశాల పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకొని టామ్ కామ్‌లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. టామ్కామ్కి దరఖాస్తు చేసుకోవడానికి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం, గది నం. 231 ఆగస్టు 26 వరకు సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు
FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..
సప్తవర్ణ శోభితం
- 1. శనివారం... సాహితీ సుమాలు సాహిత్య రంగంలో ప్రముఖులు, వారి చరిత్ర, రచనలు, కవితలు,
- 2. ఆదివారం సాంస్కృతికం.. సినిమా, సంస్కృతిక రంగాల్లో లబ్ధప్రతిష్టుల గురించి వ్యాసాలు, ఇంటర్వ్యూలు
- 3. సోమవారం క్రీడా మైదానం క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వారి వివరాలు,
- 4. మంగళవారం
- 5. బుధవారం
- 6. గురువారం: ఆధ్యాత్మికం.. దేవాలయాలు, పండితులు, ప్రవచనాలు, భక్తి
- 7. శుక్రవారం.. సరస్వతీ నమస్తుభ్యం.. విద్యకు సంబంధించి ప్రముఖ కాలమిస్టుల రచనలు
విశిష్ట పోస్ట్
హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం
పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...
All time hit
-
ఆధ్యాత్మికతను సామాజిక సేవతో మేళవించిన వ్యక్తిత్వం శ్రీ సీతారామ సేవా సదన్‌తో సేవా ప్రస్థానం.. ...
-
ప్రపంచ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు దిక్సూచి, హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువత...
-
మంథని పట్టణంలోని పలు గణనాథులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం దర్శనం చేసుకున్నారు. 10 వ వార...
Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం








