Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

బుధవారం, సెప్టెంబర్ 16, 2026

జీ మీడియా ‘ఆర్కిటెక్ట్స్ ఆఫ్ వికసిత్ భారత్’ సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు

 


దిక్సూచి, హైదరాబాద్: 

జీ మీడియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన “ఆర్కిటెక్ట్స్ ఆఫ్ వికసిత్ భారత్” సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు,  మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. ఏఐ, సాంకేతికత, ఆవిష్కరణలు, భారతదేశ భవిష్యత్‌ అభివృద్ధిపై సదస్సులో పరిశ్రమల ప్రముఖులు, నిపుణులు చర్చించారు.

ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ  తెలంగాణలో కృత్రిమ మేధస్సు (AI), అధునాతన
సాంకేతికతలు, స్టార్టప్‌లు, భవిష్యత్‌ పరిశ్రమలకు బలమైన పర్యావరణ వ్యవస్థను
నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు, తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు కంపెనీలు, ఆవిష్కర్తలను ఆహ్వానించారు.

తరతరాల వ్యాపారాలు, ఉద్యోగాల సృష్టికి అవసరమైన మౌలిక వసతులు, అనుకూల వాతావరణం, అవకాశాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

భారత్‌ భవిష్యత్తుపై అర్థవంతమైన చర్చలకు వేదికగా నిలిచేలా సదస్సును నిర్వహించిన జీ మీడియా బృందానికి శ్రీధర్‌బాబు అభినందనలు తెలిపారు.

ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి


* సింగపూర్‌ కంపెనీలకు తెలంగాణలో విస్తృత అవకాశాలు 

* ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందంతో మంత్రి శ్రీధర్‌బాబు సమావేశం


దిక్సూచి, హైదరాబాద్​:

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’లో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని కోరారు. సెమీకండక్టర్‌ రంగంలో సింగపూర్‌కు ఉన్న సాంకేతిక, పారిశ్రామిక అనుభవాన్ని తెలంగాణతో అనుసంధానించి.. రాష్ట్రంలో ఫ్యాబ్‌ పరిశ్రమలతో పాటు అనుబంధ పరిశ్రమలు, సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేలా సింగపూర్‌ కంపెనీల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ అండ్‌ ట్రేడ్‌ శాశ్వత కార్యదర్శి ఆగస్టిన్‌ లీ నేతృత్వంలోని ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం బుధవారం డా. బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమైంది. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ హబ్’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. హై వాల్యూ ఇండస్ట్రీస్‌, ఆర్ అండ్ డీ, టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకుప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. ఐటీ/ఐటీఈఎస్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్‌, అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, లైఫ్‌సైన్సెస్‌, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్‌, గ్రీన్‌ టెక్నాలజీ, రెన్యూవబుల్‌ ఎనర్జీ, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌, అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఆర్ అండ్ డీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఇన్నోవేషన్‌ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్‌ కంపెనీలకు విస్తృత అవకాశాలున్నాయన్నాయని పేర్కొన్నారు. ఆ మేరకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు, అవకాశాలపై అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2026’లో సింగపూర్‌ ప్రభుత్వం, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొనేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీజీఐఐసీ ఎండీ శశాంక, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ డా.ఫ్రాన్సిస్ చోంగ్, ఇండియా డైరెక్టరేట్ డైరెక్టర్ జీన్ యీ, సౌత్ ఏషియా ఎంటర్ ప్రైజ్ డైరెక్టర్ ఆట్రీ టూన్ తదితరులు పాల్గొన్నారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026