రాష్ట్రం లో క్యూర్ పరిధి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నట్టు *శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు*. ప్రతి కార్పోరేషన్ లో ఒకరిని ఎంపిక చేస్తామని తెలిపారు. తెలంగాణా మున్సిపల్ చట్టం-2019 కి సవరణ కోరుతూ ఈ మేరకు ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. సామాజికంగా వివక్ష ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్లను ప్రధాన స్రవంతిలో కి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలు చేపట్టారని వివరించారు.
Dtv updates
శనివారం, సెప్టెంబర్ 12, 2026
గ్రీన్, రీసైకిల్ టాయిలెట్ల ప్రారంభం
దిక్సూచి, హైదరాబాద్:
నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఎదిగిన హైదరాబాద్ నగరం మరో ప్రపంచస్థాయి అత్యుధునిక సాంకేతికతకు వేదిక కానుంది. బిల్ గేట్స్ ఫౌండేషన్ అభివృద్ధి చేసిన పునర్వినియోగానికి వీలుగా నీటిని శుద్ధి చేసే నెట్ జీరో, గ్రీన్ టాయిలెట్లను తయారు చేయడానికి నగరం ఎంపికైంది. రీ ఫ్లో అనే పర్యావరణ అనుకూల సాంకేతిక సంస్థ, తెలంగాణా ప్రభుత్వ ఆధీనంలోని టీ- వర్క్స్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి ఇక్కడ అత్యాధునిక గ్రీన్ టాయిలెట్లను ఉత్పత్తి చేసి దేశంలోని వివిధ రాష్ట్రాలు, దేశాలకు సరఫరా చేయనున్నాయి. దేశంలోని మొట్టమొదటి గ్రీన్ టాయిలెట్లను ఇక్కడి లుంబినీ పార్కులో ఏర్పాటు చేసాయి. నీటిని పునర్విగించే ఈ నెట్ జీరో టాయిలెట్ల సముదాయాన్ని ఐటి, పరిశ్రమలు, శాసనవ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు*, రవాణా, బిసి సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ లు ప్రారంభించారు. రూ. కోటితో ఏర్పాటు చేసిన ఈ మరుగుదొడ్లను ఎక్కడికైనా తరలించే వీలుంటుంది. రీ ఫ్లో సంస్థ టీ వర్క్స్ తో కలిసి వాటిని ఇక్కడే ఉత్పత్తి చేయాలని నిర్ణయించడం పట్ల శ్రీధర్ బాబు ప్రశంసించారు. సోలార్ విద్యుత్తుతో నడిచే ఈ టాయిలెట్లకు విద్యుత్తు కనెక్షన్ అవసరం లేదు. ఒకసారి ట్యాంకును నింపితే అదే నీటిని అనేక సార్లు శుద్ది చేసి తిరిగి వినియోగిస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. టెక్నాలజీని ఉచితంగా అందజేస్తున్న గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 50 యూనిట్ల రీసైకిల్ టాయిలెట్లకు ఇప్పటికే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల నుంచి ఆర్డర్లు లభించాయని ఆయన వెల్లడించారు. గేట్స్ ఫౌండేషన్ పరిశోధన సంస్థలు అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత ఉచితంగా లభించడం వల్ల తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తక్కువ నీటిని వినియోగించడం, కరెంటు సరఫరా అవసరం లేక పోవడం వల్ల వీటిని ఎక్కడైనా ఉపయోగించవచ్చని శ్రీధర్ బాబు వివరించారు. కార్యక్రమంలో గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి అర్చనా వ్యాస్, రీ ఫ్లో ప్రతినిధి అభిషేక్, టి వర్క్స్ సిఇఓ జోగిందర్ తనికెళ్ల తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..
సప్తవర్ణ శోభితం
- 1. శనివారం... సాహితీ సుమాలు సాహిత్య రంగంలో ప్రముఖులు, వారి చరిత్ర, రచనలు, కవితలు,
- 2. ఆదివారం సాంస్కృతికం.. సినిమా, సంస్కృతిక రంగాల్లో లబ్ధప్రతిష్టుల గురించి వ్యాసాలు, ఇంటర్వ్యూలు
- 3. సోమవారం క్రీడా మైదానం క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వారి వివరాలు,
- 4. మంగళవారం
- 5. బుధవారం
- 6. గురువారం: ఆధ్యాత్మికం.. దేవాలయాలు, పండితులు, ప్రవచనాలు, భక్తి
- 7. శుక్రవారం.. సరస్వతీ నమస్తుభ్యం.. విద్యకు సంబంధించి ప్రముఖ కాలమిస్టుల రచనలు
విశిష్ట పోస్ట్
హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం
పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...
All time hit
-
ఆధ్యాత్మికతను సామాజిక సేవతో మేళవించిన వ్యక్తిత్వం శ్రీ సీతారామ సేవా సదన్తో సేవా ప్రస్థానం.. ...
-
ప్రపంచ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్బాబు దిక్సూచి, హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువత...
-
మంథని పట్టణంలోని పలు గణనాథులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం దర్శనం చేసుకున్నారు. 10 వ వార...
Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం