Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

సోమవారం, జులై 13, 2026

కూనారం ఆర్‌ఓబీ పనులు జూలై నెలాఖరులోగా పూర్తి చేయాలి

 


: కలెక్టర్ కోయ శ్రీహర్ష

ప్రతి ఓటరితో ఎన్యూమరేషన్ ఫారాలు నింపించి డిజిటలైజేషన్ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

దిక్సూచి, పెద్దపల్లి, జూలై 13: కూనారం రైల్వే ఫ్లైఓవర్ (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకుండా వేగవంతంగా పూర్తి చేసి జూలై నెలాఖరులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం కూనారం రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 30వ వార్డులోని డీసెంట్ ఫంక్షన్ హాల్‌లో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఓటరు నమోదు ప్రక్రియను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కూనారం ఆర్‌ఓబీ నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగాలని అన్నారు. విద్యుత్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో ఎదురయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలోనే వెంటనే పరిష్కరించి, జూలై నెలాఖరులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

అనంతరం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించిన కలెక్టర్, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను ఈ నెల 18వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రతి ఓటరిని చైతన్యపరిచి ఎన్యూమరేషన్ ఫారాలు తప్పనిసరిగా నింపించి బీఎల్‌వోలకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులు, సిబ్బంది పూర్తి సహకారం అందించాలని తెలిపారు. ఫారాలను బీఎల్‌వోలకు తిరిగి సమర్పించకపోతే ఓటరు నమోదుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రతి ఓటరు వాటిని తప్పనిసరిగా సమర్పించి డిజిటలైజేషన్ పూర్తయ్యేలా సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఈ పర్యటనలో ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్‌సింగ్, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ గంగాధర్, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026