Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

సోమవారం, జులై 13, 2026

విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్

 


ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5.70 కోట్ల నిధులు

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

దిక్సూచి, పెద్దపల్లి, జూలై 13: విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.

పెద్దపల్లి మండలంలోని హనుమంతునిపేట, మారేడుగొండ, మూలసాల, గుర్రంపల్లి గ్రామాల్లో జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్‌టీ) నిధులతో రూ.1.18 కోట్ల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరమ్మతులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెద్దపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మొత్తం రూ.5.70 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందిస్తున్నామని, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. గత విద్యా సంవత్సరంలో ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమని, అందులో పెద్దపల్లి మండలం ముందంజలో ఉండడం ఆనందదాయకమని చెప్పారు.

ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, విద్యాశాఖ అధికారులు అంకితభావంతో పనిచేయడం వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ప్రశంసించారు. గత ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుతం వాటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.

హనుమంతునిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200కు పెరగడం ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్నదానికి నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు మేడగొని శ్రీనివాస్, గుర్రం దేవేంద్ర నాగరాజు, సంపత్, కనపర్తి సంపత్‌రావు, కాంగ్రెస్ నాయకులు కటుకూరి సుధాకర్ రెడ్డి, మాదిరెడ్డి నరసింహారెడ్డి, బండారి రామ్మూర్తి, మండల సత్యనారాయణ రెడ్డి, ఆర్కుటి సంతోష్, ఆడెపు వెంకటేశం, గన్నమనేని తిరుపతిరావు, యనగందుల ప్రదీప్, ముత్యాల నరేష్, సుధాకర్ రెడ్డి, వెంకటేష్, రాజేశం, జూపాక శ్వేత, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026