Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

బుధవారం, సెప్టెంబర్ 09, 2026

పొలాల అమావాస్య.. రైతు బతుకుతో ముడిపడిన పండుగ

 

మంథని మహాలక్ష్మి ఆలయం వద్ద పోచక్క తల్లి 

(దిక్సూచి ప్రత్యేక కథనం)

తెలంగాణ పల్లెల్లో వ్యవసాయానికి, రైతు జీవితానికి ఎంతో ప్రాధాన్యం ఉన్న సంప్రదాయ పండుగల్లో పొలాల అమావాస్య ఒకటి. మట్టిని నమ్ముకుని జీవించే రైతు.. తనకు అన్నం పెట్టే భూమిని, వ్యవసాయాన్ని, పశువులను గౌరవిస్తూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

పొలాల అమావాస్య సందర్భంగా రైతులు తమ వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసి పూజిస్తారు. నాగలి, కొడవలి, పార వంటి వ్యవసాయ పరికరాలకు పసుపు, కుంకుమలు పెట్టి పూజలు నిర్వహిస్తారు. పంట పొలాలకు వెళ్లి భూమాతను స్మరించుకుని.. పంటలు బాగా పండాలని, కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటారు.

పశువులకు ప్రత్యేక గౌరవం

వ్యవసాయంలో రైతుకు తోడుగా నిలిచే ఎద్దులు, పశువులకు ఈ పండుగలో ప్రత్యేక స్థానం ఉంటుంది. వాటిని శుభ్రంగా కడిగి, కొమ్ములకు రంగులు వేసి, పూలతో అలంకరించి పూజలు చేస్తారు. పశువుల ఆరోగ్యం బాగుండాలని, వ్యవసాయ పనుల్లో అవి సహకరించాలని కోరుకుంటారు.

మట్టితో మనిషికి ఉన్న అనుబంధం

పొలాల అమావాస్య కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. రైతు–భూమి–పశువు–పంట మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక. విత్తనం వేసి పంట చేతికొచ్చే వరకు రైతు పడే శ్రమను, ప్రకృతిపై అతనికున్న నమ్మకాన్ని ఈ పండుగ ప్రతిబింబిస్తుంది.

ఆధునిక వ్యవసాయంలో ట్రాక్టర్లు, యంత్రాలు విస్తరించినా.. భూమిని పూజించడం, వ్యవసాయ పరికరాలను గౌరవించడం, పశువులను ఆదరించడం వంటి సంప్రదాయాలు ఇప్పటికీ తెలంగాణ గ్రామాల్లో కొనసాగుతున్నాయి.

తరతరాలకు అందాల్సిన సంప్రదాయం

నేటి తరం పిల్లలకు వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాకుండా.. రైతు జీవితం, మట్టితో ఉన్న అనుబంధం, ప్రకృతిని గౌరవించే సంస్కృతి గురించి తెలియజేసే సందర్భం కూడా పొలాల అమావాస్య.

భూమిని గౌరవిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది.. రైతును గౌరవిస్తేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది అనే సందేశాన్ని చాటిచెప్పే పండుగగా పొలాల అమావాస్యకు తెలంగాణ పల్లెల్లో ప్రత్యేక స్థానం ఉంది.

పొలాల అమావాస్య వ్రత కధ :

అనగా అనగా ఒక ఊర్లో ఓ బ్రహ్మణమ్మ . ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతునారు . పోతున్నారు. పుట్టగానే పోతున్న సంతానానికి ధుఖించి ఆ బ్రహ్మణమ్మ ఊరి వెలుపల పోచక్క తల్లి చుట్టు ప్రతి ఏట పిల్లల్ని బొంద పెడుతున్నది . ఈ పొలలమావాస్యకు పుడుతున్నారు , మళ్లీ పొలలమావాస్యకి చనిపోతున్నారు . నోముకుందామని ఎవర్ని పేరంటం పిలిచినా రామంటునారు . ఈ విధంగా బాధపడుతున్న ఇల్లాలుకు మళ్లీ ఎప్పటివలె సంతానం మైనది , చనిపోయింది . ఆ పిల్లను తీసుకుని పోచమ్మ దగ్గర బొంద పెట్టేందుకు పోయింది . అప్పుడు పోచక్క తల్లి ఈ ఊర్లలో వాళంత నాకు మొక్కేందుకు వస్తారు . పాయసం , వడలు నైవేద్యం తెస్తారు . ఎడ్లకు రంగులు వేసి నెమలి పించం పెట్టి గాలి , ధూళి తగలకుండా ప్రదక్షణం చేయిస్తారు . పాలేర్లు కల్లు తెస్తారు . వాళ్ళ పెళ్ళాలు కడవలతో పానకం తెస్తారు . నువ్వెందుకు శవాలు నా చుట్టూ బొంద పెడుతున్నావని ప్రశ్నించింది .
అమ్మా! పోచక్క తల్లి వేయి కళ్ళ తల్లివి నీకు తెలియనిది ఏముంది. నేను పూర్వ జన్మలో ఏ పాపం చేసానో నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తునారు అని బాధ పడింది. అప్పుడు పోచమ్మ తల్లి "బ్రహ్మణమ్మ పోయిన జన్మలో పొలలమావాస్య పేరంటాలు రాక ముందే పిల్లలు ఏడిస్తే ఎవరు చూడకుండా పాయసం , గారెలు పెట్టిందని , పులుసు తీపి సరిపోయిందో లేదో చవిచూసింది అని , మడి , తడి లేకుండా అన్ని అమాంగిలం చేసిందని అందుకే ఆమె పిల్లలు అలా పుట్టి పెరిగి చనిపోయినారని" చెప్పింది . తన అపరాధాన్ని తెలుసుకున్న బ్రహ్మణమ్మ పోచక్క తల్లి కాళ్ళమీద పడి తనను క్షమించమని వేడుకున్నది . అమ్మలక్కలు కలియుగం పుట్టనున్నది, పెరగన్నునది కనుక ఈ వ్రత విధానం మాకు తెలుపమని వేడుకోగా పోచక్క ఇలా తెలిపింది. "శ్రావణమాసం చివర బాధ్ర్రపదమాసం తొలుత వచ్చే అమావస్యని పొలలమావాస్య అంటారు . గోడను ఆవు పేడ పాలతో అలికి, పసుపు కుంకుమతో పొలాలు రాసి, కంద మొక్కని అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి, ఆ తోరం పోచక్క తల్లికి కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరంటాలకి ఇచ్చి మనము కట్టించుకోవాలి . పిండి వంటలు నైవేద్యం చేసి అమ్మకి నివేదన చేయాలి . భోజనం అనంతరం తాంబూలం దక్షిణ శక్తి కొలది సమర్పించాలి . ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా కలరా, మలేరియా , మశూచి మొదలైన వ్యాధులు రాకుండా పోచక్క తల్లి కాపాడుతుందని " చెప్పింది.
ఈ విధంగా బ్రహ్మణమ్మ ఈ వ్రతంని చేసి తన చనిపోయిన సంతానంని తిరిగిపొందింది.

మంగళవారం, సెప్టెంబర్ 08, 2026

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిగ్రీ, పీజీ కళాశాలల బంద్

దిక్సూచి, కరీంనగర్:

ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ, తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ పిలుపు మేరకు మంగళవారం, 08-09-2026న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ, పీజీ కళాశాలలు ఒక్కరోజు బంద్ పాటించాయి.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, కళాశాలల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయితే, బంద్‌కు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే తదుపరి దశలో నిరవధిక బంద్‌కు వెళ్లాల్సి వస్తుందని అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు.

ఈ సందర్భంగా శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ (సుప్మా) అధ్యక్షుడు గుగ్గిళ్ల జగన్ గౌడ్, కార్యదర్శి గోవిందవరం కృష్ణ, కోశాధికారి సంగోజు అంజయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని కోరారు.

విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ

 


దిక్సూచి,  జైపూర్‌, సెప్టెంబరు 8: మండలంలోని వేలాల ఎంపీయూపీఎస్‌ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్‌ బ్యాగుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కీ.శే. దుద్దిళ్ల రామయ్య–సత్యభామ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు దుద్దిళ్ల శ్రీపాదరావు బ్యాగులను అందజేశారు.

ఎంపీడీవో, గ్రామ సర్పంచ్‌, వార్డు సభ్యుల చేతుల మీదుగా పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జైపూర్‌ మండల ఎంపీడీవో, గ్రామ సర్పంచ్‌, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కె. శారద మాట్లాడుతూ విద్యార్థుల కోసం స్కూల్‌ బ్యాగులను అందించిన దాత దుద్దిళ్ల శ్రీపాదరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించిన గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ అయ్యగారికి, కార్యక్రమానికి హాజరైన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.

నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు


 దిక్సూచి స్పెషల్

స్పీకర్‌గా సభకు గౌరవం..         

ప్రజా నాయకుడిగా మంథనికి ఆత్మీయ బంధం 

అసెంబ్లీ సెంట్రల్‌ హాల్‌గా చిరస్థాయి గుర్తింపు

దిక్సూచి,  హైదరాబాద్:
కొన్ని రాజకీయ జీవితాలు పదవులతో ముగుస్తాయి. మరికొన్ని వ్యక్తిత్వాలు పదవులను దాటి చరిత్రలో నిలిచిపోతాయి. దుద్దిళ్ల శ్రీపాదరావు రెండో కోవకు చెందిన నాయకుడు. ప్రజల సమస్యలను శాసనసభలో బలంగా వినిపించిన ఎమ్మెల్యేగా, సభా నిబంధనలకు పెద్దపీట వేసిన స్పీకర్‌గా ఆయన వేసిన ముద్ర నేటికీ గుర్తుండిపోయింది. ఆయన ఒకప్పుడు నడిపించిన అదే శాసనసభలో ఇప్పుడు ‘దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్‌’ ఏర్పాటు కావడం ఆయన ప్రజా జీవితానికి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ హాల్‌ను ప్రారంభించారు. 

గ్రామ సర్పంచ్‌ నుంచి స్పీకర్‌ వరకు..

1937 నవంబర్ 6న జన్మించిన శ్రీపాదరావు బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చదివారు. స్వగ్రామం ధన్వాడ నుంచే ప్రజాసేవ ప్రారంభించారు. గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన ఆయన అనంతరం మంథని వ్యవసాయాభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు, మహాదేవపూర్ సమితి ఉపాధ్యక్షుడు తదితర బాధ్యతలు చేపట్టారు. రైతులతో, గ్రామీణ ప్రజలతో ఏర్పడిన ఈ అనుబంధమే ఆయన రాజకీయ ఎదుగుదలకు పునాదిగా మారింది. 

1983లో మంథని నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీపాదరావు.. ఆ తర్వాత వరుసగా విజయాలు సాధించారు. కాంగ్రెస్‌ శాసనసభా పక్ష విప్‌గా, పలు అసెంబ్లీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. 1991 ఆగస్టు 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై 1995 జనవరి 11 వరకు ఆ పదవిలో కొనసాగారు.

స్పీకర్‌ అంటే కుర్చీ కాదు.. బాధ్యత

శ్రీపాదరావు స్పీకర్‌ పదవిని అధికార ప్రదర్శనగా కాకుండా ప్రజాస్వామ్య బాధ్యతగా చూశారు. సభా నియమాలను లోతుగా అధ్యయనం చేసి వాటి ఆధారంగానే నిర్ణయాలు తీసుకునేవారని ఆయన రాజకీయ జీవితంపై వచ్చిన పలు విశ్లేషణలు చెబుతున్నాయి.

పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌, రూలింగ్స్‌ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అసెంబ్లీ వ్యవహారాల్లో ప్రత్యేక ముద్ర వేశాయి. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా సభా హక్కులను కాపాడటమే తన బాధ్యతగా భావించారు.

మైకు ముందు ప్రజలు.. రాజకీయాలు కాదు

ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శ్రీపాదరావు గోదావరి పరివాహక ప్రాంత రైతుల సాగునీటి సమస్యలు, ఉత్తర తెలంగాణ కరువు పరిస్థితులు, దళిత–బహుజన వర్గాల సమస్యలు, నిరుద్యోగం, పేదరికం, నక్సలైట్‌ సమస్య వంటి అంశాలను శాసనసభలో ప్రస్తావించారు.

ఆయన ప్రసంగాల్లో రాజకీయ విమర్శ కంటే సమస్యపై అధ్యయనం, పరిష్కారంపై ఆలోచన ఎక్కువగా ఉండేదని సమకాలీన విశ్లేషణలు పేర్కొంటున్నాయి. అందుకే ఆయన ప్రసంగాలను ఇప్పుడు ‘ప్రజల పక్షాన శ్రీపాద వాణి’ పేరుతో గ్రంథరూపంలోకి తీసుకువస్తున్నారు. ఎమెస్కో ఈ సంకలనాన్ని ప్రచురించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

పదవి పోయినా.. ప్రజలకు దూరం కాలేదు

1994 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా శ్రీపాదరావు ప్రజల నుంచి దూరం కాలేదు. మంథని ప్రజలతో ఆయనకు ఏర్పడిన అనుబంధం రాజకీయ లెక్కలకు అతీతమైనదిగా నిలిచింది. సామాన్యుడు అర్ధరాత్రి తలుపు తట్టినా స్పందించే నాయకుడనే విశ్వాసం ఆయనపై ఉండేదని ఆయన రాజకీయ జీవితంపై వచ్చిన కథనాలు పేర్కొంటున్నాయి.

1999 ఏప్రిల్ 13న నక్సలైట్ల చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. 62 ఏళ్ల వయసులో ఆయన జీవితం అర్ధాంతరంగా ముగిసినా.. ప్రజలతో ఏర్పడిన బంధం మాత్రం ముగియలేదు.

25 ఏళ్ల తర్వాత.. అదే సభలో శాశ్వత గుర్తింపు

శ్రీపాదరావు మరణించి దాదాపు 27 ఏళ్లు అవుతున్న సమయంలో ఆయన పేరు తెలంగాణ శాసనసభలోని కొత్త సెంట్రల్‌ హాల్‌కు పెట్టడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ తరహాలో రూపొందించిన ఈ ప్రాంగణం శాసనసభ, శాసనమండలి సభ్యులు పరస్పరం చర్చించుకునేందుకు, అధికారిక, శాసనపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగపడనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవం అనంతరం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అక్కడ అల్పాహార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయం ప్రకారం ఈ సెంట్రల్‌ హాల్‌ తెలంగాణ ప్రజాస్వామ్య విలువలు, శాసన సంప్రదాయాలు, చర్చా సంస్కృతికి ప్రతీకగా నిలవాలి.

తండ్రి చూపిన బాటలో తనయుడు

శ్రీపాదరావు వారసత్వాన్ని రాజకీయంగా కొనసాగిస్తున్న ఆయన తనయుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రస్తుతం తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రిగా ఉన్నారు. తండ్రి మాదిరిగానే విషయ పరిజ్ఞానం, ప్రశాంతత, ప్రజా సమస్యలపై దృష్టితో రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు.

దిక్సూచి మాట

శ్రీపాదరావు కథ ఒక రాజకీయ నాయకుడి జీవిత చరిత్ర మాత్రమే కాదు.
ప్రజా ప్రతినిధి ఎలా ఉండాలి?
స్పీకర్‌ పదవి అంటే ఏమిటి?
అధికార, ప్రతిపక్షాల మధ్య నిష్పాక్షికత ఎలా ఉండాలి?
శాసనసభలో మాట్లాడే ప్రతి మాట వెనుక ప్రజా ప్రయోజనం, విషయ పరిజ్ఞానం ఎంత అవసరం?

ఈ ప్రశ్నలకు ఆయన రాజకీయ ప్రస్థానం సమాధానం చెబుతుంది.

ఒకప్పుడు ఆయన కూర్చున్న స్పీకర్‌ కుర్చీ ఆయనను గుర్తుపెట్టుకుంది.
ఇప్పుడు ఆయన నడిపించిన సభే ఆయన పేరును శాశ్వతంగా మోస్తోంది.

అందుకే.. నడిపించిన సభలోనే నిలిచిన పేరు — దుద్దిళ్ల శ్రీపాదరావు. 

సోమవారం, సెప్టెంబర్ 07, 2026

మంథనిలో కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన సంబరాలు

 


సంబరాల వీడియోలకు Dtv చూడండి..

దిక్సూచి,  మంథని: 

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంథని మండలంలో కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు అయిలి ప్రసాద్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పోలు శివ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, రైతు సంక్షేమం, యువతకు అవకాశాలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డులు వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, పెట్టుబడి సాయం, ధాన్యం సేకరణతో పాటు విద్య, ఉద్యోగాల రంగంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను నాయకులు వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, మెగా డీఎస్సీ, గ్రూప్‌-1, గ్రూప్‌-2, పోలీస్‌ ఉద్యోగాల భర్తీ చేపట్టిందని పేర్కొన్నారు.

‘మంథని అభివృద్ధికి శ్రీధర్‌బాబే దిక్సూచి’

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా ఖండించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఓడేడు బ్రిడ్జి, మంథని మాతా శిశు ఆసుపత్రి నిర్మాణాలపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మంథనిలో 50 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్‌ కార్యాలయ సముదాయం, వెజ్‌–నాన్‌వెజ్‌ మార్కెట్లు, విస్తృత రహదారుల నిర్మాణానికి చర్యలు చేపడుతోందన్నారు.

మంత్రి శ్రీధర్‌బాబు, దుద్దిళ్ల శ్రీనుబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని నాయకులు హెచ్చరించారు. మంథని ప్రాంత అభివృద్ధి మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ 1,000 రోజుల పాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, మహిళా కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆదివారం, సెప్టెంబర్ 06, 2026

సెప్టెంబర్ 2026 ముఖ్యమైన రోజులు, పండుగలు

 


  • సెప్టెంబర్ 4: శ్రీకృష్ణ జన్మాష్టమి
  • సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ దినోత్సవం (Teacher's Day)
  • సెప్టెంబర్ 14: వినాయక చతుర్థి (గణేష్ చతుర్థి)
  • సెప్టెంబర్ 16: ప్రపంచ ఓజోన్ దినోత్సవం (World Ozone Day)
  • సెప్టెంబర్ 17: విశ్వకర్మ పూజ
  • సెప్టెంబర్ 18: ప్రపంచ వెదురు దినోత్సవం (World Bamboo Day)
  • సెప్టెంబర్ 21: అంతర్జాతీయ శాంతి దినోత్సవం మరియు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం
  • సెప్టెంబర్ 22: రోజ్ డే (క్యాన్సర్ రోగుల సంక్షేమం) & ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం
  • సెప్టెంబర్ 25: అనంత చతుర్దశి (గణేష్ విసర్జన)
  • సెప్టెంబర్ 27: మహాలయ అమావాస్య / పితృపక్షం ప్రారంభం

తెలంగాణ సిలికాన్‌ ఫోటోనిక్స్‌ మిషన్‌కు వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌

 


దిక్సూచి, హైదరాబాద్‌: నీతి ఆయోగ్‌ సభ్యుడు డా. వీకే సారస్వత్‌ ఆదివారం డా. బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సిలికాన్‌ ఫోటోనిక్స్‌ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ‘తెలంగాణ సిలికాన్‌ ఫోటోనిక్స్‌ మిషన్‌’కు దశలవారీ వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ రూపొందించడంపై చర్చించారు.

ఫోటోనిక్స్‌ వ్యాలీ కార్పొరేషన్‌ భవిష్యత్‌ కార్యాచరణతో పాటు ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌–2.0తో తెలంగాణ మిషన్‌ను అనుసంధానించే అవకాశాలను సమీక్షించారు. పరిశోధన నుంచి వాణిజ్య స్థాయి తయారీ వరకు డిజైన్‌, తయారీ, ప్యాకేజింగ్‌, టెస్టింగ్‌, సరఫరా వ్యవస్థలను అనుసంధానిస్తూ సమగ్ర ఎకోసిస్టమ్‌ ఏర్పాటు చేయడంపై అభిప్రాయాలు పంచుకున్నారు.

అధునాతన ఫోటోనిక్‌ ప్యాకేజింగ్‌, కో-ప్యాకేజ్డ్‌ ఆప్టిక్స్‌ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్‌బాబు తెలిపారు. త్వరలో ఏర్పాటు చేయనున్న క్వాంటం కంప్యూటింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో భాగస్వామ్యం కావాలని సారస్వత్‌ను ఆహ్వానించారు. ఫోటోనిక్స్‌, క్వాంటం కంప్యూటింగ్‌పై ఏర్పాటు చేయనున్న అడ్వైజరీ కౌన్సిల్‌కు నేతృత్వం వహించాలని కోరారు.

ఫోటోనిక్స్‌, క్వాంటం కంప్యూటింగ్‌ రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సారస్వత్‌ తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల భాగస్వామ్యానికి సహకరిస్తానన్నారు. సమావేశంలో ఐటీఈ&సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్‌ దురిశెట్టి, ఫోటోనిక్స్‌ వ్యాలీ కార్పొరేషన్‌ సీఈవో ఏఎస్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: శ్రీధర్‌బాబు

 


దిక్సూచి, హైదరాబాద్:

ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా, అసెంబ్లీకి హాజరుకాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. 

వెయ్యి రోజుల ప్రజాపాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలను తమ ప్రభుత్వం అమలు చేసిందని శ్రీధర్‌బాబు తెలిపారు. పదేళ్ల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్ఎస్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తోందని ఆరోపించారు. తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరై మాట్లాడితే ప్రతి అంశంపై సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆయన సలహాలు, సూచనలను కూడా స్వీకరిస్తామని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరారు.



శనివారం, సెప్టెంబర్ 05, 2026

కరీంనగర్‌లో సంబరాలు

 


ఇందిరా చౌక్‌లో భారీ కేక్‌ కట్‌.. పేదలకు ఆహార ప్యాకెట్ల పంపిణీ

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 5: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం ఇందిరా చౌక్‌ వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బాణాసంచా కాల్చి, డీజే పాటలతో కాంగ్రెస్‌ శ్రేణులు సందడి చేశారు. అనంతరం భారీ కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రూపురెడ్డి కశ్యప్‌రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఆహార ప్యాకెట్లను డా. మేడిపల్లి సత్యం పేదలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిందన్నారు. ఈ కాలంలో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 15 లక్షల కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, 43 లక్షల కుటుంబాలకు చేయూత పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.

మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు రూ.500 బోనస్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 1000 రోజుల్లో 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మిగిలిన ఖాళీలకు కూడా నోటిఫికేషన్లు జారీ చేస్తామని అన్నారు.

1000 రోజులుగా ప్రజల్లోకి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్‌ తక్షణమే రాజీనామా చేయాలని మేడిపల్లి సత్యం డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు నిరాశతో విమర్శలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌ వైపే నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒడితెల ప్రణవ్‌బాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్‌ హుస్సేన్‌, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఆరెపల్లి మోహన్‌, ఆల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్‌లో కాంగ్రెస్‌ 1000 రోజుల ప్రజా పాలన సంబరాలు

 


ఇందిరా చౌక్‌ నుంచి అంబేద్కర్‌ చౌక్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ

దిక్సూచి, కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా కరీంనగర్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్‌ వద్ద కార్యక్రమం నిర్వహించి, అనంతరం నగరంలో భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు.

ఇందిరా చౌక్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజీవ్‌ చౌక్‌, గాంధీ చౌక్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ చౌక్‌ మీదుగా అంబేద్కర్‌ చౌక్‌ వరకు కొనసాగింది. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి కార్యక్రమాలతో ప్రజలకు ప్రయోజనం కలుగుతోందన్నారు.

మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చామని తెలిపారు. గతంలో మాదిరిగా ఫామ్‌హౌస్‌ పాలన కాకుండా ప్రజల గడప వద్దకు పాలన చేరిందని వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు ఆల్‌ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి

 


పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉపాధే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

దిక్సూచి, హైదరాబాద్‌:

రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2026’ ఏర్పాట్లపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శనివారం ఆబిడ్స్‌లోని ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సమ్మిట్‌ ఏర్పాట్లు, రోడ్‌షోలు, ఎంవోయూలు, ప్రచారం, లాజిస్టిక్స్‌, ప్రోటోకాల్‌ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించి, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణను పెట్టుబడులకు మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్‌ సమ్మిట్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణను ఇతర రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిపేలా కొత్త విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా దేశీయ, విదేశీ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రత్యేక రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సమ్మిట్‌ వేదికగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులను పారిశ్రామికవేత్తలకు వివరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గతంలో కుదిరిన ఎంవోయూలు కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పెట్టుబడులుగా, పరిశ్రమలుగా రూపుదిద్దుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఎంవోయూపై ఎప్పటికప్పుడు పకడ్బందీగా ఫాలోఅప్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే రంగా
లకు సమ్మిట్‌లో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. విదేశీ ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లాజిస్టిక్స్‌, ప్రోటోకాల్‌, హాస్పిటాలిటీ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

శాఖల మధ్య సమన్వయం లోపించకుండా ప్రతి శాఖకు స్పష్టమైన బాధ్యతలు, టైమ్‌లైన్లు నిర్దేశించామని, ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమ్మిట్‌ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశిత గడువులో అన్ని పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.


వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు పకడ్బందీ ఏర్పాట్లు

 



5 నుంచి ప్రారంభం

నిర్వహణ, వసతులు, భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష

దిక్సూచి ప్రతినిధి, హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5: సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సమావేశాల నిర్వహణ, శాసనసభ్యులకు అవసరమైన వసతులు, భద్రతా చర్యలు, ఇతర శాఖల సమన్వయంపై శనివారం ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు.  

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమావేశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులు, సంబంధిత శాఖలకు సూచనలు చేశారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన మౌలిక వసతులు, సభ్యులకు కల్పించాల్సిన సౌకర్యాలు, సభా ప్రాంగణంలో నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.

అదేవిధంగా సమావేశాల సందర్భంగా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. శాసనసభ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయడంతో పాటు ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల రాకపోకలు, ప్రజలు, సందర్శకుల భద్రతకు సంబంధించిన అంశాలపై కూడా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వర్షాకాల సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, మీడియా ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో సూచించినట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొనసాగిస్తూ సమావేశాలు ప్రశాంతంగా, సమర్థవంతంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలు, వివిధ అంశాలపై చర్చకు వేదిక కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.

నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు.. నూతన గృహప్రవేశం

 


దిక్సూచి, మంథని, సెప్టెంబర్‌ 5: 

కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ అన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆశీస్సులతో మంథని నియోజకవర్గం కాకర్లపల్లి గ్రామానికి చెందిన దివంగత దొబ్బల చంద్రయ్య కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో శనివారం కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని అయిలి ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల్లో ఆనందం నింపడమే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.   

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో ఎవరూ లంచం ఇవ్వొద్దని, ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే క్యాంపు కార్యాలయంలో లేదా తనను నేరుగా సంప్రదించాలని సూచించారు. మంత్రి శ్రీధర్‌బాబు మంథని ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

ప్రజలకు తెల్ల రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ, రూ.2 లక్షల రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సోషల్‌ మీడియా ఇన్‌చార్జి ఆరెల్లి కిరణ్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ ఆకుల ప్రత్యూష సాయి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కన్నెబోయిన ఓదెలు, మాజీ చైర్మన్‌ ఆకుల కిరణ్‌, కాంగ్రెస్‌ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026