దిక్సూచి, హైదరాబాద్:
ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా, అసెంబ్లీకి హాజరుకాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు.వెయ్యి రోజుల ప్రజాపాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలను తమ ప్రభుత్వం అమలు చేసిందని శ్రీధర్‌బాబు తెలిపారు. పదేళ్ల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తోందని ఆరోపించారు. తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
కేసీఆర్ అసెంబ్లీకి హాజరై మాట్లాడితే ప్రతి అంశంపై సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆయన సలహాలు, సూచనలను కూడా స్వీకరిస్తామని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి