దిక్సూచి, హైదరాబాద్: నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీకే సారస్వత్ ఆదివారం డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సిలికాన్ ఫోటోనిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ‘తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్’కు దశలవారీ వ్యూహాత్మక రోడ్‌మ్యాప్ రూపొందించడంపై చర్చించారు.
ఫోటోనిక్స్ వ్యాలీ కార్పొరేషన్ భవిష్యత్ కార్యాచరణతో పాటు ఇండియా సెమీకండక్టర్ మిషన్–2.0తో తెలంగాణ మిషన్‌ను అనుసంధానించే అవకాశాలను సమీక్షించారు. పరిశోధన నుంచి వాణిజ్య స్థాయి తయారీ వరకు డిజైన్, తయారీ, ప్యాకేజింగ్, టెస్టింగ్, సరఫరా వ్యవస్థలను అనుసంధానిస్తూ సమగ్ర ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడంపై అభిప్రాయాలు పంచుకున్నారు.అధునాతన ఫోటోనిక్ ప్యాకేజింగ్, కో-ప్యాకేజ్డ్ ఆప్టిక్స్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్‌బాబు తెలిపారు. త్వరలో ఏర్పాటు చేయనున్న క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో భాగస్వామ్యం కావాలని సారస్వత్‌ను ఆహ్వానించారు. ఫోటోనిక్స్, క్వాంటం కంప్యూటింగ్‌పై ఏర్పాటు చేయనున్న అడ్వైజరీ కౌన్సిల్‌కు నేతృత్వం వహించాలని కోరారు.
ఫోటోనిక్స్, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సారస్వత్ తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల భాగస్వామ్యానికి సహకరిస్తానన్నారు. సమావేశంలో ఐటీఈ&సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, ఫోటోనిక్స్ వ్యాలీ కార్పొరేషన్ సీఈవో ఏఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి