దిక్సూచి, జైపూర్, సెప్టెంబరు 8: మండలంలోని వేలాల ఎంపీయూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కీ.శే. దుద్దిళ్ల రామయ్య–సత్యభామ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు దుద్దిళ్ల శ్రీపాదరావు బ్యాగులను అందజేశారు.
ఎంపీడీవో, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల చేతుల మీదుగా పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జైపూర్ మండల ఎంపీడీవో, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కె. శారద మాట్లాడుతూ విద్యార్థుల కోసం స్కూల్ బ్యాగులను అందించిన దాత దుద్దిళ్ల శ్రీపాదరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించిన గ్రామానికి చెందిన శ్రీకాంత్ అయ్యగారికి, కార్యక్రమానికి హాజరైన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి