Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

సోమవారం, ఫిబ్రవరి 09, 2026

పెద్దపల్లి : జిల్లాలో అన్ని మున్సిపాల్టీలు కాంగ్రెస్ కైవసం

* కాంగ్రెస్ గెలిస్తే పట్టణం మరింత అభివృద్ధి

* ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం

* త్వరలో పెద్దపల్లిలో ఐటీ పార్కు, ఆటోనగర్ ఏర్పాటు

* రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు

పెద్దపల్లి ప్రతినిధి:

జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని మున్సిపాల్టీ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం పెద్దపల్లి ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించిన యుద్ధ భేరి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుతోపాటు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గూడులేని నిరు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు. నిరుపేదలకు త్వరలోనే ఇంటి స్థలాలను కేటాయించి గేటెడ్ కమ్యూనిటీ కాలనీ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో త్వరలోనే ఐటీ పార్కు ఏర్పాటు చేయబోతున్నట్లు, ఆటో కార్మికుల కోసం ఆటో నగర్ నిర్మాణానికి స్థల సేకరణ కూడా చేసినట్లు ప్రకటించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ మంజూరులో పెద్దపల్లి అగ్ర స్థానంలో నిలిచిందని, అందుకు స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు  కృషి ఫలితమేనన్నారు. రూ. కోటితో జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టడీ కోచింగ్ సెంటర్ భవన నిర్మాణం. అత్యాధునిక సౌకర్యాలతో జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన రైతులందరికి రూ. 2 లక్షల రుణ మాఫీ అందించామని, సన్న వడ్లకు రూ.500 బోనస్ చెల్లించిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనన్నారు.  అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తించి పెద్దపల్లి పట్టణ ప్రజలు అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 


ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణాభివృద్ధికి రూ.92 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. మరో రూ.22 కోట్లు మంజూరు చేయించామని గుర్తు చేశారు. అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరిగెత్తిస్తున్నట్లు వివరించారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 మంది కాంగ్రెస్ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించే బాధ్యత ప్రజలదేనని, పట్టణాభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని ఎమ్మెల్యే ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్దపల్లి నియోజకవర్గానికి నిధుల ప్రవాహాన్ని తెప్పిస్తానని చెప్పారు. 

ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన వెంటనే పారదర్శకంగా జవాబుదారితనంతో ప్రజలకు సేవ చేసి గుర్తింపు పొందాలని సూచించారు. పట్టణాభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎన్నికల ఇన్చార్జి మరియు మాజీ ప్రజాప్రతినిధులు మరియు కౌన్సిలర్ అభ్యర్థులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు, పలు వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి - అభివృద్ధికి సహకరించండి

 
మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు

- ఈ ప్రాంతం మరో రాయలసీమ కావొద్దు.

- నేతన్నలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.

- పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా దోపిడే.

- వ్యాపారస్థులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది.

- బిఆర్ఎస్ ఎమ్మేల్యే పిట్ట బెదిరింపులకు భయపడేదిలేదు.

జమ్మికుంట:

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నామని ఇప్పుడు నేతన్నలకు కూడా అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ శాఖ,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం  జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్, జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు

అనంతరం ఆయన మాట్లాడుతూ తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఈ ప్రాంతంతో మంచి సంబంధాలు ఉన్నాయని,గతంలో అనేక సమస్యల మీద ఇదే గాంధీ చౌరస్తాలో ధర్నాలు నిర్వహించామని,అందులో కొన్ని ఇప్పుడు సంక్షేమ పథకాలుగా పురుడుపోసుకొని ప్రజలకు అందిస్తున్నామని,పదేళ్ల పాటు అరాచక దోపిడీ పాలనను బీఆర్ఎస్ నాయకులు కొనసాగించారని,దానికి విరుద్ధంగా సంక్షేమ పాలనను రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నామని అన్నారు.హుజూరాబాద్ ప్రాంతం మరో రాయలసీమ కావొద్దని,సెంటిమెంట్ తో మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు.ఎమ్మేల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి టీవీలు,ఫోన్ లో తప్ప ప్రజలకు అందుబాటులో ఉండడని అతని వల్ల ఏం ఉపయోగంలేదని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రణవ్ నాయకత్వంలో ఈ ప్రాంతానికి అధిక నిధులు కేటాయిస్తామని,ఆ బాధ్యత తాను తీసుకుంటానని,హుజురాబాద్ లో బెదిరింపు రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.వ్యాపారస్థులకు,నేతన్నలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి,ఆరుకాల వీరేశలింగం,సాయిని రవి,సారంగపాణి,పొనగంటి మల్లయ్య,పట్టణ,మండల అధ్యక్షులు,మహిళా అధ్యక్షురాల్లు,30 వార్డులనుండి పోటీ చేసే అభ్యర్థులు,సీనియర్ నాయకులు,మైనారిటీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆదివారం, ఫిబ్రవరి 08, 2026

మంథని: కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ నాయకులు



* మంత్రి సమక్షంలో చేరిన మాజీ ఎంపీపీ మాదాడి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి

మంథని:

బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ మదాడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంత రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మంత్రి శ్రీధర్ బాబు వారికీ కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు. వారితో పాటు  రెడ్డి సంఘము మాజీ అధ్యక్షులు ఎంఎస్ రెడ్డి, రామడుగు మారుతీ, రాదంటి శంకర్  మంత్రి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరడం చాలా సంతోష కరమన్నారు. మంథని పట్టణం తో పాటు మంథని నియోజకవర్గం అభివృద్ధి కోరకు వారు ముందుకు రావడం. పేద బడుగు బలహీన,మైనారిటీ వర్గాల అభివృద్ధి కొరకు వారి అనుభవంతో పాటు సలహాలు సూచనలు కుడా తీసుకుంటూ.. రానున్న రోజుల్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్ళతామన్నారు.

మంథని: మున్సిపల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం

ప్రచారంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని: 

మంథని మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం  మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా మంథని మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు అభ్యర్థి కుర్ర లింగయ్య, 2వ వార్డు అభ్యర్థి నూకల కమల్, 9వ వార్డు అభ్యర్థి మారుపాక నిహారిక, 13వ వార్డు అభ్యర్థి ఎల్లంకి వంశీ వార్డులలో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

అనంతరంమంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్య7మని పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించి అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు

రానున్న రోజుల్లో మంథని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించి, మంథని మున్సిపల్‌లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రజలను ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా పట్టణ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.


శనివారం, ఫిబ్రవరి 07, 2026

మంథని: ఎన్నికల ప్రచారంలో శ్రీను బాబు


మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లిలో ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారు బలపరిచిన 5వ వార్డు అభ్యర్థి ముస్కుల సయేందర్ రెడ్డి గారిని చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూచిరాజ్‌పల్లి ప్రజలను కోరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం,అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని,మంథని పట్టణ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.





9వ వార్డులో..
   మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు బలపరిచిన 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మారుపాక  నిహారిక  చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 9 వ వార్డు ప్రజలను కోరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం,అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని,మంథని పట్టణ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.

* మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి  చిత్రపటానికి నివాళి

మంథని పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న రాంరెడ్డి కాంప్లెక్స్‌లో మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి చిత్రపటానికి TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం రాంరెడ్డి కుటుంబ సభ్యులు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డిని కలిసి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

పెద్దపల్లి: మున్సి పాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం

 * కోట్ల రూపాయలతో పెద్దపల్లి పట్టణం అభివృద్ధి

* ఓట్ల కోసం వస్తున్న బీఆర్ఎస్, బీజేపీలను తరిమికొట్టండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండమెజారిటీతో గెలిపించాలి

*  పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు

పెద్దపల్లి ప్రతినిధి:

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలో   పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. 2వ వార్డు పాస్తాం లక్ష్మి, 8వ వార్డు ఎరుకల కల్పన, 9వ వార్డు ఎండీ నాదీమ్ వార్డుల్లో 21 వ వార్డు నుగుల్లా మల్లయ్య లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అదేవిధంగా వివిధ కూడళ్లలో రోడ్డు షో నిర్వహించి రెండేళ్ల తమ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి పట్టణం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు తీసుకవచ్చామన్నారు. పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపోతో పాటు బైపాస్ రోడ్డు మంజూరు చేయించామన్నారు.

ప్రధాన హదారులను అభివృద్ధి చేయడంతోపాటు వీధుల్లో సిమెంట్రోడ్లు,మురికి కాలువలు నిర్మిస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణపనులు జరుగుతున్నాయని, వాకర్స్ నడిచేందుకు వీలుగా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పట్టణంలోని అనివాడలకు తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. మహిళలకు ఆర్టీసీబస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచితవిద్యుత్, రైతు లకు 2లక్షల వరకు రుణమాఫీచేసి, 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమచేశామన్నారు. ఆరోగ్య శ్రీద్వారా 10లక్షలవరకు పెంచి ఉచితవైద్యాన్ని అందిస్తు న్నామని గుర్తుచేశారు. ఓట్ల సమయంలో వచ్చే బీఆర్ఎస్. బీజేపీలనిప్రజలుతరిమికొట్టాలన్నా రు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్నిచూసి ఈనెల 11న జరగనున్నఎన్నికల్లో చేతిగుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయా వార్డుల ఇంచార్జ్లు మరియు కార్యకర్తలు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

గురువారం, ఫిబ్రవరి 05, 2026

మంథని: అభివృద్ధిలో భాగస్వాములు కావాలి


 


మంథని మున్సిపల్ ఎన్నికల  ప్రచారంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంథని పట్టణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మంథని పట్టణంలోని 2వ,3వ,5వ,6వ, వార్డులలో సంబంధించిన అంబేద్కర్ నగర్, ముత్యాలమ్మ వాడ, బోయినపేట, దుబ్బగూడెం, గొల్లగూడెం ప్రజలతో మాట్లాడుతూ పార్టీ బలపరచినటువంటి అభ్యర్థులను 11న చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. 

యజుర్వేద స్వహాకార యజ్ఞంలో..



*శ్రీ అమ్నాయ వర్ధిని సేవా ట్రస్టు మంథని వారు శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర దేవాలయంలో నిర్వహించిన సంపూర్ణ యజుర్వేద స్వాహాకార యజ్ఞంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.  అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.

మంథని: మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డికి నివాళులర్పించిన మంత్రి

రాంరెడ్డి పార్టివ దేహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని: మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి  పార్థివదేహన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం సందర్శించి నివాళులర్పించారు.  అనంతరం ఆయన భార్యా  వసుమతి రెడ్డి, కుమారులు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డిలను ఓదార్చి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  

రాంరెడ్డి భార్య వసుమతి రెడ్డిని
ఓదారుస్తున్న శ్రీధర్ బాబు

రాంరెడ్డి కుమారులను పరామర్శిస్తున్న
 శ్రీధర్ బాబు

ప్రజా నాయకుడు రాంరెడ్డి

అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాంరెడ్డి గ్రామ సర్పంచ్, ఎంపీపీ, శాసనసభ్యులుగా మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవ చేశారనీ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఏది ఏమైనా మారుమూల అటవీ ప్రాంతమైన మంథని ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో, ఈ ప్రాంత ప్రజా సమస్యలపై ఓ ప్రజా నాయకుడిగా స్పందించారని అన్నారు. వ్యక్తిగత స్వార్థంతో ఆలోచించకుండా, ఒక ప్రతిపక్ష నేతగా వ్యక్తిగత దూషణలకు పోకుండా, రాజకీయమంటే ఇలా ఉండాలని ముందుకు తీసుకెళ్లిన నేపథ్యాన్ని ఈ రోజు గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాన్ని అన్నారు.






బుధవారం, ఫిబ్రవరి 04, 2026

పెద్దపల్లి: గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత నాది..

* పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు 

పెద్దపల్లి ప్రతినిధి;

పెద్దపల్లి పట్టణంలోని 28వ వార్డు సుభాష్ నగర్లో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి తూముల లత సుభాష్ రావు, 27వ వార్డు ఉనుకొండ సరస్వతి, 6వ వార్డు కట్ట పద్మావతి నరేంద్ర చారి మరియు 7వ వార్డు భూంనగర్లో ఈర్ల స్వరూప సురేందర్ కు మద్దతుగా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 


పెద్దపల్లి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించండి అని ప్రజలను కోరారు. పెద్దపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లో అన్ని రకాల వసతులను కల్పిస్తూ అభివృద్ధి మరియు సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా అభివృద్ధి, సంక్షేమం జోడెడ్డులులా దూసుకుపోతోందని గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో పేదలకు మరియు రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. ఎన్నికలు రాగానే బి.ఆర్.ఎస్ మరియు బీజేపీ పార్టీల వారు ఓట్ల కోసం తిరుగుతారని వారి మాయమాటలకు ప్రజలు ఎవరూ మోసపోవద్దని కోరారు. ఓట్ల సమయంలో వచ్చే బి.ఆర్.ఎస్ & బీజేపీ పార్టీల వారిని ప్రజలు తరిమికొడతారని అన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించి కౌన్సిల్ కు పంపిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని తెలిపారు. ఈ నెల ఫిబ్రవరి 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించమని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలు వార్డుల ప్రజలు,  మహిళలు  పాల్గొన్నారు.

పెద్దపల్లి: ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను బలపర్చండి

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

* కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించండి

పెద్దపల్లి ప్రతినిధి:

ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మున్సిపల్ లో గెలిస్తే పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయనీ రాష్ట్ర  ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా బుధవారం  పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గోల్డెన్ తులిప్ బ్యాంకెట్ హాల్ల్లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు తో కలిసి పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ హయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్చిన్నం చేసినా,  కాంగ్రెస్ పార్టీ దాన్ని గాడిలో పెట్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నానీ అన్నారు. బి.ఆర్.ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో పట్టణాలను, పల్లెలను గాలికొదిలేసారు ఆన్నారు. ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు అని ఎన్నికలు వస్తె అడ్డగోలుగా మాటలు చెప్పే పార్టీలు బి.ఆర్.ఎస్, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి పెద్దపల్లి జిల్లాకు నిధులు కేటాయించలేదని పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గత బి.ఆర్.ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ లను అరకొరగా కట్టి లబ్ధిదారులకు అందించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత డబుల్ బెడ్ రూం లకు మౌలిక సదుపాయాలు కల్పించి అందించిన ఘనత మీ ఎమ్మెల్యే విజయరమణ రావుదే అని అన్నారు. అలాగే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

మంథని: అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తాం


* మంథని మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 
మంత్రి శ్రీధర్ బాబు
* కో ఆప్షన్ సంబంధించి మైనార్టీ వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని పార్టీ నిర్ణయం

మంథని: మున్సిపాలిటీనీ సంబంధించిన ప్రజలకు దగ్గర ఎటువంటి  రూపాయి ఖర్చు లేకుండా పరిమిషన్ లో గాని ప్రజా అందాల్సిన పథకాల విషయంలో ఎలాంటి అవినీతి జరగకుండా పారదర్శకంగా ముందు వెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 

మంథని పట్టణ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రహదారులు, పరిపాలన, ఆరోగ్యం, విద్య, పట్టణ సౌకర్యాలు వంటి అన్ని రంగాలు సమగ్రంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించి వాటిని ఆచరణలో పెడుతున్నామని  మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటింటికి పథకాలు అందజేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ సంక్షేమం అర్హుల దరిచేరకుండా వారిని నమ్మించి మోసం చేసిన ఘనత ముమ్మాటికీ వారిదేనని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇచ్చి ఆకలి తీర్చామని, మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలకు ఇందిరమ్మ ఇల్లే గాని, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,రెండు లక్షల రుణమాఫీ,మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు,అనారోగ్య బాధితులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంపు చేయడం జరిగిందని అది కాంగ్రెస్ మార్కు పాలన అని చెప్పారు. ఇప్పటికే మంథని మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో  అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, మంథని పట్టణం రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.  

 ప్రజల విశ్వాసం మరియు ప్రజల ఆశీర్వాదాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ ఘన విజయం సాధించి,మంథని పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేశారు.

అభివృద్ధి కావాలంటే హస్తం గుర్తుకే ఓటేయాలని, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.









మంగళవారం, ఫిబ్రవరి 03, 2026

మంథని: పోరు బరిలో నిలిచేది వీరే..


మంథని మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ పడే ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆయా పార్టీ వర్గాలు ప్రకటించాయి. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు వారికి పార్టీ అందించిన బీ ఫారం ను ఎన్నికల అధికారులకు అభ్యర్థులు అందచేశారు.

కాంగ్రెస్ అభ్యర్థులు వీరే...

1వ వార్డు - కుర్రు‌ లింగయ్య.
2వ వార్డు - నూకల‌ కమల్.
3వ వార్డు - శ్రీపతి బానయ్య.
4వ వార్డు - ఎరుకల‌ స్రవంతి.
5వ వార్డు - ముస్కుల‌ సహేందర్ రెడ్డి.
6వ వార్డు - పోలు రజిత.
7వ వార్డు - జంబోజు‌‌ సమ్మయ్య.
8వ వార్డు - నరెండ్ల విజయలక్ష్మి.
9వ వార్డు - మారుపాక‌ నిహారిక.
10వ వార్డు - పెంటరి రాజు.
11వ వార్డు - వొడ్నాల‌ శ్రీనివాస్.
12వ వార్డు - వేముల‌ విజయలక్ష్మి.
13వ వార్డు - ఎల్లంకి‌‌ వంశీ

 బీఆర్ఎస్ అభ్యర్థులు

1వ వార్డు గంధం ఆంజనేయులు
2వ వార్డు - ఆరెపల్లి కుమార్
3వ వార్డు - మాచీడి రాజుగౌడ్
4వ వార్డు - బడికల లావణ్య శ్రీనివాస్
5వ వార్డు - అంబటి నర్సింగ్
6వ వార్డు - కాయితీ జ్యోతి సమ్మయ్య
7వ వార్డు - మంథని సంధ్య హరీష్
8వ వార్డు - కొత్త పద్మ
9వ వార్డు - దాసరి పుష్ప మల్లేష్
10వ వార్డు - బండారి సమ్మయ్య
11వ వార్డు - పుప్పాల తిరుపతి
12వ వార్డు - పూదరి లావణ్య సాగర్
13వ వార్డు - మంథని విజయ్ కుమార్

* బీజేపీ అభ్యర్థులు*


1st వార్డ్ కేతిరి విజయ
2 nd వార్డ్ దాసరి శ్రావణ్
3 rd  వార్డ్ చిలువేరి సతీష్
4 th వార్డ్ దూడపాక రోజ
5 th వార్డ్ బోయిని నారాయణ
6 th వార్డ్ తాత మధునమ్మ
7 th వార్డ్
8 th వార్డ్ ఎడ్ల మౌనిక
9 th వార్డ్ సామల లక్ష్మి
10 th వార్డ్ సామల అశోక్
11 th వార్డ్ రాపర్తి సంతోష్
12 th వార్డ్ శ్రీరామోజు సుజాత
13 th వార్డ్ గట్టు రాధాకిషన్

మంథని: మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కన్నుమూత

మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రామిరెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ లో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస వదిలారు. 1994 లో మంథని ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటికీ స్పీకర్ పదవిలో ఉన్న దుద్దిళ్ల శ్రీపాద రావుపై విజయం సాధించారు. స్వగ్రామమైన ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ సర్పంచిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన అక్కడి నుంచే ఎంపీటీసీగా గెలిచి ముత్తారం మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. అంతరం 1994 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేసేందుకు అవకాశం లభించింది. ఎన్టీఆర్ ప్రభంజనంలో గెలిచిన ఆయన 1999 ఎన్నికల్లో శ్రీపాద రావు తనయుడు ప్రస్తుత ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతిలో ఓటమి చవిచూశారు.  ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడం రెబల్ గా పోటీ చేసి టీడీపీ అభ్యర్తి ఓటమికి కారకుడయ్యాడు.  ఆ తరువాత వరుసగా మూడోసారి ఓటమి చవి చూసిన ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరినా, చివరి నిమిషంలో పార్టీ టికెట్ దక్కకపోవడంతో బీజేపీ లో చేరారు. ప్రస్తుతం బీజేపీలో ఆయన కుమారుడు చురుకైన భూమిక నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతిపై మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. గురువారం మంథని గోదావరి తీరంలో ఆయన అంతిమ సంస్కారం ఉంటుందని కుటుంబ సభ్యులు ప్రకటించారు.

సోమవారం, ఫిబ్రవరి 02, 2026

కరీంనగర్: 4న ఉమ్మడి జిల్లా అండర్-19 క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్-19 క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 4న నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు వి.అగం రావు, కార్యదర్శులు ఎన్.మురళిధర్ రావు, ఉపాధ్యక్షులు కె.మహేందర్ గౌడ్, పి.మనోహర్ రావు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేసన్ ఆధ్వర్యంలో హెచ్.సి.ఎ.లో జరిగే అండర్-19 జట్ల టోర్నమెంట్లో పాల్గోనే ఉమ్మడి జిల్లా జట్లు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆసక్తి గల క్రీడాకారులు తమ యొక్క వివరములు మీ-సేవ నుండి పొందిన జనన ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, రెండు ఫోటోలు, పూర్తి యూనిఫాంతో అల్గునూర్ లోని కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి వెలిచాల జగపతి రావు మెమోరియల్ క్రికెట్ మైదానానికి అదే రోజు ఉదయం 8-30 గంటలకు హాజరుకావాలని కోరారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులు సెప్టెంబర్, 1 2007 తర్వాత జన్మించిన వారై ఉండాలని స్పష్టం చేశారు. ఎంపిక పోటీలలో పాల్గోన్న క్రీడాకారులలో (30) మందిని ప్రాథమికంగా ఎంపిక చేసి అందులో నుండి నైపుణ్యం కనబర్చిన క్రీడాకారులను ఒక జట్టుగా ఎంపిక చేసి ఈ నెల 8న జరిగే వన్డే టోర్నికి పంపిస్తామన్నారు. (రిజిస్ట్రేషన్ కొరకై KDCA వెబ్సైట్ నుండి ఫారం డౌన్లోడ్ చేసి, రిజిస్ట్రేషన్ చేసుకావాలని కోరారు.

పెద్దపల్లి: కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించండి..


కొత్తపుంతలు తొక్కుతున్న ఎన్నికల ప్రచారం..

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు 


పెద్దపల్లి;

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలోని 12వ వార్డు, 29వ వార్డు మరియు 31వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.



ముందుగా సాగర్ రోడ్డు కంచేర భావి వద్ద గల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దపల్లి పట్టణంలోని 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దొడ్డుపల్లి జగదీష్, 29వ వార్డు ఇల్లందుల రజనీ కృష్ణమూర్తి మరియు 31వ వార్డులో మంథని నర్సింగ్ లను ఈ నెల ఫిబ్రవరి 11న బుధవారం జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచాక పెద్దపల్లి పట్టణం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. పెద్దపల్లి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోట్ల రూపాయల నిధులను వెచ్చించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని గత పాలకులు అభివృద్ధి విషయంలో మొద్దు నిద్ర పోయారని విమర్శించారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి వారి సొంతింటి కళ నెరవేరుస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, జీరో వడ్డీ రుణాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, ఉచిత సన్న బియ్యం, సన్న వడ్ల బోనస్, రైతు రుణమాఫీ, 5 లక్షల ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపుదల, రైతు భరోసా మరియు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం విషయంలో విఫలం అయ్యారని మళ్లీ ఎ మొహం పెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లను అడుగుతున్నారని విమర్శించారు. పెద్దపల్లి పట్టణంలో గత బి.ఆర్.ఎస్ పాలకులు నిలువు దోపిడీలకు పాల్పడ్డారని బి.ఆర్.ఎస్ పార్టీ వారి దోపిడీలను ప్రజలందరూ గమనిస్తున్నారని వారికి మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణ ప్రజలు చైతన్యవంతులని బి.ఆర్.ఎస్ మరియు బీజేపీ పార్టీల వారికి ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో నూతన బస్సు డిపో, బైపాస్ రోడ్డు, నూతన్ కోర్టు భవనం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలకు ఆధునీకరణ, సిటీ స్కాన్, ఎం.ఆర్. ఐ మరియు తాను ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్ల పాలనలో రూ.40 కోట్లతో సీసీ రోడ్లు, మురికి కాలువలు, మౌళిక వసతుల కల్పన పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో పాత వాటర్ ట్యాంక్ స్థానంలో కొత్తగా వాటర్ ట్యాంక్, చందపల్లి డబుల్ బెడ్ రూం ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేస్తున్నామని తెలిపారు. రూ 62.50 కోట్లతో అభివృద్ది పనులు ప్రారంభించామని, మరో 15 కోట్ల నిధులు మంజూరు చేయించానని తెలిపారు. వీటిని ప్రజల అవసరాలను గుర్తించి నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి రూ 77.50 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆధునీకరణ కోసం రూ 7.5 కోట్లు కేటాయించినట్లు వివరించారు. క్రీడల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాని ఇందులో భాగంగా వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఇండోర్ బ్యాడ్మింటన్ షటిల్ స్టేడియం ఏర్పాటుకు డి ఎం ఎఫ్ టీ నుండి రూ 2.5 కోట్లు కేటాయించి పనులు చేపట్టినట్లు . పట్టణంలోని శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నట్లు తెలిపారు.   అధికార పార్టీ అభ్యర్థులనే కౌన్సిలర్లుగా గెలిపిస్తే అభివృద్ది సాధ్యమన్నారు. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం రోజున జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బడ్జెట్



* రాష్ట్రాల ఆర్థిక స్వావలంబన లేనిదే దేశాభివృద్ధి సాధ్యమా..?

* తెలంగాణపై వివక్షాపూరిత ధోరణి 

* రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 


హైదరాబాద్: 

"భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం.. ఇండియా అంటే రాష్ట్రాల సమూహం (Union of States). రాష్ట్రాల ఆర్థిక స్వావలంబన లేనిదే దేశాభివృద్ధి సాధ్యపడదని రాజ్యాంగం చెబితే, కేంద్రం మాత్రం ఈ బడ్జెట్ లో ఆ మూలసూత్రాన్నే విస్మరించింది" అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. దేశ జీడీపీలో 5 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్న తెలంగాణ గురించి బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం గర్హనీయమని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం తరచూ వల్లించే "సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్" అనే నినాదం "తెలంగాణ" విషయంలో కేవలం నీటి మూటలేనని మరోసారి ఈ బడ్జెట్ లో స్పష్టం అయ్యిందన్నారు. ఓ వైపు అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉంటుందని చెబుతూనే, మరోవైపు నిధుల కేటాయింపుల్లో "తెలంగాణ" పట్ల రాజకీయ వివక్ష చూపడం రాజ్యాంగ నైతికత (Constitutional Morality) అనిపించుకోదని హితవు పలికారు. "బడ్జెట్ అనేది ఆర్థిక హేతుబద్ధత(Economic Rationality) ఆధారంగా రూపొందించాలి. కానీ... కేంద్రం రాజకీయ అనుకూలత( Political Expediency)కు ప్రాధాన్యతనిచ్చి తాజా బడ్జెట్లో తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది" అని వివరించారు. "ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో తెలంగాణకు రూ. 22,782 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 10 నెలలు గడుస్తున్నా అందింది కేవలం సుమారు రూ. 4,000 కోట్లు మాత్రమే. అంటే రావాల్సిన దాంట్లో 20 శాతం కూడా అందలేదు. ఇది తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న ఆర్థిక అణచివేత (Fiscal Suppression) కు ఇది మరో సాక్ష్యం" అని వెల్లడించారు. "రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ అనేది సమ న్యాయంగా (Equitable Distribution) జరగాలి. కానీ, సహకార సమాఖ్య (Cooperative Federalism) సూత్రాలకు విరుద్ధంగా "తెలంగాణ" పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షాపూరిత సమాఖ్య ధోరణిని ప్రదర్శిస్తోందని తాజా బడ్జెట్ మరోసారి రుజువు చేసింది" అని అన్నారు. "రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్ – 2, గోదావరి – మూసీ అనుసంధానం, బందరు పోర్టు-హైదరాబాద్ డ్రైపోర్టు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే, నాలుగు కొత్త విమానాశ్రయాలు, రైలు కనెక్టివిటీ మెరుగుదల, విభజన చట్టంలోని పెండింగ్ హామీల అమలుకు నిధులు కేటాయించాలని మేము పలుమార్లు కోరినా పట్టించుకోకపోవడం ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలభిస్తోన్న వివక్ష పూరిత వైఖరికి నిలువెత్తు నిదర్శనం" అని ఆందోళన వ్యక్తం చేశారు. "హై స్పీడ్ రైల్ కారిడార్స్"తో "తెలంగాణ"కు మమ అనిపించిన కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరిపై తెలంగాణ నుంచి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎంపీలు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఇకనైనా కేంద్రం తన ధోరణిని వీడి, రాజ్యాంగబద్ధమైన సమానత్వం పాటించాలని కోరారు.

పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని

పెద్దపల్లి:

మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.

మున్సిపల్ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లతో సోమవారం వారు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.

 పురపాలక ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు నిబంధనల ప్రకారం జరగాలన్నారు.

పోలింగ్ కు అవసరమైన మేర బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని, పోలింగ్ బృందాలు, డిస్ట్రిబ్యూషన్,  రిసెప్షన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్ లలో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.  కౌంటింగ్ ముగిసిన తర్వాత మున్సిపాలిటీలలో చైర్ పర్సన్, కార్పొరేషన్లలో మేయర్ ఎన్నిక కోసం ఫారం 2 లను సిద్ధం చేసి సంసిద్ధం కావాలని, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు ముందుగానే సమాచారం అందించాలని అన్నారు.  ఈ సమావేశంలో  పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026