Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

ఆదివారం, ఫిబ్రవరి 08, 2026

మంథని: మున్సిపల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం

ప్రచారంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని: 

మంథని మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం  మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా మంథని మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు అభ్యర్థి కుర్ర లింగయ్య, 2వ వార్డు అభ్యర్థి నూకల కమల్, 9వ వార్డు అభ్యర్థి మారుపాక నిహారిక, 13వ వార్డు అభ్యర్థి ఎల్లంకి వంశీ వార్డులలో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

అనంతరంమంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్య7మని పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించి అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు

రానున్న రోజుల్లో మంథని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించి, మంథని మున్సిపల్‌లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రజలను ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా పట్టణ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.


శనివారం, ఫిబ్రవరి 07, 2026

మంథని: ఎన్నికల ప్రచారంలో శ్రీను బాబు


మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లిలో ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారు బలపరిచిన 5వ వార్డు అభ్యర్థి ముస్కుల సయేందర్ రెడ్డి గారిని చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూచిరాజ్‌పల్లి ప్రజలను కోరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం,అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని,మంథని పట్టణ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.





9వ వార్డులో..
   మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు బలపరిచిన 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మారుపాక  నిహారిక  చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 9 వ వార్డు ప్రజలను కోరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం,అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని,మంథని పట్టణ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.

* మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి  చిత్రపటానికి నివాళి

మంథని పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న రాంరెడ్డి కాంప్లెక్స్‌లో మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి చిత్రపటానికి TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం రాంరెడ్డి కుటుంబ సభ్యులు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డిని కలిసి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

పెద్దపల్లి: మున్సి పాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం

 * కోట్ల రూపాయలతో పెద్దపల్లి పట్టణం అభివృద్ధి

* ఓట్ల కోసం వస్తున్న బీఆర్ఎస్, బీజేపీలను తరిమికొట్టండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండమెజారిటీతో గెలిపించాలి

*  పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు

పెద్దపల్లి ప్రతినిధి:

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలో   పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. 2వ వార్డు పాస్తాం లక్ష్మి, 8వ వార్డు ఎరుకల కల్పన, 9వ వార్డు ఎండీ నాదీమ్ వార్డుల్లో 21 వ వార్డు నుగుల్లా మల్లయ్య లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అదేవిధంగా వివిధ కూడళ్లలో రోడ్డు షో నిర్వహించి రెండేళ్ల తమ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి పట్టణం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు తీసుకవచ్చామన్నారు. పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపోతో పాటు బైపాస్ రోడ్డు మంజూరు చేయించామన్నారు.

ప్రధాన హదారులను అభివృద్ధి చేయడంతోపాటు వీధుల్లో సిమెంట్రోడ్లు,మురికి కాలువలు నిర్మిస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణపనులు జరుగుతున్నాయని, వాకర్స్ నడిచేందుకు వీలుగా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పట్టణంలోని అనివాడలకు తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. మహిళలకు ఆర్టీసీబస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచితవిద్యుత్, రైతు లకు 2లక్షల వరకు రుణమాఫీచేసి, 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమచేశామన్నారు. ఆరోగ్య శ్రీద్వారా 10లక్షలవరకు పెంచి ఉచితవైద్యాన్ని అందిస్తు న్నామని గుర్తుచేశారు. ఓట్ల సమయంలో వచ్చే బీఆర్ఎస్. బీజేపీలనిప్రజలుతరిమికొట్టాలన్నా రు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్నిచూసి ఈనెల 11న జరగనున్నఎన్నికల్లో చేతిగుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయా వార్డుల ఇంచార్జ్లు మరియు కార్యకర్తలు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

గురువారం, ఫిబ్రవరి 05, 2026

మంథని: అభివృద్ధిలో భాగస్వాములు కావాలి


 


మంథని మున్సిపల్ ఎన్నికల  ప్రచారంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంథని పట్టణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మంథని పట్టణంలోని 2వ,3వ,5వ,6వ, వార్డులలో సంబంధించిన అంబేద్కర్ నగర్, ముత్యాలమ్మ వాడ, బోయినపేట, దుబ్బగూడెం, గొల్లగూడెం ప్రజలతో మాట్లాడుతూ పార్టీ బలపరచినటువంటి అభ్యర్థులను 11న చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. 

యజుర్వేద స్వహాకార యజ్ఞంలో..



*శ్రీ అమ్నాయ వర్ధిని సేవా ట్రస్టు మంథని వారు శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర దేవాలయంలో నిర్వహించిన సంపూర్ణ యజుర్వేద స్వాహాకార యజ్ఞంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.  అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.

మంథని: మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డికి నివాళులర్పించిన మంత్రి

రాంరెడ్డి పార్టివ దేహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని: మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి  పార్థివదేహన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం సందర్శించి నివాళులర్పించారు.  అనంతరం ఆయన భార్యా  వసుమతి రెడ్డి, కుమారులు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డిలను ఓదార్చి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  

రాంరెడ్డి భార్య వసుమతి రెడ్డిని
ఓదారుస్తున్న శ్రీధర్ బాబు

రాంరెడ్డి కుమారులను పరామర్శిస్తున్న
 శ్రీధర్ బాబు

ప్రజా నాయకుడు రాంరెడ్డి

అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాంరెడ్డి గ్రామ సర్పంచ్, ఎంపీపీ, శాసనసభ్యులుగా మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవ చేశారనీ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఏది ఏమైనా మారుమూల అటవీ ప్రాంతమైన మంథని ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో, ఈ ప్రాంత ప్రజా సమస్యలపై ఓ ప్రజా నాయకుడిగా స్పందించారని అన్నారు. వ్యక్తిగత స్వార్థంతో ఆలోచించకుండా, ఒక ప్రతిపక్ష నేతగా వ్యక్తిగత దూషణలకు పోకుండా, రాజకీయమంటే ఇలా ఉండాలని ముందుకు తీసుకెళ్లిన నేపథ్యాన్ని ఈ రోజు గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాన్ని అన్నారు.






బుధవారం, ఫిబ్రవరి 04, 2026

పెద్దపల్లి: గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత నాది..

* పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు 

పెద్దపల్లి ప్రతినిధి;

పెద్దపల్లి పట్టణంలోని 28వ వార్డు సుభాష్ నగర్లో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి తూముల లత సుభాష్ రావు, 27వ వార్డు ఉనుకొండ సరస్వతి, 6వ వార్డు కట్ట పద్మావతి నరేంద్ర చారి మరియు 7వ వార్డు భూంనగర్లో ఈర్ల స్వరూప సురేందర్ కు మద్దతుగా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 


పెద్దపల్లి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించండి అని ప్రజలను కోరారు. పెద్దపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లో అన్ని రకాల వసతులను కల్పిస్తూ అభివృద్ధి మరియు సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా అభివృద్ధి, సంక్షేమం జోడెడ్డులులా దూసుకుపోతోందని గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో పేదలకు మరియు రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. ఎన్నికలు రాగానే బి.ఆర్.ఎస్ మరియు బీజేపీ పార్టీల వారు ఓట్ల కోసం తిరుగుతారని వారి మాయమాటలకు ప్రజలు ఎవరూ మోసపోవద్దని కోరారు. ఓట్ల సమయంలో వచ్చే బి.ఆర్.ఎస్ & బీజేపీ పార్టీల వారిని ప్రజలు తరిమికొడతారని అన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించి కౌన్సిల్ కు పంపిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని తెలిపారు. ఈ నెల ఫిబ్రవరి 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించమని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలు వార్డుల ప్రజలు,  మహిళలు  పాల్గొన్నారు.

పెద్దపల్లి: ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను బలపర్చండి

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

* కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించండి

పెద్దపల్లి ప్రతినిధి:

ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మున్సిపల్ లో గెలిస్తే పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయనీ రాష్ట్ర  ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా బుధవారం  పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గోల్డెన్ తులిప్ బ్యాంకెట్ హాల్ల్లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు తో కలిసి పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ హయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్చిన్నం చేసినా,  కాంగ్రెస్ పార్టీ దాన్ని గాడిలో పెట్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నానీ అన్నారు. బి.ఆర్.ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో పట్టణాలను, పల్లెలను గాలికొదిలేసారు ఆన్నారు. ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు అని ఎన్నికలు వస్తె అడ్డగోలుగా మాటలు చెప్పే పార్టీలు బి.ఆర్.ఎస్, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి పెద్దపల్లి జిల్లాకు నిధులు కేటాయించలేదని పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గత బి.ఆర్.ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ లను అరకొరగా కట్టి లబ్ధిదారులకు అందించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత డబుల్ బెడ్ రూం లకు మౌలిక సదుపాయాలు కల్పించి అందించిన ఘనత మీ ఎమ్మెల్యే విజయరమణ రావుదే అని అన్నారు. అలాగే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

మంథని: అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తాం


* మంథని మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 
మంత్రి శ్రీధర్ బాబు
* కో ఆప్షన్ సంబంధించి మైనార్టీ వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని పార్టీ నిర్ణయం

మంథని: మున్సిపాలిటీనీ సంబంధించిన ప్రజలకు దగ్గర ఎటువంటి  రూపాయి ఖర్చు లేకుండా పరిమిషన్ లో గాని ప్రజా అందాల్సిన పథకాల విషయంలో ఎలాంటి అవినీతి జరగకుండా పారదర్శకంగా ముందు వెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 

మంథని పట్టణ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రహదారులు, పరిపాలన, ఆరోగ్యం, విద్య, పట్టణ సౌకర్యాలు వంటి అన్ని రంగాలు సమగ్రంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించి వాటిని ఆచరణలో పెడుతున్నామని  మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటింటికి పథకాలు అందజేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ సంక్షేమం అర్హుల దరిచేరకుండా వారిని నమ్మించి మోసం చేసిన ఘనత ముమ్మాటికీ వారిదేనని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇచ్చి ఆకలి తీర్చామని, మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలకు ఇందిరమ్మ ఇల్లే గాని, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,రెండు లక్షల రుణమాఫీ,మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు,అనారోగ్య బాధితులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంపు చేయడం జరిగిందని అది కాంగ్రెస్ మార్కు పాలన అని చెప్పారు. ఇప్పటికే మంథని మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో  అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, మంథని పట్టణం రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.  

 ప్రజల విశ్వాసం మరియు ప్రజల ఆశీర్వాదాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ ఘన విజయం సాధించి,మంథని పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేశారు.

అభివృద్ధి కావాలంటే హస్తం గుర్తుకే ఓటేయాలని, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.









మంగళవారం, ఫిబ్రవరి 03, 2026

మంథని: పోరు బరిలో నిలిచేది వీరే..


మంథని మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ పడే ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆయా పార్టీ వర్గాలు ప్రకటించాయి. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు వారికి పార్టీ అందించిన బీ ఫారం ను ఎన్నికల అధికారులకు అభ్యర్థులు అందచేశారు.

కాంగ్రెస్ అభ్యర్థులు వీరే...

1వ వార్డు - కుర్రు‌ లింగయ్య.
2వ వార్డు - నూకల‌ కమల్.
3వ వార్డు - శ్రీపతి బానయ్య.
4వ వార్డు - ఎరుకల‌ స్రవంతి.
5వ వార్డు - ముస్కుల‌ సహేందర్ రెడ్డి.
6వ వార్డు - పోలు రజిత.
7వ వార్డు - జంబోజు‌‌ సమ్మయ్య.
8వ వార్డు - నరెండ్ల విజయలక్ష్మి.
9వ వార్డు - మారుపాక‌ నిహారిక.
10వ వార్డు - పెంటరి రాజు.
11వ వార్డు - వొడ్నాల‌ శ్రీనివాస్.
12వ వార్డు - వేముల‌ విజయలక్ష్మి.
13వ వార్డు - ఎల్లంకి‌‌ వంశీ

 బీఆర్ఎస్ అభ్యర్థులు

1వ వార్డు గంధం ఆంజనేయులు
2వ వార్డు - ఆరెపల్లి కుమార్
3వ వార్డు - మాచీడి రాజుగౌడ్
4వ వార్డు - బడికల లావణ్య శ్రీనివాస్
5వ వార్డు - అంబటి నర్సింగ్
6వ వార్డు - కాయితీ జ్యోతి సమ్మయ్య
7వ వార్డు - మంథని సంధ్య హరీష్
8వ వార్డు - కొత్త పద్మ
9వ వార్డు - దాసరి పుష్ప మల్లేష్
10వ వార్డు - బండారి సమ్మయ్య
11వ వార్డు - పుప్పాల తిరుపతి
12వ వార్డు - పూదరి లావణ్య సాగర్
13వ వార్డు - మంథని విజయ్ కుమార్

* బీజేపీ అభ్యర్థులు*


1st వార్డ్ కేతిరి విజయ
2 nd వార్డ్ దాసరి శ్రావణ్
3 rd  వార్డ్ చిలువేరి సతీష్
4 th వార్డ్ దూడపాక రోజ
5 th వార్డ్ బోయిని నారాయణ
6 th వార్డ్ తాత మధునమ్మ
7 th వార్డ్
8 th వార్డ్ ఎడ్ల మౌనిక
9 th వార్డ్ సామల లక్ష్మి
10 th వార్డ్ సామల అశోక్
11 th వార్డ్ రాపర్తి సంతోష్
12 th వార్డ్ శ్రీరామోజు సుజాత
13 th వార్డ్ గట్టు రాధాకిషన్

మంథని: మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కన్నుమూత

మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రామిరెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ లో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస వదిలారు. 1994 లో మంథని ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటికీ స్పీకర్ పదవిలో ఉన్న దుద్దిళ్ల శ్రీపాద రావుపై విజయం సాధించారు. స్వగ్రామమైన ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ సర్పంచిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన అక్కడి నుంచే ఎంపీటీసీగా గెలిచి ముత్తారం మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. అంతరం 1994 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేసేందుకు అవకాశం లభించింది. ఎన్టీఆర్ ప్రభంజనంలో గెలిచిన ఆయన 1999 ఎన్నికల్లో శ్రీపాద రావు తనయుడు ప్రస్తుత ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతిలో ఓటమి చవిచూశారు.  ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడం రెబల్ గా పోటీ చేసి టీడీపీ అభ్యర్తి ఓటమికి కారకుడయ్యాడు.  ఆ తరువాత వరుసగా మూడోసారి ఓటమి చవి చూసిన ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరినా, చివరి నిమిషంలో పార్టీ టికెట్ దక్కకపోవడంతో బీజేపీ లో చేరారు. ప్రస్తుతం బీజేపీలో ఆయన కుమారుడు చురుకైన భూమిక నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతిపై మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. గురువారం మంథని గోదావరి తీరంలో ఆయన అంతిమ సంస్కారం ఉంటుందని కుటుంబ సభ్యులు ప్రకటించారు.

సోమవారం, ఫిబ్రవరి 02, 2026

కరీంనగర్: 4న ఉమ్మడి జిల్లా అండర్-19 క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్-19 క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 4న నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు వి.అగం రావు, కార్యదర్శులు ఎన్.మురళిధర్ రావు, ఉపాధ్యక్షులు కె.మహేందర్ గౌడ్, పి.మనోహర్ రావు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేసన్ ఆధ్వర్యంలో హెచ్.సి.ఎ.లో జరిగే అండర్-19 జట్ల టోర్నమెంట్లో పాల్గోనే ఉమ్మడి జిల్లా జట్లు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆసక్తి గల క్రీడాకారులు తమ యొక్క వివరములు మీ-సేవ నుండి పొందిన జనన ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, రెండు ఫోటోలు, పూర్తి యూనిఫాంతో అల్గునూర్ లోని కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి వెలిచాల జగపతి రావు మెమోరియల్ క్రికెట్ మైదానానికి అదే రోజు ఉదయం 8-30 గంటలకు హాజరుకావాలని కోరారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులు సెప్టెంబర్, 1 2007 తర్వాత జన్మించిన వారై ఉండాలని స్పష్టం చేశారు. ఎంపిక పోటీలలో పాల్గోన్న క్రీడాకారులలో (30) మందిని ప్రాథమికంగా ఎంపిక చేసి అందులో నుండి నైపుణ్యం కనబర్చిన క్రీడాకారులను ఒక జట్టుగా ఎంపిక చేసి ఈ నెల 8న జరిగే వన్డే టోర్నికి పంపిస్తామన్నారు. (రిజిస్ట్రేషన్ కొరకై KDCA వెబ్సైట్ నుండి ఫారం డౌన్లోడ్ చేసి, రిజిస్ట్రేషన్ చేసుకావాలని కోరారు.

పెద్దపల్లి: కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించండి..


కొత్తపుంతలు తొక్కుతున్న ఎన్నికల ప్రచారం..

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు 


పెద్దపల్లి;

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలోని 12వ వార్డు, 29వ వార్డు మరియు 31వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.



ముందుగా సాగర్ రోడ్డు కంచేర భావి వద్ద గల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దపల్లి పట్టణంలోని 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దొడ్డుపల్లి జగదీష్, 29వ వార్డు ఇల్లందుల రజనీ కృష్ణమూర్తి మరియు 31వ వార్డులో మంథని నర్సింగ్ లను ఈ నెల ఫిబ్రవరి 11న బుధవారం జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచాక పెద్దపల్లి పట్టణం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. పెద్దపల్లి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోట్ల రూపాయల నిధులను వెచ్చించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని గత పాలకులు అభివృద్ధి విషయంలో మొద్దు నిద్ర పోయారని విమర్శించారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి వారి సొంతింటి కళ నెరవేరుస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, జీరో వడ్డీ రుణాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, ఉచిత సన్న బియ్యం, సన్న వడ్ల బోనస్, రైతు రుణమాఫీ, 5 లక్షల ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపుదల, రైతు భరోసా మరియు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం విషయంలో విఫలం అయ్యారని మళ్లీ ఎ మొహం పెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లను అడుగుతున్నారని విమర్శించారు. పెద్దపల్లి పట్టణంలో గత బి.ఆర్.ఎస్ పాలకులు నిలువు దోపిడీలకు పాల్పడ్డారని బి.ఆర్.ఎస్ పార్టీ వారి దోపిడీలను ప్రజలందరూ గమనిస్తున్నారని వారికి మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణ ప్రజలు చైతన్యవంతులని బి.ఆర్.ఎస్ మరియు బీజేపీ పార్టీల వారికి ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో నూతన బస్సు డిపో, బైపాస్ రోడ్డు, నూతన్ కోర్టు భవనం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలకు ఆధునీకరణ, సిటీ స్కాన్, ఎం.ఆర్. ఐ మరియు తాను ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్ల పాలనలో రూ.40 కోట్లతో సీసీ రోడ్లు, మురికి కాలువలు, మౌళిక వసతుల కల్పన పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో పాత వాటర్ ట్యాంక్ స్థానంలో కొత్తగా వాటర్ ట్యాంక్, చందపల్లి డబుల్ బెడ్ రూం ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేస్తున్నామని తెలిపారు. రూ 62.50 కోట్లతో అభివృద్ది పనులు ప్రారంభించామని, మరో 15 కోట్ల నిధులు మంజూరు చేయించానని తెలిపారు. వీటిని ప్రజల అవసరాలను గుర్తించి నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి రూ 77.50 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆధునీకరణ కోసం రూ 7.5 కోట్లు కేటాయించినట్లు వివరించారు. క్రీడల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాని ఇందులో భాగంగా వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఇండోర్ బ్యాడ్మింటన్ షటిల్ స్టేడియం ఏర్పాటుకు డి ఎం ఎఫ్ టీ నుండి రూ 2.5 కోట్లు కేటాయించి పనులు చేపట్టినట్లు . పట్టణంలోని శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నట్లు తెలిపారు.   అధికార పార్టీ అభ్యర్థులనే కౌన్సిలర్లుగా గెలిపిస్తే అభివృద్ది సాధ్యమన్నారు. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం రోజున జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బడ్జెట్



* రాష్ట్రాల ఆర్థిక స్వావలంబన లేనిదే దేశాభివృద్ధి సాధ్యమా..?

* తెలంగాణపై వివక్షాపూరిత ధోరణి 

* రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 


హైదరాబాద్: 

"భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం.. ఇండియా అంటే రాష్ట్రాల సమూహం (Union of States). రాష్ట్రాల ఆర్థిక స్వావలంబన లేనిదే దేశాభివృద్ధి సాధ్యపడదని రాజ్యాంగం చెబితే, కేంద్రం మాత్రం ఈ బడ్జెట్ లో ఆ మూలసూత్రాన్నే విస్మరించింది" అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. దేశ జీడీపీలో 5 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్న తెలంగాణ గురించి బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం గర్హనీయమని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం తరచూ వల్లించే "సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్" అనే నినాదం "తెలంగాణ" విషయంలో కేవలం నీటి మూటలేనని మరోసారి ఈ బడ్జెట్ లో స్పష్టం అయ్యిందన్నారు. ఓ వైపు అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉంటుందని చెబుతూనే, మరోవైపు నిధుల కేటాయింపుల్లో "తెలంగాణ" పట్ల రాజకీయ వివక్ష చూపడం రాజ్యాంగ నైతికత (Constitutional Morality) అనిపించుకోదని హితవు పలికారు. "బడ్జెట్ అనేది ఆర్థిక హేతుబద్ధత(Economic Rationality) ఆధారంగా రూపొందించాలి. కానీ... కేంద్రం రాజకీయ అనుకూలత( Political Expediency)కు ప్రాధాన్యతనిచ్చి తాజా బడ్జెట్లో తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది" అని వివరించారు. "ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో తెలంగాణకు రూ. 22,782 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 10 నెలలు గడుస్తున్నా అందింది కేవలం సుమారు రూ. 4,000 కోట్లు మాత్రమే. అంటే రావాల్సిన దాంట్లో 20 శాతం కూడా అందలేదు. ఇది తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న ఆర్థిక అణచివేత (Fiscal Suppression) కు ఇది మరో సాక్ష్యం" అని వెల్లడించారు. "రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ అనేది సమ న్యాయంగా (Equitable Distribution) జరగాలి. కానీ, సహకార సమాఖ్య (Cooperative Federalism) సూత్రాలకు విరుద్ధంగా "తెలంగాణ" పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షాపూరిత సమాఖ్య ధోరణిని ప్రదర్శిస్తోందని తాజా బడ్జెట్ మరోసారి రుజువు చేసింది" అని అన్నారు. "రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్ – 2, గోదావరి – మూసీ అనుసంధానం, బందరు పోర్టు-హైదరాబాద్ డ్రైపోర్టు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే, నాలుగు కొత్త విమానాశ్రయాలు, రైలు కనెక్టివిటీ మెరుగుదల, విభజన చట్టంలోని పెండింగ్ హామీల అమలుకు నిధులు కేటాయించాలని మేము పలుమార్లు కోరినా పట్టించుకోకపోవడం ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలభిస్తోన్న వివక్ష పూరిత వైఖరికి నిలువెత్తు నిదర్శనం" అని ఆందోళన వ్యక్తం చేశారు. "హై స్పీడ్ రైల్ కారిడార్స్"తో "తెలంగాణ"కు మమ అనిపించిన కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరిపై తెలంగాణ నుంచి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎంపీలు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఇకనైనా కేంద్రం తన ధోరణిని వీడి, రాజ్యాంగబద్ధమైన సమానత్వం పాటించాలని కోరారు.

పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని

పెద్దపల్లి:

మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.

మున్సిపల్ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లతో సోమవారం వారు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.

 పురపాలక ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు నిబంధనల ప్రకారం జరగాలన్నారు.

పోలింగ్ కు అవసరమైన మేర బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని, పోలింగ్ బృందాలు, డిస్ట్రిబ్యూషన్,  రిసెప్షన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్ లలో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.  కౌంటింగ్ ముగిసిన తర్వాత మున్సిపాలిటీలలో చైర్ పర్సన్, కార్పొరేషన్లలో మేయర్ ఎన్నిక కోసం ఫారం 2 లను సిద్ధం చేసి సంసిద్ధం కావాలని, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు ముందుగానే సమాచారం అందించాలని అన్నారు.  ఈ సమావేశంలో  పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఆదివారం, ఫిబ్రవరి 01, 2026

మంథని: రుద్రభట్లకు 'ప్రాశ్నిక చక్రవర్తి’ బిరుదు ప్రదానం


మంథని పీపుల్ గ్రూప్ ఆధ్వర్యంలో కార్యక్రమం

మంథని పీపుల్ వాట్సప్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సాహిత్య ఆలోచనా కార్యక్రమం ‘జిజ్ఞాస’ ఘనంగా జరిగింది. అంతర్జాల వేదికగా జరిగిన  ఈ కార్యక్రమంలో జిజ్ఞాసకు రూపకర్తగా, తన నిగూఢమైన ప్రశ్నలతో సభ్యుల్లో ఆలోచనా చైతన్యం కలిగించిన డా. శ్రీ రుద్రభట్ల అశోక్ కుమార్ గారికి ‘ప్రాశ్నిక చక్రవర్తి’ బిరుదు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, గీర్వాణ భాషా రసజ్ఞ బ్రహ్మశ్రీ రంగి సత్యనారాయణ గారు పాల్గొన్నారు. అలాగే జీవన పురస్కార గ్రహీత, పద్య శిక్షక శిరోమణి బ్రహ్మశ్రీ కొల్లారపు ప్రకాశరావు శర్మ గారు (అమెరికా) ముఖ్య అతిథిగా విచ్చేశారు.

విశిష్ట అతిథిగా డా. అవధానుల రాధాకిష్టయ్య గారు (వరంగల్), ఆత్మీయ అతిథిగా శ్రీమతి సువర్ణ విజయలక్ష్మి గారు (కెనడా), ప్రత్యేక అతిథిగా శ్రీ కొల్లారపు పాండురంగ మూర్తి గారు (హైదరాబాద్) పాల్గొని తమ సందేశాలతో కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు.

మంథని పీపుల్ బృందం వ్యవస్థాపకుడు వేణుగోపాల్ రామడుగు మాట్లాడుతూ జిజ్ఞాస కార్యక్రమం విద్య, వైద్యం, పురాణం, ఇతిహాసం, భక్తి, ఆర్థిక అంశాలతో పాటు దైనందిన జీవితంలోని ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాల వేదికగా మారిందన్నారు. డా. అశోక్ కుమార్ అడిగే ప్రశ్నలు సభ్యులను లోతైన ఆలోచనల్లోకి నడిపిస్తున్నాయని ప్రశంసించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా హైటెక్ సిటీలోని యెలిసెట్టి ప్రసన్నలక్ష్మి  శ్రీరాం దంపతుల స్వగృహంలో నిర్వహించగా, జూమ్ మరియు యూట్యూబ్ ద్వారా దేశ విదేశాల నుంచి అనేక మంది సభ్యులు పాల్గొన్నారు.

కార్యక్రమం చివర్లో అతిథులకు, సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మంథని పీపుల్ బృందం నిర్వహిస్తున్న ఈ తరహా ఆలోచనా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తృతంగా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.

పెద్దపల్లి: నిజాయితీగా ప్రజా సేవ చేస్తున్నా

* పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి కృషి

* అభివృద్ధిని చూసి ఓటేయండి

* కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగంపల్లీ మాజీ కౌన్సిలర్

* పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి ప్రతినిధి:

నిజాయితీగా ప్రజాసేవ చేస్తూ వస్తున్నానని, పెద్దపల్లి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు.

రంగంపల్లీ 10వ వార్డు మాజీ కౌన్సిలర్ గాదె మాధవి గారు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం  పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్ల పాలనలో రూ.40 కోట్లతో సీసీ రోడ్లు, మురికి కాలువలు, మౌళిక వసతుల కల్పన పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో పాత వాటర్ ట్యాంక్ స్థానంలో కొత్తగా వాటర్ ట్యాంక్, చందపల్లి డబుల్ బెడ్ రూం ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేస్తున్నామని తెలిపారు. రూ 62.50 కోట్లతో అభివృద్ది పనులు ప్రారంభించామని, మరో 15 కోట్ల నిధులు మంజూరు చేయించానని తెలిపారు. వీటిని ప్రజల అవసరాలను గుర్తించి నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి రూ 77.50 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆధునీకరణ కోసం రూ 7.5 కోట్లు కేటాయించినట్లు వివరించారు. క్రీడల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాని ఇందులో భాగంగా వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఇండోర్ బ్యాడ్మింటన్ షటిల్ స్టేడియం ఏర్పాటుకు డి ఎం ఎఫ్ టీ నుండి రూ 2.5 కోట్లు కేటాయించి పనులు చేపట్టినట్లు చెప్పారు. రూ.80 కోట్లతో పెద్దపల్లి బైపాస్ రోడ్డు టెండర్లు పూర్తి చేశామని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బైపాస్ నిర్మాణానికి మరో 70 కోట్ల రూపాయలు అవసరం అని నిధులు మంజూరి చేయిస్తానని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిని  విస్తరించి ఆధునీకరించామని చెప్పారు. 50 నుండి 100 పడకల విస్తరించి ఏంఆర్ఐ, సిటీ స్కాన్ లు ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. బస్ డిపోకు 4ఎకరాల 32 గుంటలు కేటాయించి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాఘవాపూర్ లో కోర్టు భవనానికి 10 ఎకరాలు కేటాయించి రూ. 80 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. పట్టణంలోని శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నట్లు తెలిపారు.   అధికార పార్టీ అభ్యర్థులనే కౌన్సిలర్లుగా గెలిపిస్తే అభివృద్ది సాధ్యమన్నారు. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే..

తదుపరి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు గాను 33 వార్డులకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థులను  ఎమ్మెల్యే ప్రకటించారు.

పూరేళ్ళ శైలజ (1 వార్డు), లక్ష్మి పస్తం (2 వార్డు), మొలగూరి కమల్ (3 వార్డు), కొమ్ము సుధాకర్ (4 వార్డు), గుజ్జుల కుమారస్వామి (5 వార్డు), కట్ట పద్మావతి (6 వార్డు), ఈర్ల స్వరూప (7 వార్డు), ఎరుకల కల్పన (8 వార్డు), అక్కెపల్లి సుజాత (10 వార్డు), అనూష పూదరి (11 వార్డు), దొడ్డుపల్లి జగదీష్ (12 వార్డు), పాగల శ్రీకాంత్ (13 వార్డు), మహమ్మద్ అస్లాo పర్వేజ్ (14 వార్డు), నేతెట్ల కొమురయ్య (15 వార్డు), నాంసాని శ్రీనివాస్ (16 వార్డు), తోట ఫణీందర్ (17 వార్డు), భూతగడ్డ సంపత్ (18 వార్డు), నల్లాల పద్మ (19 వార్డు), బండి రమ్యకృష్ణ  (20) వార్డు), నూగిళ్ళ మల్లయ్య (21వార్డు), ఉప్పు స్వరూప (22 వార్డు), తాడూరి శ్రీమన్నారాయణ (23 వార్డు), కొట్టే స్వరూప (24 వార్డు), సూది మల్ల అమ్రేష్ (26 వార్డు), ఉనుకొండ సరస్వతి (27 వార్డు), తూముల లత (28 వార్డు), ఇల్లందుల రజని (29 వార్డు), సాజిదాబాను (30 వార్డు), మంథని నర్సింగ్ (31 వార్డు), తిర్రీ శ్రీలత (32 వార్డు), బూతగడ్డ స్వప్న (33 వార్డు),  దేవనంది రమాదేవి (35 వార్డు), ముస్కాన్ నాజ్ నయ్యర్ (36 వార్డు).

శనివారం, జనవరి 31, 2026

హైదరాబాద్: ప్రభుత్వ పనితీరును ఎకానమిక్ సర్వే తేల్చి చెప్పింది

 

సెక్రటేరియట్ లో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు 

 

⇒ ప్రజాస్వామ్యంలో ‘విమర్శ’ అనేది ఒక ఆరోగ్యకరమైన సంప్రదాయం. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఇది అవసరం. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మా ప్రజా ప్రభుత్వం నిర్మాణాత్మక విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తోంది. ఈ విషయంలో మాకెలాంటి భేషజాలు లేవు.

⇒ పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపడం ప్రతిపక్షాల బాధ్యత కూడా. కానీ, ఆ విమర్శ అనేది ‘వాస్తవాల’  పునాదుల మీద నిలబడాలి తప్ప.. కేవలం రాజకీయ లబ్ధి కోసం అల్లిన ‘అసత్యాల’ మీద కాదు.

⇒ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మా ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక, కేవలం తమ స్వార్థం రాజకీయాల కోసం, ఉనికి కోసం కొందరు కుట్రపూరితమైన అసత్య ప్రచారాలకు తెరలేపారు. 

⇒ ముఖ్యంగా...  ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, పెట్టుబడులు రావడం లేదంటూ... ఇలా రకరకాలుగా అసత్యాలను వండి వార్చుతున్నారు. రాజకీయంలో భావోద్వేగాలకు తావుండవచ్చు, కానీ గణాంకాలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు.

⇒ ఐటీ, పరిశ్రమలు, మహిళా సంక్షేమం.. ఇలా ప్రతి రంగంలోనూ తెలంగాణ సత్తా చాటుతోందని మరోసారి ఈ సర్వే గణాంకాలు నిరూపించాయి.

⇒ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సాధిస్తున్న పురోగతికి, ఆర్థిక వ్యవస్థ పనితీరుకు, పాలనలో పారదర్శకతకు, మా ప్రభుత్వ పనితీరుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఎకానమిక్ సర్వే 2025-26’ ఒక తిరుగులేని సాక్ష్యం. అది కేవలం ఆర్థిక గణాంకాల పట్టిక కాదు, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పే ప్రగతి నివేదిక.

⇒ స్వార్థ రాజకీయాల కోసం ‘తెలంగాణ’ బ్రాండ్ ను దెబ్బతీసేలా... మా ప్రభుత్వ పనితీరు, చిత్తశుద్ధిపై కొందరు అబద్ధాల పునాదులపై చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ‘ఎకానమిక్ సర్వే 2025-26’  పటాపంచలు చేసింది. టెక్నాలజీని మిళితం చేస్తూ వ్యవస్థలను ప్రక్షాళన చేసేలా... అవినీతికి చెక్ పెట్టేలా... పారదర్శకతకు పెద్దపీట వేసేలా... గుడ్ గవర్నెన్స్ లక్ష్యంగా... మేం అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలను ఈ సర్వే అధికారికంగా గుర్తించింది.  ఈ దేశానికి ‘తెలంగాణ రైజింగ్’ను కళ్లకు కట్టింది. 

⇒ అభివృద్ధి అంటే గాలి మాటలు కాదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమేనని మా పనితీరుతో నిరూపించాం. సమర్థవంతమైన నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం, మా దార్శనికతపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకమే ‘తెలంగాణ’ను దేశంలోనే అగ్రపథాన నిలబెట్టింది. ఇకనైనా బురద రాజకీయాలు మానుకుని ‘తెలంగాణ రైజింగ్ ’లో భాగస్వాములు కావాలని, లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారు. 

⇒ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవరీపై కక్ష్యా రాజకీయాలు చేయాలనే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. ఇతర రాష్ట్రాల్లో పేర్కొన్న బెస్ట్ ప్రాక్టీసెస్, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి సర్వే పేర్కొన్న సవాళ్లు, ఇతర అంశాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. 

⇒ ఆర్బీఐ నిర్దేశిత పరిమితుల ప్రకారం ద్రవ్యోల్బణం +/- 2 శాతం బ్యాండ్ లో 4 శాతం ఉండాలి. అంటే 2 శాతం నుంచి 6 శాతం రేంజ్ లో ఉండొచ్చు. 

⇒ 2023-24 లో ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ... 2024-25 నుంచి తెలంగాణ మెరుగైన పనితీరును కనబరిచింది. 2024-25లో జాతీయ సగటు 4.63 శాతం ఉంటే... తెలంగాణలో 3.67 శాతంగా ఉంది. 

⇒  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(ఏప్రిల్ – డిసెంబర్ నాటికి) జాతీయ సగటు 1.72 శాతంగా ఉంటే... తెలంగాణలో 0.20 శాతంగా ఉందని ఈ సర్వే తేల్చింది. 


ఏడాది                హెడ్ లైన్ ద్రవ్యోల్బణం(తెలంగాణ)

2022-23                     8.61 శాతం

2023 – 24                  6.36 శాతం

2024- 25                    3.67 శాతం

2025-26                     0.20 శాతం


⇒ తెలంగాణ కేవలం కేంద్రం ఇచ్చే నిధుల మీదో, అప్పుల మీదో ఆధారపడటం లేదు. మన సొంత పన్ను వనరుల నుంచే అత్యధిక ఆదాయాన్ని గడించి, ఆర్థికంగా మనం ఎంత బలంగా ఉన్నామో ఈ సర్వే ప్రపంచానికి చాటిచెప్పింది. ఇది మా ప్రభుత్వ సమర్థతకు, పారదర్శకమైన ఆర్థిక నిర్వహణకు నిదర్శనం.


⇒ వార్షిక వృద్ధిలో ‘తెలంగాణ’ సాధిస్తూ దూసుకుపోతుంటే.. రాష్ట్రం వెనుకబడిందంటూ మాపై దుష్ర్పచారం చేయడం ఎంత వరకు సమంజసం...? మేము సంపదను సృష్టిస్తున్నాం.. ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాం. భావితరాల భవిష్యత్తు కోసం బాటలు వేస్తున్నాం. 


⇒ ఐటీ, ఇన్నోవేషన్, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగాల్లో తెలంగాణ ముద్రను చూసి ప్రపంచమే అబ్బురపడుతోంది. కేవలం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కే పరిమితం కాకుండా, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణ ఎదిగిందని కేంద్ర ఆర్థిక సర్వే తేల్చింది. ఐటీ రంగంలో వెనుకబడ్డామంటూ మాపై దుష్ర్పచారం చేసిన వారు ఇప్పుడేం సమాధానం చెబుతారు మరి....? 


⇒ ఐటీ, సేవల రంగంలో తెలంగాణ తన సత్తాను మరోసారి చాటుకుంది. దేశం మొత్తం మీద ఉత్పత్తి అవుతున్న సేవల రంగంలో (Service Sector) కేవలం నాలుగు రాష్ట్రాలు 40 శాతం వాటాను కలిగి ఉంటే.. అందులో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల సరసన తెలంగాణ సగర్వంగా నిలబడింది. 


⇒ రేపటి ప్రపంచాన్ని శాసించబోయే Gen-AI (జెన్-ఏఐ) స్టార్టప్‌లలో దేశవ్యాప్తంగా 7 శాతం వాటాతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. బెంగళూరు, ఢిల్లీలతో పోటీపడుతూ హైదరాబాద్‌ స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఈ సర్వే మరోసారి స్పష్టం చేసింది. 


⇒ ఆర్థిక వ్యవస్థ అంటే మా ప్రభుత్వ దృష్టిలో కేవలం అంకెలు కాదు, అది మన ఆడబిడ్డల భద్రత, మన యువతకు లభించే ఉపాధి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా... పారిశ్రామిక రంగంలో తెచ్చిన సంస్కరణలను ఈ ఆర్థిక సర్వే ప్రశంసించింది. 


⇒ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే మా ప్రభుత్వ ఆకాంక్ష. అందుకే, మహిళా కార్మికులపై ఉన్న పనివేళల ఆంక్షలను తొలగించి, వారు అన్ని రకాల పరిశ్రమల్లో, అన్ని షిఫ్టుల్లో (24/7) సురక్షితంగా పనిచేసేలా నిబంధనలను సడలించాం.


⇒ దేశంలో ఈ సాహసోపేతమైన మరియు ప్రగతిశీల నిర్ణయం తీసుకున్న కేవలం 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఈ సర్వే ప్రశంసించడం మా ప్రభుత్వ దార్శనికతకు నిదర్శనం.


⇒ దేశంలోని వ్యవస్థీకృత తయారీ రంగంలో 5% ఉద్యోగాలు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి. అంటే దేశ పారిశ్రామిక ప్రగతిలో మన రాష్ట్రం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకోవచ్చు.


⇒ పెట్టుబడిదారులకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కల్పించడమే కాకుండా, ఫైర్ సేఫ్టీ వంటి నిబంధనలను అక్రిడిటేటెడ్ థర్డ్ పార్టీల ద్వారా సరళతరం చేసి, కొత్త పరిశ్రమల స్థాపనకు బాటలు వేశాం. 


⇒ హైదరాబాద్ ను కేవలం ‘ఐటీ’కి మాత్రమే పరిమితం చేయాలన్నది మా ప్రభుత్వ ఆలోచన కాదు. అన్ని రంగాల్లోనూ కేరాఫ్ అడ్రస్ గా ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తీర్చి దిద్దాలన్నదే మా సంకల్పం. ఆ దిశగా మేం వేస్తున్న అడుగులను ఈ సర్వే అధికారికంగా గుర్తించింది. గుజరాత్‌తో పోటీపడుతూ హైదరాబాద్‌లోని ఫార్మా క్లస్టర్లు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకున్నాయని ఈ సర్వే ప్రశంసించడమే మా పనితీరుకు నిదర్శనం. 


⇒ ఈ ఫార్మా క్లస్టర్లు కేవలం పెద్ద కంపెనీలకు మాత్రమే కాదు, ఎంతోమందికి ఉపాధినిచ్చే చిన్న, మధ్య తరహా (MSME) పరిశ్రమలకు కూడా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని సర్వే కితాబు ఇచ్చింది. ఇది మా ప్రభుత్వానికి దక్కిన గొప్ప సర్టిఫికేట్. 


⇒  హైదరాబాద్ నగరాన్ని ఒక అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషిని కేంద్ర సర్వే అధికారికంగా ప్రశంసించడం మా దార్శనికతకు, చిత్తశుద్ధికి దక్కిన అతిపెద్ద గుర్తింపు. 


⇒ 8.47 శాతం వార్షిక జీడీపీ వృద్ధి రేటుతో 2019-2035 మధ్య ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 4వ నగరంగా మన హైదరాబాద్ రికార్డు సృష్టించబోతోందని ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ తేల్చింది. ఇంతటి భారీ వార్షిక వృద్ధి రేటు ప్రపంచంలో మరే ఇతర ప్రధాన నగరానికి లేదు. ఇది మా ప్రభుత్వ ఆర్థిక విజయం కాదా...?


⇒ 2018లో $50.6 బిలియన్లుగా ఉన్న హైదరాబాద్ GDP, 2035 నాటికి $201.4 బిలియన్లకు చేరుకోబోతోందని ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసింది. ఇంతటి వేగంతో దూసుకుపోతున్న హైదరాబాద్ ఆగం అవుతున్నట్లా..? లేక గ్లోబల్ పవర్‌హౌస్‌గా మారుతున్నట్లా...?... మాపై గోబెల్స్ ప్రచారం చేసే వారే సమాధానం చెప్పాలి. 


⇒ హైదరాబాద్ ‘Ease of Living – 2025’ ఇండెక్స్ లో టాప్ 10 నగరాల్లో ఒకటిగా నిలవడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. కేవలం నగరాన్ని విస్తరించడమే కాకుండా.... ఆరోగ్యం, రవాణా, గృహనిర్మాణం వంటి రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పి, ప్రతి పౌరుడి జీవన నాణ్యతను పెంచేందుకు మేం చిత్తశుద్ధితో చేస్తున్న కృషికి ఇదో సర్టిఫికేట్. 


⇒ సెప్టెంబర్ 30, 2025 నాటికి మున్సిపల్ బాండ్ల జారీలో GHMC దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రాష్ట్ర ప్రభుత్వం, మన ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లకు ఉన్న తిరుగులేని విశ్వాసానికి నిదర్శనం.  పెట్టుబడిదారులు ‘తెలంగాణ’పై విశ్వాసం చూపిస్తుండటం అది మా ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు, పారదర్శకతకు లభించిన గొప్ప గుర్తింపు. 


⇒ పరిపాలనలో జవాబుదారీతనం అంటే కేవలం ప్రసంగాలు కాదని, వ్యవస్థల్లో మేము తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలే సాక్ష్యమని తాజా సర్వే స్పష్టం చేసింది. టెక్నాలజీతో వ్యవస్థలను మిళితం చేసి అవినీతికి చెక్ పెడుతుంటే.. ఓర్వలేక కొందరు మాపై చేస్తున్న లేనిపోనీ ఆరోపణలను ఈ సర్వే నివేదిక తిప్పికొట్టింది.


⇒ రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయం చేస్తూ ‘భూ భారతి’ పోర్టల్ ద్వారా భూ రికార్డుల నిర్వహణలో విప్లవాత్మక పారదర్శకతను తీసుకువచ్చాం. భూ యజమానుల హక్కులకు మా ప్రభుత్వం ఇస్తున్న డిజిటల్ రక్షణను కేంద్రం అధికారంగా గుర్తించింది. 


⇒ పౌరసరఫరాల వ్యవస్థలో అక్రమాలకు తావులేకుండా GPS ఆధారిత VLTS (Vehicle Location Tracking System) వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేశాం. రైతు పండించిన ప్రతి గింజ పక్కదారి పట్టకుండా నిఘా పెట్టాలనే మా సంకల్పాన్ని ఈ సర్వే అధికారికంగా గుర్తించింది.


⇒ గిరిజన ప్రాంతాల్లో 'స్మార్ట్ ట్రైబల్ ఫార్మింగ్' ద్వారా మారుమూల రైతులకు కూడా టెక్నాలజీని చేరువ చేసి, అట్టడుగు వర్గాల ఆర్థిక సాధికారతకు బాటలు వేయాలన్న మా ప్రయత్నాన్ని ఈ సర్వే ప్రశంసించింది.

శుక్రవారం, జనవరి 30, 2026

పెద్దపల్లి: అందరికీ తల్లుల ఆశీస్సులుండాలి


* అందరూ సుఖసంతోషాలతో ఉండాలి

* నిలువెత్తు బంగారం సమర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి ప్రతినిధి: పెద్దపల్లి మండలం, హన్మంతునిపేట గ్రామాల్లో శుక్రవారం  సమ్మక్క, సారలమ్మల జాతర మహోత్సవం సందర్బంగా గద్దెలపై కొలువు తీరిన వనదేవతలకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పడిగిద్ద రాజును దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. 



ముందుగా పెద్దపల్లి మండలం, హన్మంతునిపేట గ్రామంలో అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు పెద్దపల్లి నియోజకవర్గంలోని నిరుకుల్లా, కొలనూరు మిరజాంపేట, హన్మంతునిపేట, నారాయణ పూర్, తురుకల మద్దికుంట, పెద్దరాతపల్లి పలు గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నూతనంగా దాదాపు రూ.8 కోట్ల ఫై చిలుకు నిధులతో తారు రోడ్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట నెరవేర్చడమే తప్పా.. మాట తప్పేది లేదని స్పష్టం చేశారు. సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆయా గ్రామాలలో అధికారులు మరియు జాతర కమిటీ సభ్యులు మెరుగైన సౌకర్యాలు కల్పించారని  అభినందించారు. అలాగే ఆ అమ్మవార్ల ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో రైతులందరూ ఆనందంగా ఉండాలని అమ్మవారులను వేడుకోవడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు మరియు ప్రజాప్రతినిధులు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు యువకులు మరియు గ్రామస్తులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మంథని: గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

అధికారాలతో సమీక్షిస్తున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష




మంథని:   గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని  *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* తెలిపారు.
శుక్రవారం మంథని లోని  ఆర్డిఓ కార్యాలయంలో 2027 గోదావరి నది పుష్కరాల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,  2027 జూన్ 26 నుంచి 2027 జూలై 7 వరకు గోదావరి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా పుష్కరాలు జరుగుతాయని, దీనికి సంబంధించి మన జిల్లాలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అవసరమైన ఘాట్ నిర్మాణం, రోడ్డు విస్తరణ, లైటింగ్, ఇతర ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధి కు ప్రతిపాదనలు తయారు చేసి వీలైనంత త్వరగా సమర్పించాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, ఈఈ ఆర్ అండ్ బి భావ్ సింగ్, ఈఈ మిషన్ భగీరథ ఇంట్రా శ్రీనివాస్,  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

గోదావరిఖని: వన దేవతలను దర్శించుకున్న శ్రీను బాబు

దేవతలకు మొక్కుతున్న శ్రీను బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్



గోదావరిఖని: కార్మిక క్షేత్రమైన రామగుండం పారిశ్రామిక పరిధిలో నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు వచ్చి వనదేవతలను దర్శించుకొని, మొక్కులు తీర్చుకున్నారు. అలాగే గొలివాడ సమ్మక్క–సారలమ్మ జాతరలో స్థానిక రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తో పాటు  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సమ్మక్క–సారలమ్మల ఆశీస్సులతో సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.



FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026