* అందరూ సుఖసంతోషాలతో ఉండాలి
* నిలువెత్తు బంగారం సమర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి ప్రతినిధి: పెద్దపల్లి మండలం, హన్మంతునిపేట గ్రామాల్లో శుక్రవారం సమ్మక్క, సారలమ్మల జాతర మహోత్సవం సందర్బంగా గద్దెలపై కొలువు తీరిన వనదేవతలకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పడిగిద్ద రాజును దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు.
ముందుగా పెద్దపల్లి మండలం, హన్మంతునిపేట గ్రామంలో అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు పెద్దపల్లి నియోజకవర్గంలోని నిరుకుల్లా, కొలనూరు మిరజాంపేట, హన్మంతునిపేట, నారాయణ పూర్, తురుకల మద్దికుంట, పెద్దరాతపల్లి పలు గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నూతనంగా దాదాపు రూ.8 కోట్ల ఫై చిలుకు నిధులతో తారు రోడ్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట నెరవేర్చడమే తప్పా.. మాట తప్పేది లేదని స్పష్టం చేశారు. సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆయా గ్రామాలలో అధికారులు మరియు జాతర కమిటీ సభ్యులు మెరుగైన సౌకర్యాలు కల్పించారని అభినందించారు. అలాగే ఆ అమ్మవార్ల ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో రైతులందరూ ఆనందంగా ఉండాలని అమ్మవారులను వేడుకోవడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు మరియు ప్రజాప్రతినిధులు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు యువకులు మరియు గ్రామస్తులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి