![]() |
| మంత్రి శ్రీధర్ బాబు ను శాలువాతో సత్కరిస్తున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి, |
* ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
పెద్దపల్లి ప్రతినిధి:
పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ మున్సిపాలిటీ లో తప్ప మిగతా పెద్దపల్లి, రామగుండం, మంథని మున్సిపాలిటీ లో పాలకవర్గం కొలువుదీరింది. పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ గా నూగిళ్ల మల్లయ్య, వైస్ చైర్మన్ గా ముస్కాన్ నాజ్ ప్రమాణస్వీకారం చేశారు.
మంథని మున్సిపల్ చైర్మన్ గా ఓడ్నాల శ్రీనివాస్
అలాగే మంథని మున్సిపల్ చైర్మన్ గా ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా ముస్కుల మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సుల్తానాబాద్ లో మాత్రం చైర్మన్ ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రమాణ స్వీకారం రేపటికి వాయిదా పడింది.
రామగుండం మేయర్ గా మహంకాళి స్వామి
* రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ గా పాతకాల ఎల్లయ్య ప్రమాణ స్వీకారం చేశారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి