Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

సోమవారం, అక్టోబర్ 27, 2025

మంథని: వ్యవసాయ భూములు మాత్రమే తీసుకుంటామంటే ఊకునేది లేదు



రామయ్యపల్లి గ్రామాన్ని కూడా సింగరేణి సేకరించాలి

సింగరేణి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం

మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్


రామగిరి మంథని : సింగరేణి ఓసీపీ టూ విస్తరణ కోసం సింగరేణి యాజమాన్యం రాజాపూర్ గ్రామంతోపాటు 444 ఎకరాల భూమిని తీసుకుంటామని ప్రతిపాధిస్తున్నట్టు సింగరేణి జీఎం చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు రామగిరి మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సింగరేణి ఓసీపీ టూ విస్తరణలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట, రాజాపూర్ గ్రామాల పరిధిలోని 708 ఎకరాల వ్యవసాయ భూమిని గతంలో సింగరేణి అధికారులు స్వాదీనం చేసుకున్నారు. దీనిపై రెండు గ్రామాల రైతులు కోర్టుకు వెళ్లగా ఆ భూమిని తిరిగి రైతులకు ఇవ్వడం జరిగింది. తదురపరి 88 ఎకరాలను మాత్రమే తీసుకున్న సింగరేణి అధికారులు.. ఇప్పుడు మరోసారి కుట్రపూరితంగా రాజాపూర్ గ్రామాన్ని మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాపూర్ గ్రామాన్ని తీసుకుంటామని చెప్తున్న సింగరేణి అధికారులు.. రామయ్యపల్లి గ్రామాన్ని తీసుకోకుండా కేవలం రామయ్యపల్లి గ్రామ పరిధిలోని వ్యవసాయ భూములను మాత్రమే తీసుకోవడం వల్ల గ్రామస్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పెద్దంపేట, పన్నూర్, మంగళ్ పల్లి, వీర్లపల్లి, వకీల్ పల్లి గ్రామాల ప్రజలు పడ్డ ఇబ్బందులను కండ్లారా చూసిన మేము ఎట్టిపరిస్థితిలో అటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్దంగా లేమని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు మా వ్యవసాయ భూమలు సేకరించే ప్రతిపాదనను విరమించుకోవడమో.. లేదంటే మా గ్రామాన్ని సైతం తీసుకుని గ్రామస్థులకు తగు రీతిలో న్యాయం చేయడమో ఏదో ఒకటి చేసే విధంగా అడుగులు వేయాలని హితవు పలికారు. అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటించి సింగరేణి విస్తరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. పోరాటాలు మా ఊరి ప్రజలకు కొత్త కాదని, గతంలో దొరలను,పోలీస్ ను సైతం ఉరికించిన చరిత్ర గ్రామానికి ఉందనే విషయాన్ని సింగరేణి అధికారులు గమనంలోకి తీసుకోవాలని సూచించారు.

శుక్రవారం, అక్టోబర్ 24, 2025

మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా): రండి... కలిసి అద్భుతాలు ఆవిష్కరిద్దాం

*ఉమ్మడిగా పరిశోధనలు, సంయుక్త ప్రాజెక్టులు చేపడదాం*

*ప్రఖ్యాత ‘మోనాష్’ యూనివర్సిటీ ప్రతినిధులకు ఆహ్వానం*

*ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక భేటీ*

*అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, సస్టైనబుల్ ఇంజనీరింగ్, క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ తదితర రంగాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని మెల్‌బోర్న్‌లోని ప్రఖ్యాత ‘మోనాష్’ యూనివర్సిటీ ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు*. ఇక్కడి ప్రముఖ విద్యా సంస్థలను భాగస్వామ్యం చేస్తూ జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు, ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఎక్స్ఛేంజ్‌లు, కో-ఇన్నోవేషన్ ఇనిషియేటివ్స్ ను చేపట్టాలని కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం మెల్బోర్న్ లోని ప్రఖ్యాత ‘మోనాష్’ యూనివర్సిటీని సందర్శించారు. అనంతరం ఉమ్మడి పరిశోధన, ఇన్నోవేషన్ బేస్డ్ కొలాబరేషన్, అకడమిక్ ఎక్స్ఛేంజ్ , స్టార్టప్ ల భాగస్వామ్యం తదితర అంశాలపై యూనివర్సిటీ ప్రతినిధులతో చర్చించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటం కంప్యూటింగ్, తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్, టీ హబ్, టీ వర్క్స్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో వినూత్న ఆవిష్కరణలు, పరిశోధనలకు ఈ భాగస్వామ్యం మరింత ఊతమిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. "గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్" మారేందుకు అవసరమైన ఎకో సిస్టం కలిగిన తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ వైస్-ప్రోవోస్ట్ ప్రొఫెసర్ మ్యాథ్యూ గిలెస్పీ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి పరిశోధనలు, సంయుక్త ప్రాజెక్టులను చేపట్టేందుకు వీలుగా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీన్ రీసెర్చ్ ప్రొఫెసర్ లే హై వూ, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ థామ్సన్ తదితరులు పాల్గొన్నారు.

ఆస్ట్రేలియా: ‘విక్టోరియా పార్లమెంట్’ను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ‘విక్టోరియా పార్లమెంట్’ను సందర్శించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ ‘లీ తార్లామిస్’, పార్లమెంటరీ సెక్రటరీ ‘షీనా వాట్’ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లెజిస్లేటివ్ ప్రొసీజర్స్,పార్లమెంటరీ గవర్నెన్స్, పబ్లిక్ అకౌంటబిలిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, గవర్నెన్స్ రిఫార్మ్స్, డిజిటల్ ఇనీషియేటివ్స్ ను వారికి వివరించారు. ట్రాన్స్‌పరెంట్, టెక్నాలజీ-ఎనేబుల్డ్, సిటిజన్-డ్రివెన్ గవర్నెన్స్ మోడల్స్‌ రూపకల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. ‘తెలంగాణ – విక్టోరియా’ మధ్య ఇన్‌స్టిట్యూషనల్ కొలాబరేషన్‌ను పెంపొందించేందుకు చొరవ చూపాలని కోరారు. ప్రగతిశీల విధానాలను అనుసరిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న ‘తెలంగాణ’ లాంటి రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని ‘లీ తార్లామిస్’, ‘షీనా వాట్’ తెలిపారు. ‘తెలంగాణ- విక్టోరియా’ మధ్య ద్వైపాక్షిక సహాకారాన్ని పెంపొందించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.







బుధవారం, అక్టోబర్ 22, 2025

మెల్‌బోర్న్‌(ఆస్ట్రేలియా): దిగ్గజ సంస్థ ‘ఒరికా’కు ఆహ్వానం

ఆస్ట్రేలియాలో సీఈఓ సంజీవ్ గాంధీతో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా భేటీ

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి

 మంథని : దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ‘ఒరికా’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఆ దేశ పర్యటనలో భాగంగా బుధవారం మెల్‌బోర్న్‌లో పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ, మైనింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో అంతర్జాతీయ అగ్రగామిగా ఉన్న ఆ సంస్థ సీఈఓ, ఎండీ సంజీవ్ గాంధీ, ఇతర ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో ‘ఒరికా’ ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.‘ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్‌లను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. జీసీసీలు, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అత్యంత అనుకూలం. పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉంది’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్, సస్టెయినబిలిటీ, మాన్యుఫాక్చరింగ్, మైనింగ్ రంగాల్లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. ‘పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ, అమలు చేస్తున్న ప్రోత్సాహాకర, ప్రగతిశీల విధానాలు అభినందనీయం. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న జీసీసీలో డిజిటల్ ఇంజనీరింగ్, ఆటోమేషన్,అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ తదితర రంగాల్లో 600 మంది హై స్కిల్డ్ నిపుణులకు ఉద్యోగాలు కల్పించాం. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. తెలంగాణలో కార్యకలాపాల విస్తరణ, వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఒరికా సంస్థ సీఈఓ, ఎండీ సంజీవ్ గాంధీ తెలిపారు. ‘ఆస్ బయోటెక్ 2025 ఇంటర్నేషన్ కాన్ఫరెన్స్’లో కీలకోపన్యాసం చేసేందుకు ఆస్ట్రేలియాకు విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబును కంపెనీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

శనివారం, అక్టోబర్ 18, 2025

హైదరాబాద్: దండుపాళ్యం’ పాలన ఎవరిదో అందరికీ తెలుసు



* అసహనం, నిరాశతోనే మా ‘కేబినేట్’పై నిరాధారమైన ఆరోపణలు

* తమ అంతర్గత కుమ్ములాటలను కప్పిపుచ్చుకునేందుకే మాపై కట్టుకథలు

* గత పాలనా వైఫల్యాల చరిత్రను దాచేందుకే ఈ మైండ్ గేమ్


* మా మంత్రులందరిదీ ఒకటే జెండా... ఒకటే అజెండా

* గత 20 నెలల్లో రాష్ట్రానికి రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు

*రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

దండుపాళ్యం’ పాలన అంటే ఎవరిదో అందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు*. అందుకే గట్టిగా  కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. అధికారం లేదన్న అసహనం, నిరాశలో ‘కేబినేట్’పై ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను ఆయన శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. మంత్రుల మధ్య కుమ్ములాటలు, కేబినేట్ సమావేశంలో వర్గాలుగా విడిపోయి గొడవలు పడ్డారంటూ కట్టుకథల్ని సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారంతా సినిమాల్లో ‘రచయితలు’ గా ప్రయత్నించాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినేట్ సమష్ఠిగా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో అహర్నిశలు శ్రమిస్తున్న మా మంత్రులకు ప్రత్యేకంగా వ్యక్తిగత అజెండా అంటూ ఏదీ లేదన్నారు. మాకు అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలే మా అందరి అజెండా అని తేల్చి చెప్పారు. మేం వేసే ప్రతి అడుగు రాష్ట్రాభివృద్ధి కోసమేనని, ఈ విషయంలో ఎలాంటి అపోహాలకు తావు లేదని స్పష్టం చేశారు. ‘విలువ ఆధారిత వృద్ధే’ లక్ష్యంగా మా ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందన్నారు. మేం పాలనను గాలికొదిలేస్తే గత 20 నెలల్లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేవా అని ప్రశ్నించారు. మంత్రులంతా వ్యక్తిగత పంచాయతీలు పెట్టుకుంటే "ఎలీ లిల్లీ" లాంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తెలంగాణకు  ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. మాది మాటల ప్రభుత్వం కాదని... చేతల్లో చేసి చూపించే ప్రజా ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మీ అంతర్గత కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. మీ అహంకారపూరిత వ్యవహారశైలి, పాలనా వైఫల్యాల చరిత్రను దాచుకునేందుకు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు మీ కుతంత్రాలను నమ్మరని గుర్తు చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

 6 నెలల్లోనే రూ.12,864 కోట్ల ఎఫ్ డీఐలు

‘పారిశ్రామికాభివృద్ధి విషయంలోనూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డీఐ) ఆకర్షణలో తెలంగాణ ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లోనే రాష్ట్రానికి రూ.12,864 కోట్ల ఎఫ్ డీఐలు వచ్చాయి. 2023–24లో ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోనే టాప్ – 3 అర్బన్ ఎఫ్ డీఐ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ‘2023-24లో పరిశ్రమల జీఎస్ వీఏ రూ.2.46 లక్షల కోట్లు. అది 2024-25లో 12.6 శాతం పెరిగి రూ.2.77 లక్షల కోట్లకు చేరుకుంది. వృద్ధి రేటు 8.68 శాతం. గతేడాదితో పోలిస్తే 2.1 శాతం అధికంగా నమోదయ్యింది. అదే జాతీయ సగటు వృద్ధి రేటు 6.2 శాతం మాత్రమే’ అని పేర్కొన్నారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ప్రతిపక్షాలకు సూచించారు.

సోమవారం, అక్టోబర్ 13, 2025

మంథని: పుట్టపాకలో శ్రీపాద స్మారక బస్ షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు


గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి కల్పించేందుకు మంథనిలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ను 40 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నామని ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మంథని మండలం పుట్టపాక గ్రామంలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్- రమాదేవి దంపతులు తమ సొంత నిధులతో నిర్మాణం చేసిన స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు స్మారక బస్ షెల్టర్ ను ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ తో నిరుద్యోగ యువతకు ఉపాధి   దొరుకుతుందని అన్నారు. ఇందులో చదువుకునే విద్యార్థులకు వారి కుటుంబం పై భారం పడకుండా రూ .2వేల స్టైఫండ్ ఇస్తామన్నారు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు ఎంతోమంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ముందుకు తాగుతున్నామన్నారు. మహబూబ్ పల్లి నుంచి తోటగోపయ్యపల్లి వయా లక్ష్మీపూర్ కు రైతుల సౌకర్యార్థం రోడ్డు నిర్మించాలని కొత్త శ్రీనివాస్ రమాదేవి దంపతులు అడిగిన వెంటనే 2028 లోగా రోడ్డు నిర్మించి ఓట్లు అడుగుతానని శ్రీధర్ బాబు వాగ్దానం చేశారు. పుట్టపాక గ్రామంలో గల్లి గల్లి కి సిమెంట్ రోడ్లు, చేతి పంపులు, నల్లా లు గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పుట్టపాక నుంచి మహబూబ్ పల్లి బీటీ రోడ్డు వేయడం జరిగిందన్నారు. పుట్టపాకలో బస్సు షెల్టర్ ను ప్రారంభించడానికి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబుకు ఈ ప్రాంత ప్రజలు నీరాజనం పలికారు. ఈ సందర్భంగా  బాణాసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మంత్రి శ్రీధర్ బాబుకు పూలమాల వేసి శాలువాతో సన్మానించారు. ముందుగా  శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఏంvhbbసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, టీజిఈఆర్సి సలహాదారు శశిభూషణ్ కాచే,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్,  మాజీ ఏఎంసీ చైర్మన్ ఆజీoఖాన్, మాజీ ఎంపీపీ కొండ శంకర్, సింగిల్ విండో డైరెక్టర్లు కొత్త శ్రీనివాస్, పెద్దిరాజు ప్రభాకర్, రావికoటి సతీష్ కుమార్, కమాన్ పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, నాయకులు పేరవేన లింగయ్య,శ్రీరాంబట్ల శ్రీనివాస్, శ్రీపతి బానయ్య, జనగామ నర్సింగరావు, సేగ్గం  రాజేష్, వోడ్నాల శ్రీనివాస్, సాధుల శ్రీకాంత్, చాట్లపల్లి సంతోష్, ఎడ్ల శ్రావణ్, కన్నూరి సుదర్శన్, సవాయి గణేష్ అయిలి శ్రీనివాస్, హుసేన్ భీ, ఆరేల్లి కిరణ్ గౌడ్, రేపాక శ్రీకాంత్, ఆర్డీవో సురేష్ ఎమ్మార్వో, ఆర్టీసీ డిఎం, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మంథని: సరస్వతి నిలయంగా మంథని అభివృద్ధి..

మాట్లాడుతున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు


**45 కోట్లతో మంథని కు నూతన ఏ.టి.సి మంజూరు*


**కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 10 కోట్ల మంజూరు*


**ఏటీసీ విద్యార్థులకు ప్రతి నెలా 2000 రూపాయల స్కాలర్ షిప్*


**మంథని క్యాంపు కార్యాలయంలో సీ.ఎం.ఆర్.ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీధర్ బాబు*


  సరస్వతి నిలయంగా మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐ.టి,  పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు.

సోమవారం  రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని క్యాంపు కార్యాలయంలో రామగిరి కమాన్పూర్ మంథని ముత్తారం మండలాలకు సంబంధించి 87 మంది లబ్ధిదారులకు సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు, 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా *మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి వారంలోనే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని అన్నారు.   వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వ ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సకాలంలో వేతనాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించే చెక్కులు, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు అమలు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని పేద ప్రజలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు.

పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించే దిశగా ఐటిఐ కేంద్రాలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేయడం జరిగిందని అన్నారు. ఏ.టి.సి కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఇటీవలే కాటారం లో 35 కోట్ల రూపాయలతో ఏటిసి ప్రారంభించామని మంత్రి తెలిపారు.

45 కోట్ల రూపాయల ఖర్చు చేసి మంథని పట్టణంలో నూతనంగా ఏటీసీ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. సరస్వతి నిలయంగా మంథని నియోజకవర్గం తీర్చిదిద్దుతున్నామని అన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ ఏ.టి.సి కేంద్రం ఏర్పాటు కాబోతుందని, దీనికి సహకరించిన ముఖ్యమంత్రి కు  మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో తమ హయాంలో ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఐటిఐ సెంటర్, రైతు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. యువతకు మార్గదర్శకం చేసేందుకు ఏ.టి.సి సెంటర్ ఏర్పాటు కాబోతుందని అన్నారు.

మంథని  ప్రజలకు ఉపయోగపడే విధంగా  పట్టణంలో వివిధ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశామని అన్నారు. పట్టణంలో నిర్మించే కమ్యూనిటీ హాల్స్ మంథని ప్రజలు ఎవరైనా ఉపయోగించుకోవచ్చని అన్నారు. 

మంథనీ పట్టణ హెడ్ క్వార్టర్ లో 30 కోట్ల రూపాయలతో అంతర్గత సిసి రోడ్లు వేసామని,  అంబేద్కర్ విజ్ఞాన్ భవన్ నిర్మాణానికి కోటి రూపాయలు,మున్నూరు కాపు భవనానికి  60 లక్షల రూపాయలు  మంజూరు చేసామని అన్నారు. 


మధుర పోచమ్మ ఆలయ అభివృద్ధికి 25 లక్షల, వినాయక మండపం 10 లక్షలు, మహా లక్ష్మి దేవాలయానికి 10 లక్షలు, చిన్నప్ప-పెద్దప్ప ఆలయానికి 10 లక్షలు, మహిళా భవనానికి 50 లక్షల కేటాయించామని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు రిక్రియేషన్ అయ్యేందుకు 50 లక్షల మంజూరు చేశామని అన్నారు. 


పేద ప్రజల ఇంట్లో వివాహాల సమయంలో ఇబ్బందులు కాకుండా ఉండేందుకు కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నామని అన్నారు. ప్రతి కమ్యూనిటీ వాళ్లు చిన్న కమిటీ ఏర్పాటు చేసుకుని త్వరగా తిను కమిటీ హాల్స్ నిర్మాణం పూర్తి చేసుకోవడంలో కృషి చేయాలని అన్నారు. కమిటీ హాల్స్ నిర్మాణానికి అవసరమైన భూమి ఎంపిక చేసి త్వరగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఏటీసీ కేంద్రంలో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతినెల 2000 రూపాయలను స్కాలర్షిప్ అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో  ఆర్.డి.ఓ. సురేష్,  తహసిల్దార్,  సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గురువారం, అక్టోబర్ 09, 2025

న్యూఢిల్లీ: గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీలో ‘తెలంగాణ’ రోల్ మోడల్





*వినూత్న విధానాలతో డిజిటల్ సమ్మిళత్వానికి బాటలు*

*‘టీ- ఫైబర్’ గ్రామాల పైలెట్ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం*

మంత్రి శ్రీధర్ బాబును అభినందించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీని అందించడంలో ‘తెలంగాణ’ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా కితాబునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘టీ-ఫైబర్’ గ్రామాల పైలెట్ ప్రాజెక్టు దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. ఆయన అధ్యక్షతన బుధవారం దిల్లీలో నిర్వహించిన ‘స్టేట్ గవర్నమెంట్ ఐటీ మినిస్టర్స్ అండ్ ఐటీ సెక్రటరీస్ రౌండ్ టేబుల్’ సదస్సులో వినూత్న విధానాలతో డిజిటల్ సమ్మిళత్వానికి ‘తెలంగాణ’ బాటలు వేస్తుందంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా అభినందించారు. ‘లాస్ట్-మైల్ ఫైబర్ కనెక్టివిటీ’ గ్రామీణ సమూహాలను ఎలా మార్చగలదో తెలంగాణ చేసి చూపించిందని కొనియాడారు. ‘టీ-ఫైబర్’ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలకు కూడా సహకారం అందించాలని కోరారు. ఈ పైలెట్ ప్రాజెక్టును ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

 సమ్మిళిత వృద్ధికి డిజిటల్ సమానత్వమే పునాది: మంత్రి శ్రీధర్ బాబు

‘డిజిటల్ సమానత్వం సమ్మిళిత వృద్ధికి పునాది. గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. అందుకు అనుగుణంగానే పకడ్బందీ ప్రణాళికలను రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. వినూత్న విధానాలతో ముందుకెళ్తున్నాం. భావితరాల కోసం పటిష్ఠమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాం’ అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ‘డిజిటల్ ఫలాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న చివరి వ్యక్తి వరకూ చేరాలన్నదే మా లక్ష్యం. టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలకు తక్కువ ఖర్చుతో హై-స్పీడ్ కనెక్టివిటీని అందించేందుకు కృషి చేస్తున్నాం. డిజిటల్ ఇండియా, భారత్ నెట్ లక్ష్యాలకు అనుగుణంగా ఫైబర్-టు-ది-హోమ్ నెట్‌వర్క్ ద్వారా ఈ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ వ్యవస్థాపకత తదితర సేవలను ప్రజల ముంగిటకే సమర్థవంతంగా చేర్చుతున్నాం’ అని చెప్పారు. ‘భారత్ నెట్’ అమలులో వేగం పెంచాలని, రైట్ ఆఫ్ వే సవాళ్లను పరిష్కరించాలని, దేశ, రాష్ట్రాల డిజిటల్ ఆస్తులను పరిరక్షించేందుకు సైబర్ భద్రత ఫ్రేమ్ వర్క్ లను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ అంశాల్లో రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో  టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మంథని: మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన స్వర్ణకారులు

మంథని పట్టణ స్వర్ణకార సంఘ భవనానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు 20 లక్షలరూపాయల నిధులు కేటాయించినందుకు గురువారం మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బెజ్జంకి దిగంబర్ ఆధ్వర్యంలో స్వర్ణకారులు మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

బుధవారం, అక్టోబర్ 08, 2025

మంథని: అభివృద్ధి పనులకు మంత్రి ఆమోదం

మంథని పట్టణంలోని పలు ప్రధాన జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో సీసీ రోడ్డు నిర్మాణం, సైడ్ డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు చేయించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు, మంథని రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు  ముస్కుల సురేందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. మంథని పట్టణంలోని శ్రీ అయ్యప్ప దత్తగుడి దేవాలయాల నుండి సిఆర్ కే కాంప్లెక్స్ మీదుగా తమ్మి చెరువు కట్ట వరకు అలాగే సిఆర్కే కాంప్లెక్స్ నుండి ఎరుకల గూడెం హనుమాన్ దేవాలయం వరకు రోడ్డు పూర్తిగా చెడిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దేవాలయాలకు వెళ్లే భక్తులు, అలాగే జనసంచారం అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లోని రోడ్ల మరమ్మతుకు డ్రైనేజీల నిర్మాణానికి సహకరించాలని ఆయన మంత్రిని కోరారు. ఈ విషయమే వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు ఇందుకు  సంబంధించిన పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంథని ప్రాంతంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పుడు మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించే మంత్రి శ్రీధర్ బాబుకు ఈ సందర్భంగా సురేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

మంగళవారం, అక్టోబర్ 07, 2025

పెద్దపల్లి: మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ డి.వేణు

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు అన్నారు.

మహాకవి వాల్మీకి జయంతి పురస్కరించుకొని మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణు పాల్గొన్నారు. మహాకవి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా *అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ,*   మహాకవి వాల్మీకి హైందవ ధర్మానికి  అతి ముఖ్యమైన గ్రంథం రామాయణాన్ని రచించారని, రామాయణ గ్రంథం ద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని అదనపు కలెక్టర్  పేర్కొన్నారు. *రామాయణం ద్వారా ఆదర్శ మానవుడికి ఉండవలసిన లక్షణాలు, మానవ సంబంధాలు, విలువలను మహాకవి మనందరికీ బోధించారని  అన్నారు*  

మహాకవి వాల్మీకి రచించిన రామాయణం కారణంగానే మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని అదనపు కలెక్టర్ తెలిపారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వసుదైక కుటుంబం అనే భావన రామాయణంతో ముడీబడి ఉందని అదనపు కలెక్టర్ తెలిపారు. 

 మహాకావ్యం రామాయణాన్ని రచించిన మహాకవి వాల్మీకి జయంతిని పండగగా జరుపుకోవడం సంతోషకరమని  అదనపు కలెక్టర్ తెలిపారు. అనంతరం వక్తలు మహర్షీ వాల్మీకి జీవిత విశేషాలను కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి ,  కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు  కలెక్టరేట్ సిబ్బంది, బీసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

బెంగళూరు: ఖర్గేను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు


అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం బెంగళూరులో పరామర్శించారు*. 

ఇటీవల పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజా సేవలో చురుగ్గా పాల్గొనాలని, పూర్తి ఉత్సాహంతో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఆయన మార్గదర్శకత్వం అత్యంత అవసరమన్నారు.

పెద్దపల్లి: నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు నిర్వహించాలి

సమీక్షిస్తున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

* ఎన్నికల విధుల పట్ల సంపూర్ణ అవగాహన కలిగించేలా శిక్షణ కార్యక్రమాలు

* నామినేషన్ల స్వీకరణ కు మండలాల్లో పటిష్ట ఏర్పాట్లు

* స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  తెలిపారు.  మంగళవారం *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో *స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణు* తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,*   స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి నామినేషన్ స్వీకరణ కు మండల కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.  ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో అవసరమైన మేర కౌంటర్ లు ఏర్పాటు చేసి  సంబంధిత ఎంపిటిసి స్థానాలకు నామినేషన్లు స్వీకరించాలని అన్నారు. 

మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు  ఎన్నికల నిర్వహణలో సంపూర్ణ మద్దతు ఎంపీడీఓ, ఎంపీఓలకు అందించాలని అన్నారు. ప్రతి మండలం ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన మేర అధికారులు నియామకం పూర్తి చేయాలని అన్నారు.

ఎన్నికల విధుల పట్ల అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండేలా పటిష్ట శిక్షణ అందించాలని అన్నారు. నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ తర్వాత పోటీ అభ్యర్థుల ప్రకటన, వారికి గుర్తుల కేటాయింపు తదితర అంశాల పై పూర్తి శిక్షణ అందించాలని అన్నారు.

 మండలాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సంపూర్ణ సామాగ్రి అందించడం జరుగుతుందని అన్నారు.  ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్వీస్ ఓటర్లకు, పీడి యాక్ట్ కింద అరెస్టైన వారికి, ఎన్నికల విధులు నిర్వహించే వారికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేయడం జరుగుతుందని,  మన ఓటర్ జాబితా పరిధిలో పోస్టల్ బ్యాలెట్ జారీ చేయాల్సిన వారి పేర్లు రౌండాఫ్ చేసుకోవాలని అన్నారు. 

పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వివరాలు, ఓటర్ జాబితా వివరాలు సంబంధిత పోటీ చేసే అభ్యర్థులకు సమాచారం అందించాలని అన్నారు.  నామినేషన్ కేంద్రాల 100 మీటర్ల పరిధిలో ఎటువంటి ర్యాలీ , ప్రచారాలు అనుమతి లేవని, అభ్యర్ది తో పాటు 3 మాత్రమే అనుమతించడం జరుగుతుందని అన్నారు.

ఎన్నికల ప్రచార నిమిత్తం ర్యాలీ, సమావేశాల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారానికి అనుమతి మంజూరు చేయాలని, సౌండ్ సెట్, వాహానానికి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలని, ఎక్కడ కూడా పోటీదారులకు ఒకే రూట్ లో సమావేశాలు ర్యాలీలో నిర్వహణకు అనుమతి జారీ చేయవద్దని అన్నారు.

ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసేందుకు అక్రమంగా నగదు మద్యం తరలిస్తే పట్టుకుని సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల ఓట్ల కోసం కుల,మత విద్వేశాలు రెచ్చగొట్టకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. 

అధికారులు ఎన్నికల విధులను తమకు కేటాయించిన బుక్ లెట్ లోని నిబంధనల ప్రకారం పటిష్టంగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నిబంధనలపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ నరేందర్, డిపిఓ వీర బుచ్చయ్య,పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య,   సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంథని: కొమురం భీమ్ కు నివాళి


కొమురం భీమ్ కు మంథని మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా మంగళవారం నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అజీమ్ ఖాన్, మందపు మధు, బీసీ సెల్ మండల అధ్యక్షులు అయిలి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల హక్కుల కోసం వారి స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, దౌర్జన్యంగా ఎదిరించి ఆదివాసుల హక్కుల కోసం కొమరం భీం పోరాటం చేయడం జరిగిందని అన్నారు. నిజాం పాలనలో ఆదివాసులు పశువులను అడవులలో మేపితే వాటిపైన పన్ను విధించడాన్ని ఆదివాసులందరినీ ఒకదానిపై తీసుకువచ్చి వాళ్ళు ఏదైతే ఆసిఫాబాద్ పరిసరాల్లో జోడేగా గుట్టను కేంద్రంగా చేసుకొని నిజాం సైనికుల పైన కెరీన్ల దాడిని చేసి ఆదివాసుల హక్కుల కోసం వారు స్వేచ్ఛ స్వతంత్రం కోసం ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆ మహానీయుని వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటూ, వారి పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

మంథని: ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికైన మహేష్ గౌడ్ ను సన్మానించిన సిఐ రాజు

ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన గంట మహేష్ గౌడ్ టిజిపిఎస్సి విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో 143 ర్యాంక్ సాధించి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయిన సందర్భంగా మంగళవారం సీఐ రాజు సన్మానించారు. ప్రస్తుతం సూపరింటెండింగ్ ఇంజినీర్ పెద్దపల్లి లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా గ్రూప్ 3 ఫలితాల్లో 21 ర్యాంకు సాధించాడు..ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా అని తెలిపారు. ప్రిపరేషన్ సమయంలో మార్గదర్శి గా ఉన్న మహావాది సతీష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

సోమవారం, అక్టోబర్ 06, 2025

మంథని: అంబేద్కర్ భవన నిర్మాణానికి రూ. కోటి మంజూరు

మంత్రి శ్రీధర్ బాబుకు దళిత సంఘాల నాయకుల కృతఙ్ఞతలు

మంథని అంబేద్కర్ సంఘం భవన నిర్మాణానికి రూ. కోటి మంజూరు చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కు దళిత సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఏప్రిల్ 14వ తేదీ మంథనిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా  భవనం కోసం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రూ.10 లక్షలు మంజూరు చేయగా, దళిత సంఘాల నాయకులు ఈ ఫండ్ సరిపోదు మీరు ఇంకా దీన్ని పెంచాలి అన్న వెంటనే రూ. కోటి నిధులు అంబేద్కర్ భవనం కోసం మంజూరు చేయించారని తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్,  శ్రీపాద రావు విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి మంథని నియోజకవర్గ దళిత సోదరులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంథని ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంథని రాకేష్, సీనియర్ నాయకులు మాజీ ఎంపిటిసి సింగారపు కిష్టయ్య, నూకల బానయ్య  మాట్లాడుతూ మంథనిలో అంబేద్కర్ భవనం నిర్మించుకొని విద్యార్థులకు ఉపయోగపడేటట్టు లైబ్రరీ నిర్మించుకొని, అలాగే కమ్యూనిటీ ఫంక్షన్ హాల్, అన్ని రకాలుగా దళిత సంఘాలకు ఉపయోగపడేటట్టుగా చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు శ్రీపాదరావు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ల యొక్క ఆశయాలను మా ప్రియతమ నాయకులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు  మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తూ, అలాగే ఎస్సీ సెల్ ఫండ్ రూ.2 కోట్ల నిధులను సాంక్షన్ చేయించడం జరిగిందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడ ఏ అభివృద్ధి విషయంలోనైనా కూడా ముందుండి మన ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు చేస్తున్నారు అని అన్నారు. కొందరు ఏం అభివృద్ధి చేయకుండానే వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అభివృద్ధి అంటేనే "దుద్దిల్ల కుటుంబం దుదిల్ల కుటుంబం అంటేనే అభివృద్ధి" అని తెలియజేశారు.హైదరాబాదు నుండి మంథని నియోజకవర్గానికి ఎన్నో కోట్ల నిధులను తీసుకోవచ్చి అభివృద్ధి చేస్తున్నారు అది చూసి ఓర్వలేకనే కొందరు నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుడు కూతలు చేస్తున్నారని అన్నారు. శ్రీధర్ బాబు ఆలోచన విధానాన్ని, ముందుకు తీసుకెళ్తామని రాబోయే రోజులలో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పతంలో ముందు ఉంచుదామని వారి ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, దళిత సంఘాల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

శుక్రవారం, అక్టోబర్ 03, 2025

హైదరాబాద్: విలువలతో కూడిన వృద్ధి’కి కేరాఫ్ తెలంగాణ




జీటో కనెక్ట్ 2025’ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు

పారిశ్రామికాభివృద్ధికి అనుకూలం, అవకాశాల ఖని

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానం

*విలువలతో కూడిన వృద్ధి’కి కేరాఫ్ గా తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు*. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జీటో) హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో హైటెక్స్, హెచ్ఐసీసీలలో మూడ్రోజుల పాటు నిర్వహించనున్న ‘జీటో కనెక్ట్ 2025’ను కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలిచ్చే రాయితీలు, ప్రోత్సాహాకాలను చూసే పెట్టుబడులు పెట్టేవారన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు వారి ఆలోచన తీరు కూడా మారిందన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటన్నారన్నారు. ముఖ్యంగా వృద్ధి నైతికమైనదా, సమ్మిళితమైనదా, సుస్థిరమైనదా..? అని అధ్యయనం చేసిన తర్వాతే అడుగు ముందుకేస్తున్నారన్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, భవిష్యత్తునే తెలంగాణ నిర్మిస్తోందన్నారు. తెలంగాణ అవకాశాల ఖని అని, పరిశ్రమల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత అనుకూల పరిస్థితులున్నాయని వివరించారు. ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే ముందు ఒక్కసారి తెలంగాణలో పర్యటించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరారు. జైన సమాజం ‘సేవా’ స్ఫూర్తిని, తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ తో అనుసంధానిస్తే ప్రపంచం కోరుకుంటున్న నైతిక వృద్ధి నమూనా ఆవిష్కృతమవుతుందన్నారు. నిజమైన యూనికార్న్ అంటే బిలియన్ డాలర్ల విలువ కాదని, లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేయడమని యువ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలకు సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, జీటో హైదరాబాద్ ఛాప్టర్ ప్రతినిధులు రోహిత్ కొఠారి, లలిత్ చోప్రా, విశాల్ అంచాలియా, బీఎల్ భండారీ, సుశీల్ తదితరులు పాల్గొన్నారు.

బుధవారం, అక్టోబర్ 01, 2025

మంథని : దుర్గామాత మండపాల్లో మంత్రి శ్రీధర్ బాబు పూజలు

 తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కమాన్ పూర్ లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాశనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం భక్తిశ్రద్ధలతో పలు దుర్గామాత మండపాలను సందర్శించారు.bకమాన్ పూర్ పట్టణంలోని కిష్టం పల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవిని, సుభాష్ నగర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గాదేవిని,చత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గాదేవిని, వేణుగోపాల స్వామి దేవాలయంలో  అమ్మవారిని ,జూలపల్లి ఆదర్శ నగర్ లో దుర్గావేవినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నాను. ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం నా ధర్మం” అని పేర్కొన్నారు.తరువాత యూత్ సబ్యులు మంత్రి శ్రీధర్ బాబు ని శాలువాతో సన్మానం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు .













పెద్దపల్లి: ఎం.సి.హెచ్ లో రికార్డు స్థాయిలో ప్రసవాలు

మంచి వైద్య సేవలు అందిస్తున్న బృందానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్న కలెక్టర్

 సెప్టెంబర్ నెలలో పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఎం.సి.హెచ్  ఆసుపత్రిలో  రికార్డు స్థాయిలో 250 ప్రసవాలు జరిగాయని, దీనికి కృషి చేసిన అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

గతంలో ఎన్నడు సాధించని విధంగా సెప్టెంబర్ నెల జిల్లా లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల యందు కలుపుకొని 503 ప్రసూతులు  నిర్వహించినందుకు గాను జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ, డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత డాక్టర్లను, సిబ్బందిని  క్షేత్రస్థాయి సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.


*జిల్లా ఆసుపత్రి లో గతంలో డెలివరీ లు సరాసరి 130 ఉండగా సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అల్ టైం రికార్డు స్థాయిలో 250 డెలివరీ లు జరీగాయని*,  ఈ సంవత్సరము లోనే ఏర్పాటు చేసిన నవజాత శిశు కేంద్రం ద్వారా 68 మంది నవ జాత శిశువు లకు చికిత్స అందించడం జరిగిందని అన్నారు. 


గతంలో సరాసరి ఒపీ నెలకీ 12,500 ఉండగా గత సంవత్సర కాలంలో క్రమంగా పెరిగి ఈ నెల 26,730 కు చేరుకుందని , దీనిలో అధికంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడీయాట్రిక్స్, గైనాకలజీ, కంటికి సంబందించిన ఒపీ, చెవి ముక్కు గొంతు, డెంటల్ మరియు స్కిన్ ఒపీ లు రెట్టింపు  కొన్ని విభాగలలో మూడు రేట్లు పెరిగాయని అన్నారు. 


గతంలో ఇన్ పేషెంట్ ఒక నెలకు సరాసరి 1100 ఉండగా ఈ సెప్టెంబర్ 2025 నెలలో 2300 మంది ఇన్ పేషెంట్ సర్వీస్ పొందారని, గతంలో ఆర్థోపెడిక్ సర్జరీలు సరాసరి నెలకు 9 మేజర్ 10 మైనర్ ఉండగా ఈ నెల 34 మేజర్ 27 మైనర్ శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగింది. జనరల్ సర్జరీ గతంలో మేజర్ మరియు మైనర్ కలిపి 20 కాగా ఈ నెల 45 నిర్వహించారు. గతంలో కంటి శస్త్ర చికిత్సలు పెద్దపల్లి లో ఆపరేషన్ థియేటర్ లేనందున మన కంటి వైద్యులు పెద్దపల్లి జిల్లా పేషెంట్ లను కరీంనగర్ ఆసుపత్రి లో సర్జరీ చేసేవారు. ఈ సంఖ్య నెలకు 20 ఉండగా, నూతనంగా ఏర్పాటు చేసిన కంటి ఆపరేషన్ థియేటర్ వల్ల సెప్టెంబర్ 2025 గాను 229 కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. 


గతంలో ఈ.ఎన్.టి, డెంటల్ సర్జరీ లు నిర్వహించే వాళ్ళు కాదని, గత నెల 15 ఈ.ఎన్.టి  ప్రొసీజర్స్ మరియు 529 డెంటల్ ప్రొసీజర్స్ నిర్వహించారని, గతంలో రక్త పరీక్షలు నెలకు 15 వేలు సరాసరి చేసేవారని, నేడు ఆ సంఖ్య 31 వేలకు పెరిగిందని,  గతంలో స్కానింగ్ సేవలు సరాసరి నెలకు 800 ఉండగా ఈ నెల 1960 స్కానింగ్ సేవలు చేశారు.


 గతంలో టిఫ్ఫా స్కానింగులు , 2 డి ఎకో సేవలు జరిగేవి కావని, నేడు  సెప్టెంబర్ నెలలో 123 టిఫ్ఫా స్కానింగ్ లు, 164 2డి ఎకో లు చేయడం జరిగిందని అన్నారు . గతంలో ఫిజియోథెరపీ సేవలు నెలకు 120 కాగా గత నెల 678 మందికి ఫిజియోథెరపీ సేవలు  చేయడం జరిగింది.


జిల్లాలో 5148 గర్భిణీ స్త్రీలను నమోదు చేయగా, అందులో 4,581 గర్భిణీలను మూడు నెలల లోపే నమోదు చేశారు. వీరందరికీ 100 శాతం , నాలుగు గర్భిణీ పరీక్షలను  ప్రభుత్వ ఆసుపత్రుల యందు నిర్వహించారు. రాష్ట్రీయ బాల స్వాస్త్ కార్యక్రమంలో 99882 విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. సమగ్ర టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమములో 72,495 మందికి ఛాతి ఎక్స్ రే లు నిర్వహించారు. ఇందులో 1097 టి.బి. వ్యాధి గ్రస్తుల గుర్తించి చికిత్స అందించు చున్నారు. ఎన్. సి. డి. స్క్రీనింగ్ 416530 మందికి 95% గా స్క్రీనింగ్ నిర్వహించారు.  స్వస్థ్ నారి సశక్త్ పరివార అభియాన్ కార్యక్రమములో 104 శిబిరంలో నిర్వహించి 7634 మహిళలకు స్పెషలిస్ట్ డాక్టర్ ల చే పరీక్షలు నిర్వహించడం జరిగింది. అదనముగా 27210 మంది మహిళలకు ఆయుష్మాన్ మరియు బస్తీ దవాఖాన ల ద్వారా పరీక్షలు నిర్వహించడం జరిగింది అని అన్నారు.

మంథని: దేవి భాగవతం అత్యంత మహిమాన్వితం

ప్రవర్తిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పాలెపు చంద్రశేఖర శాస్త్రి

విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ దేవీ నవరాత్రి ఉత్సవాలు పాల్గొన్న ప్రజలు

విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంథని గాంధీ చౌక్ లోని మండపంలో ప్రవచన కర్త వేదమూర్తులైనటువంటి ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మ శ్రీ పాలెపు చంద్రశేఖర శాస్త్రి పాల్గొని ప్రవచనం అందించారు. ఈ కార్యక్రమంలో  విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ ,సహ కార్యదర్శి నామని నాగేష్, ప్రచార ప్రముఖ్ తూర్పాటి రాము, మఠ్ మందిర్ ప్రముఖ్ కొమురవెల్లి హరీష్ , ధర్మజాగరణ ప్రముఖ్ కనుకుంట్ల స్వామి , సత్సంగ్ ప్రముఖ్ మెడగొని రాజమౌళి,అవధాని మోహన్ శర్మ ,భజరంగ్ దళ్ మంథని ప్రఖండ ప్రముఖ్ నరేడ్ల రాజేష్, సహా ప్రముఖ్ బోగే సందీప్, జంబోజు సాయి, లోకే రాధా కిషన్ ,ఒల్లాల అశోక్, రాచకొండ నరేష్, అధిక సంఖ్యలో భక్తులు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026