మంచి వైద్య సేవలు అందిస్తున్న బృందానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్న కలెక్టర్
సెప్టెంబర్ నెలలో పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఎం.సి.హెచ్ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో 250 ప్రసవాలు జరిగాయని, దీనికి కృషి చేసిన అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
గతంలో ఎన్నడు సాధించని విధంగా సెప్టెంబర్ నెల జిల్లా లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల యందు కలుపుకొని 503 ప్రసూతులు నిర్వహించినందుకు గాను జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ, డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత డాక్టర్లను, సిబ్బందిని క్షేత్రస్థాయి సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
*జిల్లా ఆసుపత్రి లో గతంలో డెలివరీ లు సరాసరి 130 ఉండగా సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అల్ టైం రికార్డు స్థాయిలో 250 డెలివరీ లు జరీగాయని*, ఈ సంవత్సరము లోనే ఏర్పాటు చేసిన నవజాత శిశు కేంద్రం ద్వారా 68 మంది నవ జాత శిశువు లకు చికిత్స అందించడం జరిగిందని అన్నారు.
గతంలో సరాసరి ఒపీ నెలకీ 12,500 ఉండగా గత సంవత్సర కాలంలో క్రమంగా పెరిగి ఈ నెల 26,730 కు చేరుకుందని , దీనిలో అధికంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడీయాట్రిక్స్, గైనాకలజీ, కంటికి సంబందించిన ఒపీ, చెవి ముక్కు గొంతు, డెంటల్ మరియు స్కిన్ ఒపీ లు రెట్టింపు కొన్ని విభాగలలో మూడు రేట్లు పెరిగాయని అన్నారు.
గతంలో ఇన్ పేషెంట్ ఒక నెలకు సరాసరి 1100 ఉండగా ఈ సెప్టెంబర్ 2025 నెలలో 2300 మంది ఇన్ పేషెంట్ సర్వీస్ పొందారని, గతంలో ఆర్థోపెడిక్ సర్జరీలు సరాసరి నెలకు 9 మేజర్ 10 మైనర్ ఉండగా ఈ నెల 34 మేజర్ 27 మైనర్ శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగింది. జనరల్ సర్జరీ గతంలో మేజర్ మరియు మైనర్ కలిపి 20 కాగా ఈ నెల 45 నిర్వహించారు. గతంలో కంటి శస్త్ర చికిత్సలు పెద్దపల్లి లో ఆపరేషన్ థియేటర్ లేనందున మన కంటి వైద్యులు పెద్దపల్లి జిల్లా పేషెంట్ లను కరీంనగర్ ఆసుపత్రి లో సర్జరీ చేసేవారు. ఈ సంఖ్య నెలకు 20 ఉండగా, నూతనంగా ఏర్పాటు చేసిన కంటి ఆపరేషన్ థియేటర్ వల్ల సెప్టెంబర్ 2025 గాను 229 కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు.
గతంలో ఈ.ఎన్.టి, డెంటల్ సర్జరీ లు నిర్వహించే వాళ్ళు కాదని, గత నెల 15 ఈ.ఎన్.టి ప్రొసీజర్స్ మరియు 529 డెంటల్ ప్రొసీజర్స్ నిర్వహించారని, గతంలో రక్త పరీక్షలు నెలకు 15 వేలు సరాసరి చేసేవారని, నేడు ఆ సంఖ్య 31 వేలకు పెరిగిందని, గతంలో స్కానింగ్ సేవలు సరాసరి నెలకు 800 ఉండగా ఈ నెల 1960 స్కానింగ్ సేవలు చేశారు.
గతంలో టిఫ్ఫా స్కానింగులు , 2 డి ఎకో సేవలు జరిగేవి కావని, నేడు సెప్టెంబర్ నెలలో 123 టిఫ్ఫా స్కానింగ్ లు, 164 2డి ఎకో లు చేయడం జరిగిందని అన్నారు . గతంలో ఫిజియోథెరపీ సేవలు నెలకు 120 కాగా గత నెల 678 మందికి ఫిజియోథెరపీ సేవలు చేయడం జరిగింది.
జిల్లాలో 5148 గర్భిణీ స్త్రీలను నమోదు చేయగా, అందులో 4,581 గర్భిణీలను మూడు నెలల లోపే నమోదు చేశారు. వీరందరికీ 100 శాతం , నాలుగు గర్భిణీ పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రుల యందు నిర్వహించారు. రాష్ట్రీయ బాల స్వాస్త్ కార్యక్రమంలో 99882 విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. సమగ్ర టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమములో 72,495 మందికి ఛాతి ఎక్స్ రే లు నిర్వహించారు. ఇందులో 1097 టి.బి. వ్యాధి గ్రస్తుల గుర్తించి చికిత్స అందించు చున్నారు. ఎన్. సి. డి. స్క్రీనింగ్ 416530 మందికి 95% గా స్క్రీనింగ్ నిర్వహించారు. స్వస్థ్ నారి సశక్త్ పరివార అభియాన్ కార్యక్రమములో 104 శిబిరంలో నిర్వహించి 7634 మహిళలకు స్పెషలిస్ట్ డాక్టర్ ల చే పరీక్షలు నిర్వహించడం జరిగింది. అదనముగా 27210 మంది మహిళలకు ఆయుష్మాన్ మరియు బస్తీ దవాఖాన ల ద్వారా పరీక్షలు నిర్వహించడం జరిగింది అని అన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి