అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం బెంగళూరులో పరామర్శించారు*.
ఇటీవల పేస్మేకర్ ఇంప్లాంటేషన్ చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజా సేవలో చురుగ్గా పాల్గొనాలని, పూర్తి ఉత్సాహంతో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఆయన మార్గదర్శకత్వం అత్యంత అవసరమన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి