మాట్లాడుతున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు
**45 కోట్లతో మంథని కు నూతన ఏ.టి.సి మంజూరు*
**కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 10 కోట్ల మంజూరు*
**ఏటీసీ విద్యార్థులకు ప్రతి నెలా 2000 రూపాయల స్కాలర్ షిప్*
**మంథని క్యాంపు కార్యాలయంలో సీ.ఎం.ఆర్.ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీధర్ బాబు*
సరస్వతి నిలయంగా మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు.
సోమవారం రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని క్యాంపు కార్యాలయంలో రామగిరి కమాన్పూర్ మంథని ముత్తారం మండలాలకు సంబంధించి 87 మంది లబ్ధిదారులకు సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు, 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా *మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి వారంలోనే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని అన్నారు. వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వ ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సకాలంలో వేతనాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించే చెక్కులు, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు అమలు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని పేద ప్రజలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు.
పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించే దిశగా ఐటిఐ కేంద్రాలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేయడం జరిగిందని అన్నారు. ఏ.టి.సి కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఇటీవలే కాటారం లో 35 కోట్ల రూపాయలతో ఏటిసి ప్రారంభించామని మంత్రి తెలిపారు.
45 కోట్ల రూపాయల ఖర్చు చేసి మంథని పట్టణంలో నూతనంగా ఏటీసీ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. సరస్వతి నిలయంగా మంథని నియోజకవర్గం తీర్చిదిద్దుతున్నామని అన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ ఏ.టి.సి కేంద్రం ఏర్పాటు కాబోతుందని, దీనికి సహకరించిన ముఖ్యమంత్రి కు మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో తమ హయాంలో ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఐటిఐ సెంటర్, రైతు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. యువతకు మార్గదర్శకం చేసేందుకు ఏ.టి.సి సెంటర్ ఏర్పాటు కాబోతుందని అన్నారు.
మంథని ప్రజలకు ఉపయోగపడే విధంగా పట్టణంలో వివిధ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశామని అన్నారు. పట్టణంలో నిర్మించే కమ్యూనిటీ హాల్స్ మంథని ప్రజలు ఎవరైనా ఉపయోగించుకోవచ్చని అన్నారు.
మంథనీ పట్టణ హెడ్ క్వార్టర్ లో 30 కోట్ల రూపాయలతో అంతర్గత సిసి రోడ్లు వేసామని, అంబేద్కర్ విజ్ఞాన్ భవన్ నిర్మాణానికి కోటి రూపాయలు,మున్నూరు కాపు భవనానికి 60 లక్షల రూపాయలు మంజూరు చేసామని అన్నారు.
మధుర పోచమ్మ ఆలయ అభివృద్ధికి 25 లక్షల, వినాయక మండపం 10 లక్షలు, మహా లక్ష్మి దేవాలయానికి 10 లక్షలు, చిన్నప్ప-పెద్దప్ప ఆలయానికి 10 లక్షలు, మహిళా భవనానికి 50 లక్షల కేటాయించామని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు రిక్రియేషన్ అయ్యేందుకు 50 లక్షల మంజూరు చేశామని అన్నారు.
పేద ప్రజల ఇంట్లో వివాహాల సమయంలో ఇబ్బందులు కాకుండా ఉండేందుకు కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నామని అన్నారు. ప్రతి కమ్యూనిటీ వాళ్లు చిన్న కమిటీ ఏర్పాటు చేసుకుని త్వరగా తిను కమిటీ హాల్స్ నిర్మాణం పూర్తి చేసుకోవడంలో కృషి చేయాలని అన్నారు. కమిటీ హాల్స్ నిర్మాణానికి అవసరమైన భూమి ఎంపిక చేసి త్వరగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఏటీసీ కేంద్రంలో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతినెల 2000 రూపాయలను స్కాలర్షిప్ అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ. సురేష్, తహసిల్దార్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి