సమీక్షిస్తున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
* ఎన్నికల విధుల పట్ల సంపూర్ణ అవగాహన కలిగించేలా శిక్షణ కార్యక్రమాలు
* నామినేషన్ల స్వీకరణ కు మండలాల్లో పటిష్ట ఏర్పాట్లు
* స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో *స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణు* తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి నామినేషన్ స్వీకరణ కు మండల కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో అవసరమైన మేర కౌంటర్ లు ఏర్పాటు చేసి సంబంధిత ఎంపిటిసి స్థానాలకు నామినేషన్లు స్వీకరించాలని అన్నారు.
మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు ఎన్నికల నిర్వహణలో సంపూర్ణ మద్దతు ఎంపీడీఓ, ఎంపీఓలకు అందించాలని అన్నారు. ప్రతి మండలం ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన మేర అధికారులు నియామకం పూర్తి చేయాలని అన్నారు.
ఎన్నికల విధుల పట్ల అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండేలా పటిష్ట శిక్షణ అందించాలని అన్నారు. నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ తర్వాత పోటీ అభ్యర్థుల ప్రకటన, వారికి గుర్తుల కేటాయింపు తదితర అంశాల పై పూర్తి శిక్షణ అందించాలని అన్నారు.
మండలాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సంపూర్ణ సామాగ్రి అందించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్వీస్ ఓటర్లకు, పీడి యాక్ట్ కింద అరెస్టైన వారికి, ఎన్నికల విధులు నిర్వహించే వారికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేయడం జరుగుతుందని, మన ఓటర్ జాబితా పరిధిలో పోస్టల్ బ్యాలెట్ జారీ చేయాల్సిన వారి పేర్లు రౌండాఫ్ చేసుకోవాలని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వివరాలు, ఓటర్ జాబితా వివరాలు సంబంధిత పోటీ చేసే అభ్యర్థులకు సమాచారం అందించాలని అన్నారు. నామినేషన్ కేంద్రాల 100 మీటర్ల పరిధిలో ఎటువంటి ర్యాలీ , ప్రచారాలు అనుమతి లేవని, అభ్యర్ది తో పాటు 3 మాత్రమే అనుమతించడం జరుగుతుందని అన్నారు.
ఎన్నికల ప్రచార నిమిత్తం ర్యాలీ, సమావేశాల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారానికి అనుమతి మంజూరు చేయాలని, సౌండ్ సెట్, వాహానానికి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలని, ఎక్కడ కూడా పోటీదారులకు ఒకే రూట్ లో సమావేశాలు ర్యాలీలో నిర్వహణకు అనుమతి జారీ చేయవద్దని అన్నారు.
ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసేందుకు అక్రమంగా నగదు మద్యం తరలిస్తే పట్టుకుని సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల ఓట్ల కోసం కుల,మత విద్వేశాలు రెచ్చగొట్టకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు.
అధికారులు ఎన్నికల విధులను తమకు కేటాయించిన బుక్ లెట్ లోని నిబంధనల ప్రకారం పటిష్టంగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నిబంధనలపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ నరేందర్, డిపిఓ వీర బుచ్చయ్య,పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి