Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శనివారం, సెప్టెంబర్ 13, 2025

మంథని: రాజీమార్గమే.. రాజమార్గం

మాట్లాడుతున్న పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ( డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్  సెషన్స్ జడ్జి) సునిత కుంచాల

సుప్రీంకోర్టు ఆదేశానుసారం లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీమార్గమని, రాజీ చేసుకోవడం ఇరువురు గెలుపుకు నాంది పలుకుతుందని పెద్దపల్లి  జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సునిత కుంచాల అన్నారు. శనివారం మంథని పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జీ కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని  ఆమె మాట్లాడారు. లోక్ అదాలతో కక్షిదారులు ఇరువురు స్నేహపూర్వక వాతావరణముతో కలుసుకొని, కోపాలు, భావోద్వేగా లేకుండా, డబ్బులు, సమయం వృధా కాకుండా వారి సమస్యలను పరిష్కరించుకోవడం ఇరువురి కి సంతోష కారణమని, కక్షి దారులు రాజీమార్గంలో వచ్చినట్లయితే, ఒక ప్రక్క కోర్టుకు, మరొక ప్రక్క సమయం కూడా వృధా కాదని, ఇతర అత్యవసర కేసులో పరిష్కరించుటకు, సమయం దొరుకుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న కక్షి దారులు, ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో  సీనియరు సివిల్ జడ్జి శ్రీమతి వి భవాని, అడిషనల్  జూనియరు సివిల్ జడ్జీ కమారి ఎ.సుదారాణి,ద్వితీయ శ్రేణి  న్యాయాదికారిణి శ్రీమతి అనురాధ, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ బి సురేష్, గోదావరిఖని ఎసిపి శ్రీ మడత రమేష్,‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరి బాబు, తహసీల్దార్ కుమార స్వామి న్యాయవాదులు,వివిధ బ్యాంకుల అధికారులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మంథని: అవార్డు గ్రహీతకు మాజీ ఎమ్మెల్యే సన్మానం

ఉత్తమ సేవకే మంచి గుర్తింపు

విద్యార్ధులకు మంచి విద్యాబోధన అందిస్తూ వారిని ఉత్తములుగా తీర్చిదిద్దడంలో సేవలు అందించే వారికే మంచి గుర్తింపు లభిస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై అవార్డు అందుకున్న మంథనికి చెందిన గీట్ల భరత్‌రెడ్డిని శనివారం మంథనిలోని ఆయన నివాసంలో కలిసి శాలువా పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం మంథనికే గర్వకారణమన్నారు. అంకితభావంతో పని చేస్తూ విద్యార్ధుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని ఆయన ఆకాంక్షించారు.

మంథని: సాయి సంస్థాన్ లో సాముహికసౌందర్యలహరి పారాయణం

వేదగడ్డగా ప్రసిద్ధిగాంచిన మంత్రపురిలోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ లో శుక్రవారం రాత్రి మహిళా భక్తులు సౌందర్యలహరి పారాయణం నిర్వహించారు. శ్రీ సాయిబాబా హారతి కార్యక్రమం అనంతరం సౌందర్యలహరి పారాయణం ప్రారంభించారు. గంటన్నర పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు ఓకే కంఠం స్వరంతో శ్లోకాలు చదువుతూ భక్తులను అలరింపజేశారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన మంథని పట్టణంలో అనేక దేవాలయాలు కొలువుతీరి ఉన్నాయి. మంత్రపురిగా ప్రసిద్ధిగాంచిన మంథనిలో ప్రతినిత్యం ఆధ్యాత్మిక శోభ విరసిల్లుతుంది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులతో పాటు ఆలయ కమిటీ అధ్యక్షురాలు మహావాది జలజ సత్యనారాయణ, ఆలయ అర్చకులు రామడుగు సాయి శ్రీనివాస్ తో పాటు భక్తులు పాల్గొన్నారు.

శుక్రవారం, సెప్టెంబర్ 12, 2025

భూపాలపల్లి అన్ని పాఠశాలల్లో ఏ ఐ లాబ్స్

మాట్లాడుతున్న రాష్ట్ర  ఐటీ మంత్రి శ్రీధర్ బాబు 
 
వీడియో కోసం క్లిక్ చేయండి 
https://youtube.com/shorts/ugJK4LyrrOQ?si=SFN5rWjTq5lLmwJL

అన్ని పాఠశాలల్లో యుద్ధ ప్రాతిపదికన ఏ ఐ లాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం మహా ముత్తారం మండలంలో 2 కోట్ల 30 లక్షలతో నిర్మించిన కేజీవిబి జూనియర్ కళాశాల భవన ప్రారంభోత్సవం, మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.70 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారుల నిర్మాణానికి, రూ.72 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడి భవనాలు, 7 గ్రామ పంచాయతీల్లో 1 కోటి 40 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.  
ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే  విద్యకు పెద్ద పీట వేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు ద్వారా అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. నాణ్యమైన విద్యాబోధనకు  డీఎస్సీ నిర్వహించి
టీచర్ల నియామకం చేపట్టామని, 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. విద్యార్థులకు
కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచి  నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి తమ కాళ్ళపై తాము నిలబడాలన్నదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. నా కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది లేకపోవడం వల్ల నన్ను  ఆంగ్లమాద్యమంలో చదివానని, నాలాగే  విద్యార్థులు ఇంగ్లీష్ లో చదవాలని, బాలికా విద్యకు ఇబ్బంది కలగకూడదని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మన ప్రాంతానికి పెద్ద ఎత్తున కెజిబివి, మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు.
విద్యార్థులు ఒక ప్లాన్ ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక పుస్తకం ఖచ్చితంగా చదవాలని, చదివిన చదువు తప్పక ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగ పడుతుందన్నారు.
గ్రామంలో ఒక్కరు చదువుకున్నా ..వారు మాత్రమే కాకుండా మొత్తం గ్రామమే బాగుపడుతుందని తెలిపారు.10 వతరగతి పరీక్షలలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. కెజిబివిలో 10 వతరగతి విద్యార్థులకు టి ఫైబర్ ద్వారా ఏ.ఐ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు చక్కగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదిగి మన గ్రామానికి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భూపాల్జిపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి, ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కోట రాజాబాపు,  సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిర్మల సమ్మయ్య, డీఈఓ రాజేందర్, ఈఈలు, కెజిబివి ఎస్ఓ పుష్పవతి, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

గురువారం, సెప్టెంబర్ 11, 2025

మంథని: నేడు కాటారంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

   
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాశనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శుక్రవారం మంథని నియోజకవర్గం లోని కాటారం లో పర్యటించానున్నారు. ఉదయం 11 గంటలకు మహ ముత్తారం మండలంలో 2 కోట్ల 30 లక్షలతో నిర్మించిన కేజీబీవీ జూనియర్ కాలేజ్ భవన ప్రారంభం,అక్కడే  పోలారం, కొర్లకుంట, మహబూబ్ పల్లి, నిమ్మగూడెం, ములుగు పల్లి, మాదారం నూతన గ్రామ పంచాయతీ భవనాలకు, 6 అంగన్వాడీ నూతన భవనాలకు,70 లక్షల సిఆర్ఆర్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు 20 లక్షలతో నిర్మించబోతున్న బోర్ల గూడెం నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన మరియు అంగన్వాడి నూతన భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.

ముత్తారం.. కృత్రిమ మేధస్సుపై విద్యార్థులకు అవగాహన

- రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు

 అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి

  కృత్రిమ మేధస్సు పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని  రాష్ట్ర ఐ.టి,  పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు.

గురువారం రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి  ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్, ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఎల్ఎంఎస్ పుస్తకాల పంపిణీ, టి ఫైబర్ ద్వారా గ్రామానికి ఏర్పాటుచేసిన సీసీటీవీ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ప్రతి ఇంటి వద్ద టి ఫైబర్  కనెక్షన్ అందించడం జరిగిందని అన్నారు.   పాఠశాలలో ఏఐ ల్యాబ్ ద్వారా ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందుతుందని అన్నారు.
హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మారుమూల ముత్తారం ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యం కల్పించేందుకు ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 
భవిష్యత్తులో వచ్చే సాంకేతికతను అలవాటు చేసుకుంటూ పోటీ ప్రపంచానికి విద్యార్థులను సిద్ధం చేయాలని అన్నారు.
మంథని నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో డిజిటల్ క్లాస్ లను ఏర్పాటు చేయాలని, దీని కోసం సిఎస్ఆర్ నిధులు వినియోగిస్తామని అన్నారు. రోబోటిక్స్, డ్రైవర్ లెస్ కార్లు వంటి సాంకేతిక అంశాలు పిల్లలకు నేర్పాలని అన్నారు. మంథని లో ఉన్న ప్రోటో టైపింగ్ ఇన్నోవేషన్ సెంటర్ ను  విద్యార్థులు వాడుకోవాలని మంత్రి సూచించారు. 
ఏఐ టూల్స్ (కృత్రిమ మేధస్సు) పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుందని అన్నారు. టీచర్స్ కు కూడా ఏ.ఐ బోధన  పై శిక్షణ అందిస్తామని అన్నారు.   పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్ రావాల్సిన అవసరం ఉందని, దీని కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసింగ్ అందజేశారు. మరియు అడవి శ్రీరాంపూర్ గ్రామపంచాయతీ లోని టీ ఫైబర్ ద్వారా హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ కు అనుసంధానమైన టెక్నాలజీని ప్రారంభించారు.
అంతకుముందు ముత్తారం మండలంలోని దర్యాప్పూర్ వద్ద 2 కోట్ల 80 లక్షల, పోతారం వద్ద రెండు కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న సబ్ స్టేషన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ముత్తారం తాసిల్దార్ కార్యాలయంలో 18 మంది కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. డి ఎం ఎఫ్ టి నిధుల ద్వారా ముత్తారం మండలంలోని పలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల మరమత్తు కోసం రెండు కోట్ల 81 లక్షలతో చేపట్టిన పనులను మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో  గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ గౌడ్,  ఆర్.డి.ఓ. సురేష్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్,  తహసిల్దార్, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు,  తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి: అటవీ శాఖ అమరవీరులకు జోహార్లు

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష
అటవీ అమరవీరులకు జోహార్లు తెలుపుతూ నివాళులు అర్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష  తెలిపారు.
గురువారం జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమంలో*  పాల్గొన్నారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,*  విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బంది జోహార్లు అర్పిస్తూ అటవీ అమరవీరుల స్ఫూర్తితో అడవుల సంరక్షణకు అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. 
అనంతరం అటవి శాఖ సిబ్బంది చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు.
అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. 
ఈ  కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

మంథని: విద్యారంగ అభివృద్ధికి కృషి

రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు*
**మంథని  మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు 

మంథని ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తామని   రాష్ట్ర ఐ.టి,  పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు.

గురువారం  మంథని ప్రాంతంలో రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంథని మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించారు.

మంథని మున్సిపాలిటీలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ సెంటర్ కు మంత్రి శంకుస్థాపన చేశారు.  పట్టణంలో ఎంపిపిఎస్ బాలికల పాఠశాల లో టీచ్ ఫర్ చేంజ్ (మంచు లక్ష్మి ఫౌండేషన్) ఆధ్వర్యంలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు.  

ఈ సందర్భంగా *మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,* 
  పేదలకు నాణ్యమైన విద్య అందాలని స్వచ్ఛంద సంస్థ  టీచ్ ఫర్ చేంజ్ ద్వారా సేవలు అందిస్తున్న మంచు లక్ష్మి, ఇతర ప్రతినిధులకు  ప్రత్యేక అభినందనలు తెలిపారు.

విద్య, వైద్య రంగాలలో స్పష్టమైన మార్పు తీసుకుని రావాలని ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.  మంథని నియోజకవర్గ పరిధిలో 6 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుతో పాటు పిల్లల వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో టీచ్ ఫర్ చేంజ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.  సమాజంలో మంచి జర జరగాలని నిస్వార్ధంగా కృషి చేస్తున్న మంచు లక్ష్మి గారికి అభినందనలు తెలిపారు. 

విద్యా రంగంలో అభివృద్ధి కోసం ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు తమ సహకారం అందించడం సంతోషకరమని అన్నారు. విద్యతో విజ్ఞానం వస్తుందని, బాగా చదువుకున్న తర్వాత నాయకులుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. 

మంథని నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని అన్నారు. 

**జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,*  ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు ఏర్పటు చేస్తూ పిల్లలకు మెరుగైన బోధన అందించేందుకు సహకారం అందిస్తున్న టీచ్ ఫర్ చేంజ్ సంస్థ స్థాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు డిజిటల్ తరగతులను, మూడు సంవత్సరాల వరకు టీచ్ ఫర్ చేంజ్ సంస్థ అందించే కరి కులం ను సద్వినియోగం చేసుకుంటూ పిల్లల్లో మంచి మార్పు తీసుకుని రావాలని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందని, అవసరమైన పాఠశాలల్లో ప్రహరీ గోడ, అదనపు తరగతులు, టాయిలెట్స్ అవసరమైన మరమ్మత్తు పనులు చేపట్టామని అన్నారు. 

**టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ప్రతినిధులు ప్రముఖ నటులు మంచు లక్ష్మి మాట్లాడుతూ,*  మంథని లో  6  తరగతి గదులను డిజిటలైజ్  చేయడం జరిగిందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మొత్తం మా సంస్థ ద్వారా 51 తరగతి గదులలో డిజిటల్ సౌకర్యాలు కల్పించామని అన్నారు. 

తమ కుటుంబ నేపథ్యం విద్య రంగం నుంచి వచ్చిందని, తమ తాతగారు హెడ్ మాస్టర్ గా పని చేసేవారని తెలిపారు. మంచి నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో  టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 

పిల్లలు మంచి నాయకత్వ లక్షణాలు, జీవితంలో ఒక మంచి లక్ష్యం కలిగి ఉండాలని అన్నారు. పిల్లలు అందరూ డాక్టర్లు, ఇంజనీర్ కలెక్టర్ వంటి పెద్ద స్థాయికి చేరుకోవాలని అన్నారు.     మా సంస్థ సహకారంతో ఇక్కడి పాఠశాలల్లో మంచి మార్పులు వస్తే మరిన్ని పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ముందుకు వస్తామని అన్నారు. 

అనంతరం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో  విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్స్ , మంథని రామగిరి కమాన్ పూర్ మండలంలో ఎంపికైన 205 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని,  ప్రతి సోమవారం లబ్ధిదారులకు  ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా నిధులు జమ చేయడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో  గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, మంథని మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వెంకన్న,ఆర్.డి.ఓ. సురేష్, సహకార సంఘ అధ్యక్షులు శ్రీనివాస్, తహసిల్దార్, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బుధవారం, సెప్టెంబర్ 10, 2025

మంథని: నేడు మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  గురువారం మంథనిలో పర్యటించనున్నారు. ఉదయం 9 30 నిమిషాలకు మంథనిలోని శ్రీపాద కాలనీ వద్ద 80 లక్షలతో నిర్మించబోతున్న నూతన (SPM) ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ సెంటర్ శంకుస్థాపన చేయనున్నారు. 10 గంటలకు మంథని మున్సిపాలిలోని ఎంపీపీఎస్ గర్ల్స్ పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ -(మంచు లక్ష్మీ ఫౌండేషన్) ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభోత్సవం చేయనున్నారు.  12-00 గంటలకు మంథని మంత్రి క్యాంప్ కార్యాలయంలో Fortune RAMA వారి విద్యార్థులకు బుక్స్ & బ్యాగ్స్ మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.12 గంటల 30 నిమిషాలకు మంత్రి  క్యాంప్ కార్యాలయంలో  మంథని,రామగిరి, కమాన్ పూర్, 205 ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు  మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ముత్తారం మండలంలో దర్యాపూర్ వద్ద  రెండు కోట్ల 80 లక్షలతో నిర్మించబోతున్న దర్యాపూర్ సబ్ స్టేషన్ మరియు రెండు కోట్ల 20 లక్షలతో నిర్మించబోతున్న పోతారం సబ్ స్టేషన్ ను శంకుస్థాపన చేయనున్నారు. 2న గంటల 30 నిమిషాలకు ముత్తారం ఏంఆర్ఓ కార్యాలయం వద్ద 18 కళ్యాణ లక్ష్మి చెక్కులు, ముత్తారం ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభోత్సవం మరియు 20 లక్షలతో జిల్లాలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం,12 లక్షలతో లక్కారం అంగన్వాడి భవనం శంకుస్థాపన మరియు డిఎంఎఫ్ టి నిధుల నుండి ముత్తారం మండలంలోని పలు పాఠశాల, అంగన్వాడి రిపేర్లు రెండు కోట్ల 81 లక్షలు పనులను,మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు .
మధ్యాహ్నం 3-00 గంటలకు ముత్తారం మండలం లోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా AI కంప్యూటర్ ల్యాబ్ మంత్రిగారి చేతుల మీదుగా ప్రారంభం, మరియు పాఠశాలలోని ఉపాధ్యాయులకు విద్యార్థులకు LMS బుక్స్ పంపిణీ, అడవి శ్రీరాంపూర్ గ్రామం లో టీ ఫైబర్ సిఎస్ఆర్ ద్వారా గ్రామనికి సీసీటీవీ ప్రారంభోత్సవం చేయనున్నారు, ఇందిరమ్మ ఇంటి పత్రాల పంపిణీ మంత్రిగారి చేతుల మీదుగా చేయనున్నారు.

ఘనంగా సంకష్ట హర చతుర్థి

సంకటాలు తొలిగించే వ్రతం
భాద్ర పద మాసం శుక్లపక్షము బుధవారం రోజున సంకష్టహర చతుర్థి పూజలు భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని పట్టణంలోని శ్రీ మహాగణపతి ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు.
ప్రాముఖ్యత :
సంకటము' అంటే ఇబ్బంది, బాధ, కష్టము, ఆపద మొదలైన అర్థాలను చెప్పుకోవచ్చు. వీటన్నింటినీ తొలగించేదే "సంకటహర వ్రతం". గణపతిని ఆలంబనగా చేసుకుని ఆచరించే ఈ వ్రతానికి 'సంకష్టహర చతుర్థి' అని కూడా పేరు. దీన్నే సంకస్ట హర చవితి (సంకటహర చవితి) అని కూడా అంటారు.
గణపతి విఘ్నాలను కలిగించే దేవుడని, ప్రతీ పనిలోనూ ముందుగా ఆయనను పూజిస్తే మాత్రం విఘ్నాలను కలిగించడనే భావన ఉంది. కానీ ఆ భావన సరికాదు. వాస్తవానికి చెడు పనులకు విఘ్నాలను కలిగించి, మంచి పనులు నిరాటంకంగా సాగింపజేసే దైవమే గణపతి. కాగా ఈ సంకటహర వ్రతాన్ని ఆచరించడం వలన ఇబ్బందులు తొలగి అనుకున్న పనులు నెరవేరుతాయని శాస్త్రాల్లో  పేర్కొనబడింది. సంకటహర వ్రతాన్ని ప్రతీ నెలలో కూడా ఆచరించవచ్చు. నెలలో బహుళములో పౌర్ణమి తర్వాత  వచ్చే చవితి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. అంటే పౌర్ణమి తరువాత 3-4 రోజులలో ఈ సంకటహర చవితి వస్తుంది.
ఇక ప్రదోషకాలములో అంటే సూర్యాస్తమయ సమయములో ఏ రోజున చవితి ఉంటుందో ఆ రోజుననే సంకటహర చవితిని ఆచరించాలి. సాధారణంగా రెండు రోజులలో సూర్యాస్తమయ సమయానికి చవితి ఉండటం జరుగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగినప్పుడు రెండవ రోజునే సంకటహర చవితిని జరుపుకోవాలి. అవకాశాన్ని బట్టి 3,5,9,11,21 నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.
సంకటహర వ్రతాన్ని నెలలో బహుళ చవితిరోజున ప్రారంభించాలి. వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని, ఆ తరువాత తలంటుస్నానాన్ని చేయాలి. తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించి పూజకు సిద్ధం చేసుకోవాలి. ఇంటిలోని దేవునిగదిలోనో లేదా అనుకూలమైన చోట పీటవేసి, దానిపై ముగ్గును వేయాలి. పీటపై గణపతి విగ్రహాన్ని కాని, చిత్రపటాన్ని కాని నెలకొల్పుకోవాలి. తరువాత ఒక చిన్నపళ్ళెములో బియ్యాన్ని పోయాలి. అనంతరం పసుపుముద్దతో మహాగణపతిని చేసుకొని ఒక తమలపాకుపై ఆ పసుపుతో గణపతిని ఉంచాలి. తరువాత ఆ తమలపాకు కొన తూర్పు వైపునకు లేదా ఉత్తరం వైపుగా ఉండేటట్లుగా పళ్ళెంలో బియ్యముపై ఉంచి నిర్విఘ్నంగా వ్రతం పూర్తయ్యేందుకు, మహా గణపతి పూజను చేయాలి.
ఆ తరువాత ఎరుపు లేదా తెల్లని వస్త్రాన్ని (జాకెట్పసును) తీసుకొని దానికి నాలుగు వైపుల పసుపును పూయాలి. అనంతరం వస్త్రాన్ని స్వామిముందు వరచి, అనుకున్న కోరికను నెరవేర్చమని ప్రార్థించాలి.
స్వామిని తలచుకుంటూ మూడు దోసిళ్ళ బియ్యాన్ని వస్త్రంపై వేయాలి. అదేవిధంగా రెండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ ఉంచిన తాంబూలాన్ని బియ్యంలో ఉంచాలి. తిరిగి మరొక్కసారి మనసులో కోరికను నెరవేర్చమని స్వామిని వేడుకుంటూ, దాన్ని మూటగా కట్టాలి. అనంతరం యధావిధిగా గణపతిని పూజించాలి. పూజలో గణపతికి ఇష్టమైన దూర్వాలు ( గరికను ) సమర్పించాలి. గణపతి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించి 21 ప్రదక్షిణలు చేయాలి.  సూర్యాస్తమయం తరువాత తిరిగి స్నానం చేసి గణపతి ముందు దీపారాధనను చేసి, లఘువుగా స్వామిని పూజించాలి. చంద్రోదయ సమయం సమయం తర్వాత భోజనం చేయాలి. వ్రతం చేసిన రోజున సూర్యాస్తమయం అయ్యేంతవరకు (సాయంకాల పూజ పూర్తయ్యేంత వరకు) ఉప్పు కలిపిన పదార్థాల్ని, ఉడికిన పదార్థాలను తినకూడదు. పాలు తీసుకోవచ్చు. ఈ విధంగా అనుకున్నన్ని నెలలు (3,5,11 లేదా 21 చవితులు) వ్రతాన్ని ఆచరించాలి. నియమం పూర్తయిన తరువాత ముడుపు కట్టిన బియ్యాన్ని తీపిగా పొంగలి చేసి గణపతికి నివేదించి, వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ వ్రతం వలస అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయని శాస్త్రాల్లో వివరించబడింది.

రచయిత: 
మహావాది సతీశ్ కుమార్, 
సీనియర్ జర్నలిస్ట్

సోమవారం, సెప్టెంబర్ 08, 2025

మంథనిలో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభం




 




హైదరాబాద్: నియో పోలీస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రారంభం

 కోకాపేట వద్ద నియో పోలీస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గండిపేట వద్ద గోదావరి ఫేజ్  2&3 శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ
హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.
హైదరాబాద్ నగరంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గోదావరి, కృష్ణా, మంజీరా జలాలను ఇక్కడికి తీసుకొచ్చింది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం విఫలమైంది.
మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జంటనగర వాసులకు తాగునీటికి ఇబ్బంది కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ బృహత్తర  ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. ఇదే మార్పునకు సంకేతం. 
భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేలా అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నాం. వాటిని పకడ్బందీగా అమలు చేస్తున్నాం.
భావితరాల కోసమే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం. నగరవాసులకు అంతర్జాతీయ జీవన ప్రమాణాలను అందించాలన్నదే మా సంకల్పం అన్నారు. 
కార్యక్రమంలో మంత్రి  వివేక్ వెంకటస్వామి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

మంథని: మంథని ఠాణాను ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా సోమవారం రాత్రి మంథని పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించడంతో పాటు, స్టేషన్‌ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్‌ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను పోలీస్‌ కమిషనర్‌ సంబంధిత స్టేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్  సిబ్బందితో మాట్లాడి  రికార్డ్ లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై సీపీ ఆరా తీయడంతో పాటు నేరాల నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలను సీఐ రాజు, ఎస్ఐ రమేష్ ని అడిగి తెలుసుకొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించాలని, గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంథని సీఐ బి రాజు,ఎస్సై డేగ రమేష్ , కానిస్టేబుల్ లు సిబ్బంది పాల్గొన్నారు.

హైదరాబాద్: ఆదిలాబాద్ సిమెంటు ప్లాంటును పునరుద్ధరించాలి

 సిసిఐ ఉన్నతాధికారులతో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఖాయిలా పడిన సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆదిలాబాద్ ప్లాంటును పునురుద్ధరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరిశ్రమను తిరిగి నడిపించాలని సిఎం రేవంత్ రెడ్డి, తానూ పలు సందర్బాల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెడ్ డి కుమారస్వామిని కలిసి కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు.

సోమవారం నాడు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిసిఐ సిఎండీ సంజయ్ బంగా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పునరుద్ధరణ ప్రతిపాదనలపై శ్రీధర్ బాబు చర్చించారు. ప్లాంటును ఆధునిక యంత్రాలతో పునరుద్ధరించడానికి రూ. 2 వేల కోట్లు అవసరమవుతాయని సిఎండి చెబ్తున్నారని, అది జరిగితే మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుందని శ్రీదర్ బాబు తెలిపారు. వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని ఈ భారీ పరిశ్రమను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే రివైవ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్బాల్లో కోరారని తెలిపారు. కేంద్రం ప్రతిపాదిస్తున్నట్టుగా ప్లాంటు ప్రైవేటీకరణను (డిస్ ఇన్వెస్ట్ మెంటును) తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పునురుద్ధరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సిసిఐ కోరుతోందని, త్వరలోనే దీనిపైన తమ అభిప్రాయాలను అందచేస్తామని వెల్లడించారు.

రెండు వేల ఎకరాల్లో నాణ్యతతో కూడిన సున్నపురాయి గనులు ఉన్నందున ప్లాంటు నిర్వహణ అసాధ్యమేమీ కాదని శ్రీధర్ బాబు చెప్పారు. సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ ముఖ్యకార్యదర్శి ఎన్. శ్రీధర్, గనుల శాఖ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, టిజిఐఐజి ఎండీ శశాంక తాండూరు సిసిఐ ప్లాంట్ జిఎం శరద్ కుమార్, సిసిఐ రీజినల్ మేనేజర్ ఉమేశ్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారిలు కూడా సమావేశానికి హాజరై తమ సూచనలను వెల్లడించారు.



మంథని: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న భరత్ రెడ్డి

మంథని: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా నిలిచిన మంథని పట్టణానికి చెందిన భరత్ రెడ్డిని విద్యా శాఖ మిషనర్ శ్రీదేవసేన శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో అవార్డు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మంథని బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా పనిచేస్తున్న భరత్ రెడ్డి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం పట్ల పాఠశాల సహచర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు, భరత్ రెడ్డిని విద్యార్థిని, విద్యార్థులు, మంథని ప్రజానికం హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: చికితను అభినందించిన సీఎం

జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో పెద్దపల్లి నియోజకవర్గం ఎలిగేడు మండలం, సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత కెనడాలో జరిగిన మహిళా ఆర్చరీ 25 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో భారతదేశం తరపున బంగారు పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే.  చికిత, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డినీ మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా ఆమెను వారు అభినందించి మాట్లాడారు. ఒలంపిక్స్ లో పతకం సాధించేలా చికిత కి ప్రభుత్వం తరఫున పూర్తి శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు , స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మంథని: ట్రైబల్ కనెక్టివేటీ రోడ్లకు నిధులు మంజూరు

మంథని నియోజకవర్గం పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన గిరిజన గ్రామాల అనుసంధానం (ట్రైబల్ కనెక్టివిటీకి) రోడ్లకు సంబంధించి మహాముత్తారం, కాటారం మండలాలలో మూడు బిటి రోడ్ల పనులకు రూ.10 కోట్ల 66 లక్షల నిధులు ప్రభుత్వం నుండి మంజూరు అయినట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన రెండు మండలాలైన కాటారం, మహాముత్తారం కు సంబంధించిన నిధులు మంజూరైన  మూడు బిటి రోడ్డు పనుల వివరాలను వారు ఈ ప్రకటనలో వివరించారు. కాటారం మండలం లో రూ. 4 కోట్ల 45 లక్షలు 30వేలు ప్రతిపాదిత వ్యయంతో 4.20 కిలోమీటర్ల దేవరంపల్లి టు ఎడ్లపల్లి బీటీ రోడ్డు, మహాముత్తారం మండలం ఎర్రం టు నర్సింగాపూర్ ఎక్స్ రోడ్ వయా మీనాజీపేట రెండు కిలోమీటర్లు బిటి రోడ్ కు రూ. కోటి 96 లక్షల 52వేలు, మహాముత్తారం మండలం  ప్రేమ్ నగర్ టు నందిగామ 4.80 కిలోమీటర్ల రోడ్డుకు రూ.4 కోట్ల 24 లక్షల 90 వేలు మంజూరైనట్లు పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మహాముత్తారం, కాటారం మండలల ప్రజలు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్: రాష్ట్రంలో ‘ఏఐ’ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్


*ఆస్ట్రేలియా ‘డికన్ యూనివర్సిటీ’ భాగస్వామ్యంతో ఏర్పాటు

*మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై సంతకాలు

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ఏఐ’ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ‘డికన్(Deakin) విశ్వవిద్యాలయం’ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్ వోఐ)పై సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ‘డికన్ యూనివర్సిటీ’ వీసీ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా సంతకాలు చేశారు*. 

అనంతరం ఈ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్పిడి చేసుకున్నారు. ‘అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా ఏఐ రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ఏఐలో నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు డికన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నాం. ఇది కేవలం లాంఛనప్రాయ ఒప్పందం కాదు. రాబోయే రోజుల్లో కీలక రంగాల్లో తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షి సంబంధాల మెరుగుదలకు దిక్సూచీగా మారుతుంది. సమాజానికి ఉపయోగపడే అత్యాధునిక ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో పాటు పరిశోధనలు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. 

* ఏఐ కోర్సుల రూపకల్పన, శిక్షణ, స్టార్టప్ లకు చేయూత 

‘ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ రంగాల్లో ప్రపంచానికి అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను తెలంగాణ నుంచే అందించాలని లక్ష్యంగా పెట్టుకుని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ సంయుక్తంగా నేటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏఐ కోర్సులకు రూపకల్పన చేసి, ఇక్కడి యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణనిస్తాయి. మన ఏఐ స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ లో తెలంగాణ బ్రాండ్ ను మరింత విశ్వ వ్యాప్తం చేసేలా ఆస్ట్రేలియా నిపుణులు మార్గదర్శకత్వం చేస్తారు ’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.

* ఏఐ ఆధారిత పౌర సేవలను అందించేలా...

‘ఏఐ కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాకుండా, సమ్మిళిత వృద్ధికి, మానవాభివృద్ధికి ఒక శక్తివంతమైన సాధనంగా మార్చేలా మా ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తోంది. ఈ లక్ష్య సాధనలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ మార్గదర్శిగా మారుతుంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గవర్నెన్స్ తదితర రంగాల్లో ఏఐ వినియోగాన్ని పెంచి పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించేలా సంయుక్త పరిశోధనలు నిర్వహిస్తాం. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలను కనుగొనేందుకు కృషి చేస్తాం’ అని తెలిపారు.

* అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం; ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, వీసీ, డికన్ యూనివర్సిటీ 

‘ఏఐలో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం. ప్రజల శ్రేయస్సు కోసం సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన ఏఐ పరిష్కారాలను అందించాలనే లక్ష్యంతోనే భారత్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని గుర్తించాం. అందుకే ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాం’ డికన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కాన్సూల్ జనరల్(ఆస్ట్రేలియన్ కాన్సూలేట్- జనరల్ బెంగళూరు) స్టీవెన్, కాన్సూల్ ఆండ్రూ కాలిస్టర్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కమిషనర్ వికా సింగ్, పొలిటిల్ అండ్ ఎకానమిక్ రీసెర్చ్ ఆఫీసర్ రంజని మాధవన్, డికన్ యూనివర్సిటీ ప్రతినిధులు రౌనీత్ పాహ్వా, ప్రియాంక సింగ్, గాయత్రి వేద్ నారాయణన్ తదితరులు పాల్గొన్నారు.




పెద్దపల్లి: 10న స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితా ప్రచురణ

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షిస్తున్న పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష

 సెప్టెంబర్ 10న స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితా ప్రచురణ జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ లో  స్థానిక సంస్థల ఓటర్, పోలింగ్ కేంద్రాల జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణకు డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను విడుదల చేయడం జరిగిందని అన్నారు.  650 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 

గత ఎన్నికలతో పోలిస్తే వివిధ గ్రామాలలో మున్సిపాల్టీల్లో విలీనం అవ్వడం కారణంగా 3 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయని, ప్రస్తుతం జిల్లాలో 137 ఎంపిటిసి, 13 జడ్పిటిసి స్థానాలకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయన్నారు.

ఒక మేజర్ గ్రామ పంచాయతీ  2 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఉంటే ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఒకే ఎంపీటీసీ స్థానంలో ఓటర్లుగా ఉండేలా చర్యలు చేపట్టామని అన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్న సెప్టెంబర్ 8 సాయంత్రం లోపు అందించాలని, సెప్టెంబర్ 9న అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 10న తుది ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 

ఓటర్ జాబితా లో అర్హులైన నూతన ఓటర్ల ను రెవెన్యూ డివిజన్ అధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో కలపాలని అన్నారు.  

ఈ సమావేశంలో  సంబంధిత  అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గోన్నారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026