ఉత్తమ సేవకే మంచి గుర్తింపు
విద్యార్ధులకు మంచి విద్యాబోధన అందిస్తూ వారిని ఉత్తములుగా తీర్చిదిద్దడంలో సేవలు అందించే వారికే మంచి గుర్తింపు లభిస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై అవార్డు అందుకున్న మంథనికి చెందిన గీట్ల భరత్‌రెడ్డిని శనివారం మంథనిలోని ఆయన నివాసంలో కలిసి శాలువా పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం మంథనికే గర్వకారణమన్నారు. అంకితభావంతో పని చేస్తూ విద్యార్ధుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని ఆయన ఆకాంక్షించారు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి