పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష
అటవీ అమరవీరులకు జోహార్లు తెలుపుతూ నివాళులు అర్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమంలో* పాల్గొన్నారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బంది జోహార్లు అర్పిస్తూ అటవీ అమరవీరుల స్ఫూర్తితో అడవుల సంరక్షణకు అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
అనంతరం అటవి శాఖ సిబ్బంది చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు.
అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి